యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
'ఫిట్ ఇండియా క్విజ్ - 2021' లో విద్యార్థులు అర్హత సాధించేలాబహుళ అవకాశాలను అందించడానికి రెండు ప్రిలిమినరీ రౌండ్లు
Posted On:
15 NOV 2021 2:43PM by PIB Hyderabad
ముఖ్యాంశాలు..
'ఫిట్ ఇండియా క్విజ్ - 2021' లో ప్రిలిమినరీ రౌండ్‌లో విజేతలు డిసెంబర్ నెలలో జరిగే స్టేట్ రౌండ్‌లో పాల్గొంటారు. రాష్ట్ర రౌండ్‌లో విజేతలు జనవరి - ఫిబ్రవరి 2022లో జరిగే జాతీయ స్థాయిలో పాల్గొంటారు. ఈ ఏడాది ప్రారంభంలో మొదలు పెట్టిన ఫిట్ ఇండియా క్విజ్-2021 మొదటి ఎడిషన్ ఇక రెండు ప్రిలిమినరీ రౌండ్‌లను కలిగి ఉంటుంది, తద్వారా విద్యార్థులు పరీక్షలో పాల్గొనడానికి ఒకటి లేదా రెండింటినీ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. రెండు ప్రాథమిక రౌండ్ల తర్వాత, తదుపరి దశకు విద్యార్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి రెండు పరీక్షల ఫలితాలను కలిపి మెరిట్ జాబితాను రూపొందిస్తారు. రెండుసార్లు పరీక్షకు హాజరైన వారి విషయంలో.. రెండు పరీక్షలలో అత్యుత్తమ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. రెండవ ప్రిలిమినరీ రౌండ్ తేదీ మరియు సమయం త్వరలో ప్రకటించబడుతుంది. ప్రిలిమినరీ రౌండ్‌లో విజేతలు డిసెంబర్ నెలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల రౌండ్‌లలో పాల్గొంటారు. రాష్ట్ర రౌండ్‌లో విజేతలు జనవరి - ఫిబ్రవరి 2022లో జాతీయ స్థాయిలో పాల్గొంటారు. ప్రతి స్థాయిలో క్విజ్ విజేతలు భారతదేశం యొక్క 1వ ఫిట్ ఇండియా స్టేట్/జాతీయ స్థాయి క్విజ్ ఛాంపియన్‌గా పిలవబడే గౌరవంతో పాటుగా.. నగదు బహుమతులను గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది. భారతదేశం గొప్ప క్రీడా చరిత్ర గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం, భారతదేశంలోని శతాబ్దాల నాటి స్వదేశీ క్రీడలు మరియు మన జాతీయ మరియు ప్రాంతీయ క్రీడా హీరోల గురించి తెలియ చెప్పడం ఈ క్విజ్ యొక్క ప్రధాన లక్ష్యం.
(Release ID: 1771978)
Visitor Counter : 162