ప్రధాన మంత్రి కార్యాలయం
ఝార్ ఖండ్ వాసుల కు ఝార్ ఖండ్ స్థాపనదినం నాడు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
15 NOV 2021 10:21AM by PIB Hyderabad
ఝార్ ఖండ్ స్థాపన దినం సందర్భం లో ఆ రాష్ట్ర ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భగవాన్ బిర్ సా ముండా గారి ఈ చరిత్రాత్మకమైన గడ్డ అభివృద్ధి మార్గం లో పురోగమించాలి అనే అభిలాష ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘ఝార్ ఖండ్ రాష్ట్ర స్థాపన దినాన్ని పురస్కరించుకొని ఆ రాష్ట్రం నివాసులు అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. భగవాన్ బిర్ సా ముండా కు జన్మనిచ్చిన గడ్డ గా చరిత్రాత్మకమైన గుర్తింపు ను పొందినటువంటి, తనదైన ప్రత్యేక సంస్కృతి ని కలిగినటువంటి ఈ రాష్ట్రం అభివృద్ధి పథం లో పురోగమించాలని నేను కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.
****
DS/AK
(Release ID: 1771923)
Visitor Counter : 170
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam