ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

19 రాష్ట్రాల స్థానిక సంస్థ‌ల‌కు ఆరోగ్య‌రంగ గ్రాంటు రూ. 8, 453.92 కోట్ల విడుద‌ల‌


ఆయా రాష్ట్రాల్లో ప్రాధ‌మిక ఆరోగ్య భ‌ద్ర‌తా స్థాయిలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించి ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ల‌ను బ‌లోపేతం చేయ‌డానికి గ్రాంట్ల కేటాయింపు

Posted On: 13 NOV 2021 8:48AM by PIB Hyderabad

19 రాష్ట్రాల్లోని గ్రామీణ‌, ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల్లో వినియోగించ‌డానికి వీలుగా, రూ. 8, 453.92 కోట్ల ఆరోగ్య‌రంగ గ్రాంటును కేంద్ర ఆర్ధిక‌శాఖ ఆధ్వ‌ర్యంలోని వ్య‌య విభాగం విడుద‌ల చేసింది.15 వ ఫైనాన్స్ క‌మిష‌న్ సిఫార్సుల మేర‌కు ఈ నిధుల‌ను విడుద‌ల చేయడం జ‌రిగింది. రాష్ట్రాల‌వారీగా నిధుల వివ‌రాల‌ను కింద చూడ‌వ‌చ్చు. 
2021-22నుంచి 2025-26వ‌ర‌కూ దేశంలోని స్థానిక ప్ర‌భుత్వాల‌కు మొత్తం రూ. 4, 27, 911 కోట్ల గ్రాంటును అంద‌జేయాల‌ని 15వ ఫైనాన్స్ క‌మిష‌న్ నివేదిక స్ప‌ష్టం చేసింది. ఇందులో రూ. 70, 051 గ్రాంటును ఆరోగ్య రంగానికి ఉప‌యోగించాల‌ని సూచించారు. ఇందులో రూ. 43, 928 కోట్ల‌ను గ్రామీణ స్థానిక సంస్థ‌ల‌కోసం, రూ. 26, 123 కోట్ల‌ను ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల‌కోసం ఉప‌యోగిస్తారు. 
ఈ నిధుల‌ను ఉప‌యోగించి ప్రాధమిక ఆరోగ్య భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌లోని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ల‌ను బ‌లోపేతం చేయాల్సి వుంటుంది. గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఆరోగ్య మౌలిక స‌దుపాయాల‌ను బ‌లోపేతం చేయ‌డానికి చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌ను కూడా హైనాన్స్ క‌మిష‌న్ సూచించింది. అందులోభాగంగా ఏ ఏ చర్య‌ల‌కోసం ఎంత మొత్తం ఖ‌ర్చు చేయాలో కూడా త‌న నివేదిక‌లో వివ‌రించింది. 
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాధ‌మిక ఆరోగ్య భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌లో రోగ నిర్ధార‌ణ స‌దుపాయాల‌కోసం రూ. 16, 377 కోట్లు
గ్రామీణ ప్రాంతాల్లో బ్లాక్ స్థాయి ప్ర‌జా ఆరోగ్య కేంద్రాలకోసం రూ. 5, 279  కోట్లు
గ్రామీణ‌ప్రాంతాల్లో భ‌వ‌నాలు లేని ఉప కేంద్రాలు, పీహెచ్ సీలు, సిహెచ్ సీల‌కోసం స్వంత భ‌వ‌నాల నిర్మాణం కోసం రూ. 7, 167 కోట్లు
పీహెచ్ సీలు, ఉప కేంద్రాల‌ను హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలుగా మార్చ‌డానికి రూ. 15, 105 కోట్లు. 
ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగ నిర్ధార‌ణ ప‌రిక‌రాల‌కోసం రూ. 2, 095 కోట్లు
ప‌ట్ట‌ణ ప్రాంత హెల్త్ అండ్ వెల్ నెస్ సెంట‌ర్ల‌కోసం రూ. 24, 028 కోట్లు
2021-22 ఆర్ధిక సంవ‌త్స‌రానికిగాను విడుద‌ల చేయాల్సిన ఆరోగ్య‌రంగ నిధులు రూ. 13, 192 కోట్లు. ఇందులోనే రూ. 8, 273 కోట్ల‌ను గ్రామీణ ప్రాంతాల‌కు రూ. 4, 919 కోట్ల‌ను పట్ట‌ణ ప్రాంతాల స్థానిక సంస్థ‌ల‌కోసం వినియోగిస్తారు. 
ప్రాధ‌మిక ఆరోగ్య సేవ‌లనందించ‌డంలో గ్రామీణ‌,ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌లు కీల‌క‌పాత్ర పోషిస్తాయి. అంద‌రికీ ఆరోగ్య సేవ‌లందించాల‌నే ల‌క్ష్యానికి అనుగుణంగా ప‌ని చేస్తాయి. వ‌న‌రుల‌ప‌రంగాను, ఆరోగ్య స‌దుపాయాలు, సామ‌ర్థ్య నిర్మాణ ప‌రంగా స్థానిక ప్ర‌భుత్వాల‌ను బ‌లోపేతం చేయ‌డ‌మ‌నేది అంటు వ్యాధుల‌ను, మ‌హ‌మ్మారుల‌ను నివారించ‌డానికి దోహ‌దం చేస్తుంది. 
ప్రాధ‌మిక ఆరోగ్య సంస్థ‌ల‌ను ప‌ర్య‌వేక్షించే విధంగా పంచాయితీ రాజ్ సంస్థ‌ల‌ను, పట్ట‌ణ స్థానిక సంస్థ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేయ‌డంద్వారా దేశంలోని ప్రాధ‌మిక ఆరోగ్య వ్య‌వ‌స్థ మొత్తంమీద బ‌లోపేత‌మ‌వుతుంది. స్థానిక ప్ర‌భుత్వాల‌ను భాగ‌స్వాముల‌ను చేయ‌డంవ‌ల్ల ఆరోగ్య వ్య‌వ‌స్థ అనేద ప్ర‌జ‌ల‌కు జవాబుదారీగా నిలుస్తుంది. 
మిగిలిన 9 రాష్ట్రాల‌కు ఆరోగ్య నిధుల విష‌యంలో...ఆయా రాష్ట్రాల ప్ర‌తిపాద‌న‌లు అందిన‌ ర్వాత విడుద‌ల చేయ‌డం జ‌రుగుతుంది. 

స్థానిక సంస్థ‌ల‌కు ఆరోగ్య రంగ గ్రాంట్ల వివ‌రాలు

సీరియ‌ల్ నెంబ‌ర్

రాష్ట్రం

విడుద‌ల చేసిన గ్రాంటు మొత్తం (రూ. కోట్ల‌లో)

1.

ఆంధ్ర‌ప్ర‌దేశ్

488.1527

2.

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌

46.944

3.

అస్సాం

272.2509

4.

బిహార్

1116.3054

5.

ఛ‌త్తీస్ గ‌ఢ్‌

338.7944

6.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌.

98.0099

7.

జార్ఖండ్‌

444.3983

8.

క‌ర్నాట‌క‌

551.53

9.

మ‌ధ్య‌ప్ర‌దేశ్

922.7992

10.

మ‌హారాష్ట్ర‌

778.0069

11.

మ‌ణిపూర్

42.8771

12.

మిజోరాం

31.19

13.

ఒడిశా

461.7673

14.

పంజాబ్‌

399.6558

15.

రాజ‌స్థాన్‌

656.171

16.

సిక్కిం

20.978

17.

త‌మిళ‌నాడు

805.928

18.

ఉత్త‌రాఖండ్‌

150.0965

19.

ప‌శ్చిమ బెంగాల్‌

828.0694

 

మొత్తం

8453.9248


***



(Release ID: 1771461) Visitor Counter : 206