ప్రధాన మంత్రి కార్యాలయం

ఆర్ బిఐప్రవేశపెట్టనున్న రెండు నూతన వినియోగదారు ప్రధానమైన కార్యక్రమాల ను నవంబర్ 12న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి 

Posted On: 11 NOV 2021 10:18AM by PIB Hyderabad

భారతీయ రిజర్వు బ్యాంకు తాలూకు రెండు కొత్త వినియోగదారు ప్రధాన కార్యక్రమాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 నవంబర్ 12 న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాల లో ఒక కార్యక్రమం ఆర్ బిఐ రిటైల్ డైరెక్ట్ స్కీము కాగా ఇంకొకటి రిజర్వు బ్యాంకు - ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్ మ‌న్ స్కీము.

వీటిలో ఆర్ బిఐ రిటైల్ డైరెక్ట్ స్కీము ఉద్దేశ్యం ఏమిటి అంటే ప్రభుత్వ హామీపత్రాల బజారు ను చిన్న ఇన్వెస్టర్ లకు మరింత గా అందుబాటు లోకి తీసుకు రావడం. ఇది భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే హామీ పత్రాల లో నేరు గా పెట్టుబడి పెట్టేందుకు చిన్న ఇన్వెస్టర్ లకు మార్గం తెరచుకొంటుంది. ఇన్వెస్టర్ లు ఆర్ బిఐ అండదండల తో ఆన్ లైన్ లో ప్రభుత్వ హామీ పత్రాల ఖాతాల ను ఇట్టే తెరవగలగడమే కాక ఆ హామీపత్రాల ను పదిలం గా దాచి ఉంచుకొనేందుకు వీలు ఉంటుంది. ఈ విధమైన సేవ రుసుము ఏదీ చెల్లించనక్కరలేకుండా ఉచితం గా లభిస్తుంది.

ఇక రిజర్వు బ్యాంకు - ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్ మ‌న్ స్కీమ్ ఉద్దేశ్యమల్లా ఫిర్యాదులను పరిష్కరించే ప్రణాళిక లో సంస్కరణ ను తీసుకు రావడమూ, ఆర్ బిఐ నియంత్రణ లోని సంస్థల కు వ్యతిరేకం గా దాఖలు అయ్యే వినియోగదారు ఫిర్యాదుల ను పరిష్కరించడం కోసం ఏర్పడిన ఇబ్బందుల పరిష్కార యంత్రాంగాన్ని మరింత గా మెరుగు పరచడమూ ను.ఒక దేశం- ఒక స్వతంత్ర న్యాయాధికారి’ (‘వన్ నేశన్ - వన్ అంబుడ్స్ మ‌న్’) అనే సూత్రం ఈ పథకాని కి ఒక కేంద్రీయ ఇతివృత్తం గా ఉంటుంది. దీనిలో భాగం గా వినియోగదారులు వారి వారి ఫిర్యాదుల ను సమర్పించడానికి ఒక పోర్టల్, ఒక ఇ-మెయిల్, ఇంకా ఒక చిరునామా ఉంటాయి. వినియోగదారులు వారి ఫిర్యాదుల ను దాఖలు చేయడానికి, దస్తావేజు పత్రాల ను సమర్పించడానికి, ఫిర్యాదు తాలూకు పరిష్కారం ఏ స్థాయి లో ఉన్నదీ వాకబు చేయడంతోపాటు వారి వారి అభిప్రాయాల ను తెలియ జేయడానికి ఒక సంప్రదింపు కేంద్రం సైతం ఉంటుంది. ఫిర్యాదుల ను పరిష్కరించడానికి, అలాగే ఫిర్యాదుల దాఖలు కు సంబంధించి సమాచారాన్నంతటి ని అందజేసే బహుళ భాషల టోల్- ఫ్రీ నంబరు ను కూడా ఇవ్వడం జరుగుతుంది.

ఈ కార్యక్రమాని కి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తో పాటు ఆర్ బిఐ గవర్నరు కూడా హాజరు అవుతారు.

 

***(Release ID: 1770973) Visitor Counter : 226