ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రధానమంత్రి ప్రారంభించిన ' హర్ ఘర్ దస్తక్' కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు చేసే అంశంపై రాష్ట్రాల ఆరోగ్య శాఖల మంత్రులతో చర్చలు జరిపిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


ప్రతి ఒక్క పౌరుడు కోవిడ్-19 నుంచి రక్షణ పొందేలా టీకా తీసుకునేలా చూడాలని కోరిన శ్రీ మాండవీయ

' దేశంలో టీకాల కొరత లేదు'. అవసరాల మేరకు ప్రతి రాష్ట్రానికి వ్యాక్సిన్ సరఫరా చేస్తాం .. శ్రీ మాండవీయ

' టీకా సురక్ష కవచంలా ఉంటుంది కానీ ఎలాంటి అలసత్వం కూడదు' ' ప్రతి ఒక్కరూ కోవిడ్ అనుగుణం ప్రవర్తన అలవరచుకునేలా చూడాలి'.. శ్రీ మాండవీయ

Posted On: 11 NOV 2021 2:09PM by PIB Hyderabad

దేశంలో అర్హులైన ప్రతి పౌరుడు కోవిడ్-19 నుంచి రక్షణ కల్పించి కవచంలా పనిచేసే టీకాను తీసుకునేలా చూడాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పిలుపు ఇచ్చారు. కోవిడ్-19 నివారణ కోసం దేశంలో అమలు జరుగుతున్న కార్యక్రమాలను శ్రీ మాండవీయ ఈ రోజు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖల మంత్రులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ మాండవీయ  కోవిడ్-19 నుంచి రక్షణ కల్పించే కవచంలా పనిచేసే ప్రతి ఒక్క పౌరుడు రెండు డోసుల టీకాలు తీసుకునేలా సంఘటిత కృషి జరగాలని అన్నారు. దీనికోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన ' హర్ ఘర్ దస్తక్కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆయన అన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల  ఆరోగ్య మంత్రులు శ్రీమతి వీణ జార్జ్ (కేరళ)డాక్టర్ ధన్ సింగ్ రావత్ (ఉత్తరాఖండ్)శ్రీ బన్న గుప్తా (జార్ఖండ్)డాక్టర్ లాల్తాంగ్లియానా (మిజోరం)శ్రీ మంగళ్ పాండే (బీహార్)డాక్టర్ కె. సుధాకర్ ( కర్ణాటక)శ్రీ రాజేష్ తోపే (మహారాష్ట్ర)డాక్టర్ ప్రభు రామ్ చౌదరి (మధ్యప్రదేశ్)శ్రీ జై ప్రతాప్ సింగ్ (ఉత్తరప్రదేశ్)శ్రీ మా సుబ్రమణియన్ (తమిళనాడు)శ్రీ విశ్వజిత్ రాణి (గోవా)శ్రీ రుషికేశ్ గణేశ భాయ్ పటేల్ (గుజరాత్),  శ్రీ కేశబ్ మహంత (అస్సాం)శ్రీ సత్యేందర్ జైన్ (ఢిల్లీ)పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్ కార్యదర్శులు  / అదనపు ముఖ్య కార్యదర్శులునేషనల్ హెల్త్ మిషన్  డైరెక్టర్ సమావేశానికి  హాజరయ్యారు. 

దేశ జనాభాలో  79% మంది వయోజనులు టీకా మొదటి డోసు, 38% మంది రెండు డోసులను తీసుకున్నారని శ్రీ మాండవీయ వివరించారు. దేశంలో మొదటి డోసును తీసుకున్న వారిలో 12 కోట్ల మంది రెండవ డోసు తీసుకోవలసి ఉందని మంత్రి అన్నారు. ప్రస్తుతం అమలు జరుగుతున్న హర్ ఘర్ దస్తక్ప్రచార కార్యక్రమంలో దేశ జనాభాలో అర్హులైనప్రతి ఒక్కరూ టీకా రెండు డోసులను తీసుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖల మంత్రులకు శ్రీ మాండవీయ సూచించారు. మొదటి డోస్ తీసుకున్న వారందరూ రెండవ డోస్ తీసుకునేలా చూడాలని మంత్రి అన్నారు. 

'హర్ ఘర్ దస్తక్కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని శ్రీ మాండవీయ కోరారు. ప్రజలను చైతన్యవంతులను చేసే విధంగా  కార్యక్రమం అమలు జరగాలని అన్నారు. టీకాల కార్యక్రమం అమలు చేసే ముందు గ్రామాలలో ముందుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించి ఎక్కువ మంది ప్రజలు టీకాలు తీసుకోవడానికి ముందుకు వచ్చేలా చూడాలని అన్నారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా రెండు డోసులను తీసుకునేలా చూడడానికి ప్రచారాన్ని నిర్వహించాలని అన్నారు. ఎంపిక చేసిన ప్రాంతంలో నిర్దిష్ట కాలవ్యవధిలో ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకునేలా చూడడానికి బహుళ టీకా బృందాల (50-100)ను ఏర్పాటు చేయాలని అన్నారు.  జిల్లా/బ్లాకు స్థాయిలో ఒక రోజులో అత్యధికంగా టీకాలు వేసిన టీకా  బృందాలను గుర్తించి గౌరవించడానికి ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పాలని అన్నారు. టీకాలపై అవగాహన కల్పించిటీకాలు వేయడానికి వారపు సంతలు బజారులలో ఏర్పాట్లు చేయాలనిస్థానికంగా పనిచేస్తున్న మత సంస్థలుసమాజ పెద్దల సహకారాన్ని తీసుకోవాలని శ్రీ మాండవీయ సూచించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో టీకాలు తీసుకోని వారిని గుర్తించి టీకాల ఆవశ్యకతపై వారిని చైతన్యవంతులను చేయడానికి స్వచ్చంధ సంస్థలు ఎంఎస్ఎస్నెహ్రు యువ కేంద్రాలు లాంటి సంస్థల సహకారాన్ని తీసుకోవాలని అన్నారు. టీకాలకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఐఈసి ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా వైవిధ్యంగా ప్రచారాన్ని నిర్వహించాలని శ్రీ మాండవీయ అన్నారు. పెద్దల ప్రవర్తనలో మార్పు వచ్చేలా చూసే అంశంలో పిల్లలు కీలకంగా ఉంటారని పేర్కొన్న శ్రీ మాందవీయ దీనికి అనుగుణంగా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు ప్రణాళిక రూపొందించాలని అన్నారు. టీకా రెండు డోసులను తమ తల్లితండ్రులు ఇతర కుటుంబ సభ్యులు తీసుకునేలా చూడడానికి పిల్లల సేవలను వినియోగించుకోవాలని శ్రీ మాండవీయ అన్నారు. 

పెద్ద నగరాల ప్రవేశ ద్వారాలుగా ఉండే బస్ స్టేషన్లురైల్వే స్టేషన్ లాంటి ప్రాంతాలలో టీకా కేంద్రాలను నెలకొల్పాలని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులకు శ్రీ మాండవీయ సూచించారు. కొన్ని రాష్ట్రాలు 'రోకో మరియు టోకోకార్యక్రమాన్ని ప్రారంభించడం పట్ల శ్రీ మాండవీయ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బస్సులురైళ్లురిక్షాలలో వస్తున్న వారిని ఆపి టీకా ప్రాముఖ్యతను  వివరించడం జరుగుతోంది. 'హర్ ఘర్ దస్తక్కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించాలని మంత్రి అన్నారు. రోజుకో వర్గానికి చెందిన ప్రజలను చైతన్యవంతులను చేసేవిధంగా కార్యక్రమం అమలు జరగాలని అన్నారు. ఒకరోజు వ్యాపారులువీధి వ్యాపారులుదుకాణాల యజమానులు మరో రోజు  ఆటో డ్రైవర్లనుకార్మికులనురైతులను చైతన్యవంతులను చేసే విధంగా కార్యక్రమాలను రూపొందించాలని అన్నారు. 

ప్రస్తుతం అమలు జరుగుతున్న కోవిడ్ నివారణా చర్యలను సమీక్షించిన మంత్రి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్న ధీమా వద్దని హెచ్చరించారు. కోవిడ్ ముప్పు తప్పిందని అనుకోవద్దు. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. సింగపూర్బ్రిటన్రష్యా మరియు చైనాలలో 80 శాతానికి పైగా టీకాలు వేసినప్పటికీ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వ్యాక్సినేషన్ మరియు కోవిడ్ సముచిత ప్రవర్తన  కలిసి ఉండాలి”, అని ఆయన స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ వ్యాధి యొక్క తీవ్రతను తగ్గిస్తుందని మంత్రి అన్నారు.  దేశం ఇప్పటివరకు సమిష్టిగా సాధించిన లాభాలు వృధాగా పోకుండా చూడడానికి తిరిగి కేసుల సంఖ్య పెరగకుండా చూడడానికి కోవిడ్ అనుగుణ ప్రవర్తనను ప్రజలు అలవరచుకోవాలని  ఆయన అన్నారు.కోవిడ్ -19కి వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటం చివరి దశలో ఉందని డాక్టర్ మాండవ్య అన్నారు.  "వ్యాక్సినేషన్ మరియు కోవిడ్ అనుగుణ ప్రవర్తన  అనేవి  రెండు ఆయుధాలు  రక్షణ కవచంగా  ఉంటాయి. కోవిడ్ ప్రమాదం ముగిసేంత వరకుమనం మన రక్షణను వదులుకోకూడదు." అని శ్రీ మాండవీయ అన్నారు. వ్యాక్సినేషన్‌ను 'సురక్ష కవాచ్'గా వర్ణించిన మంత్రి  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దవాయి భీ కడై భీ!”  పిలుపును సమావేశంలో ప్రస్తావించారు.

కోవిడ్ నివారణ  కోసం వ్యాక్సిన్‌లుమందులుఆర్థిక మరియు సాంకేతిక వనరులను సరఫరా చేసిన  కేంద్రానికి  రాష్ట్ర ఆరోగ్య మంత్రులు  కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తక్కువ పనితీరు కనబరుస్తున్న జిల్లాల్లో టీకా సంతృప్తతను నిర్ధారించడానికి తీసుకుంటున్న వినూత్న చర్యలను  వారు పంచుకున్నారు. డాక్టర్ మాండవ్య  రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు అందిస్తున్న సహకారానికి   డాక్టర్ మాండవీయ   ధన్యవాదాలు తెలిపారు  ఉత్తమ పద్ధతులను అనుకరించాలని  కోరారు. “హర్ ఘర్ దస్తక్” ప్రచారం ప్రతి ఇంటికి చేరుకోవాలని రాష్ట్ర ఆరోగ్య అధికారులకు  ఆయన సూచించారు. 

కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్,   డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్  డాక్టర్ సునీల్ కుమార్అదనపు. కార్యదర్శి (ఆరోగ్యం) డాక్టర్ మనోహర్ అగ్నానిఅదనపు. కార్యదర్శి  శ్రీ వికాష్ షీల్,  మరియు మిషన్ డైరెక్టర్ శ్రీమతి. ఆర్తి అహుజా,   మంత్రిత్వ శాఖ కార్యదర్శి (ఆరోగ్యం)     శ్రీ లవ్ అగర్వాల్  ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

***



(Release ID: 1770970) Visitor Counter : 156