విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

వాస్తవాలు Vs అపోహలు


గత 6 సంవత్సరాల కాలంలో దేశంలో విద్యుత్ సరఫరా భారీగా పెరిగింది

2007-08లో దేశంలో విద్యుత్ సరఫరా లోటు -16.6%గా ఉంది

గత ఐదు సంవత్సరాల్లో సరఫరా మెరుగుపడటంతో 2020-21 నాటికి సరఫరా లోటు -.4 % (దాదాపు సున్నా)కి తగ్గింది

దాదాపు 7 సంవత్సరాల కాలంలో స్థాపిత శక్తి అదనంగా 155377 మెగావాట్ల వరకు పెరిగింది

ప్రభుత్వం అమలు చేస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన (డీడీయూజీజేవై ), ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్‌మెంట్ స్కీమ్ (ఐడీపీయెస్) , ప్రధాన్ మంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన (సౌభాగ్య) పథకాలు, సానుకూల నిర్ణయాల వల్లే ఇది సాధ్యమైంది

Posted On: 08 NOV 2021 3:18PM by PIB Hyderabad

దేశంలో విద్యుత్ సరఫరాలో 2007-08 లో -16.6% మేరకు భారీ లోటు ఉంది. 2011-12 లో కూడా ఈ లోటు -10.6% గా ఉంది. అయితే, ప్రభుత్వం అనుసరించిన బహుముఖ వ్యూహం,  అవసరమైన సమయంలో జోక్యం చేసుకుని అమలు చేసిన సమగ్ర విధానాల వల్ల ఈ లోటు మూడు సంవత్సరాల కాలంలో తగ్గి దాదాపు సున్నా శాతానికి తగ్గింది. సరఫరా లోటు 2020-21లో -.4%, 2019-20లో -.7% మరియు 2018-19లో -.8% గా నమోదయింది. ప్రస్తుత సంవత్సరంలో అక్టోబర్ వరకు సరఫరా లోటు -1.2% గా ఉంది. వానాకాలంలో విద్యుత్ వినియోగం ఎక్కువ కావడంతో సరఫరా లోటు కొద్దిగా పెరిగింది. అయితేఈ ఏడాది చివరికి పరిస్థితి సాధారణ స్థాయికి చేరే అవకాశం ఉంది. 

విద్యుత్ రంగ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రస్తుత ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసి సకాలంలో సరైన నిర్ణయాలను తీసుకుంది. దీనితో సరఫరాలో భారీ లోటును ఎదుర్కొన్న దేశం ప్రస్తుతం సరఫరాలో లోటు లేని దేశంగా అభివృద్ధి సాధించింది. ప్రస్తుతం దేశంలో సరఫరా లోటు ఏ మాత్రం ఆందోళన కలిగించని విధంగా 1% కంటె తక్కువగా ఉంది. 

విద్యుత్ లోటు ను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసింది. గ్రామీణ ప్రాంతాలలో సరఫరాఉప-సరఫరా వ్యవస్థలు అభివృద్ధి చేసి  సరఫరాను మెరుగుపరిచే లక్ష్యంతో 2015 జులై 25    దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన (డీడీయూజీజేవై )ను ప్రభుత్వం ప్రారంభించింది. పట్టణ ప్రాంతాలలో సరఫరా రంగం ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల కొరతను అధిగమించడానికి 2014 నవంబర్ 20 ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్‌మెంట్ స్కీమ్ (ఐడీపీయెస్) ప్రారంభమయింది. ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలన్న లక్ష్యంతో 2017 సెప్టెంబర్ 25న ప్రధాన్ మంత్రి సహజ్ బిజిలీ  హర్ ఘర్ యోజన (సౌభాగ్య)కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద 2.8 కోట్ల గృహాలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి వాటికి కాంతులు తేవడం జరిగింది. 

ప్రభుత్వం అమలు చేసిన పథకాలుతీసుకున్న సానుకూల నిర్ణయాల వల్ల దేశంలో విద్యుత్ స్థాపిత శక్తి గణనీయంగా పెరిగింది. కేవలం ఏడు సంవత్సరాల కాలంలో స్థాపిత శక్తి 155377 మెగావాట్ల మేరకు పెరిగింది. 

దేశంలో 2007-08 నుంచి విద్యుత్ సరఫరా వివరాలు దిగువన ఇవ్వబడ్డాయి.  

 

 

***(Release ID: 1770053) Visitor Counter : 173