ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీసంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్ ఖీ మార్గ్, శ్రీ సంత్ తుకారామ్ మహారాజ్ పాల్ ఖీమార్గ్ ల కీలక సెక్శన్ ల ను నాలుగు దోవ లు కలిగి ఉండేవి గా నిర్మించే పనుల కునవంబర్ 8న శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి


ఈ జాతీయరహదారుల రెండు పక్క ల ‘పాల్ ఖీ’ కోసంప్రత్యేకించిన నడక దారుల ను నిర్మించడం జరుగుతుంది

పంఢర్‌పుర్ వరకు రాక పోక లను మెరుగుపరచే ఉద్దేశ్యం తో అనేక రహదారి ప్రాజెక్టుల ను దేశప్రజల కు అంకితం చేయనున్న ప్రధాన మంత్రి

Posted On: 07 NOV 2021 3:49PM by PIB Hyderabad

పంఢర్ పుర్ ను సందర్శించే భక్తుల రాక పోక ల ను సౌకర్యవంతం గా మలచే ప్రయాసల లో భాగం గా శ్రీ సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్ ఖీ మార్గ్ (ఎన్‌ హెచ్‌-965) తాలూకు ఐదు సెక్శన్ లతో పాటు శ్రీ సంత్ తుకారాం మహారాజ్ పాల్ ఖీ మార్గ్ (ఎన్‌ హెచ్‌-965జి) తాలూకు మూడు సెక్శన్ లను నాలుగు దోవలు కలిగి ఉండేవి గా నిర్మించే పని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 నవంబరు 8 న మధ్యాహ్నం 3:30 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. ఈ జాతీయ రహదారుల కు ఇరు పక్క ల పాల్ ఖీకోసం ప్రత్యేక నడక దారుల ను నిర్మించడం జరుగుతుంది. దీని వల్ల భక్తుల కు అవాంతరాలంటూ ఎదురవనటువంటి, సురక్షితమైనటువంటి మార్గం అందుబాటు లోకి వస్తుంది.

సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్ ఖీ మార్గ్‌లో దివే ఘాట్ మొదలుకొని మొహోల్ వరకు సుమారు 221 కిలోమీటర్ సెక్శన్ తో పాటు సంత్ తుకారాం మహారాజ్ పాల్ ఖీ మార్గ్‌లో పతస్ మొదలుకొని టోందలే-బోందలే వరకు దాదాపు గా 130 కిలోమీటర్ పొడవైన సెక్శన్ ను కూడా నాలుగు దోవల ను కలిగి ఉండే విధం గా నిర్మించడం జరుగుతుంది. నాలుగు దోవ లు కలిగి ఉండే ఈ సెక్శన్ ల ఇరు పక్కల పాల్ ఖీకోసమని ప్రత్యేకించినటువంటి నడక దారుల ను నిర్మించడం జరుగుతుంది. ఈ నాలుగు దోవ లు, అలాగే ప్రత్యేకించిన నడకదారుల అంచనా వ్యయం వరస గా 6690 కోట్ల రూపాయలకు పైగా, సుమారు 4400 కోట్ల రూపాయల కు పైబడి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఈ కార్యక్రమం లో భాగం గా, పంఢర్ పుర్ వరకు రాకపోకల ను మెరుగుపరచాలనే ఉద్దేశ్యం తో వివిధ జాతీయ రహదారుల లో 223 కిలోమీటర్ కంటే ఎక్కువ పొడవైన నిర్మాణం పూర్తి అయినటువంటి రాదారి పథకాల ను, ఉన్నతీకరించినటువంటి రాదారి పథకాల ను కూడా ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఈ రాదారి పథకాల అంచనా వ్యయం 1,180 కోట్ల కు పైచిలుకు గా ఉంది. ఈ రాదారి పథకాల లో మ్హస్ వడ్-పిలీవ్- పంఢర్ పుర్ (ఎన్‌ హెచ్‌-548ఇ), కుర్దువాడీ-పంఢర్ పుర్ (ఎన్‌ హెచ్‌-965సి); పంఢర్ పుర్- సంగోలా (ఎన్‌ హెచ్‌-965సి); ఎన్ హెచ్ 561 ఎ లోని తెమ్భుర్ నీ-పంఢర్ పుర్ సెక్శన్ తో పాటు ఎన్‌ హెచ్‌-561ఎ లోని పంఢర్ పుర్- మంగళ్ వేఢా-ఉమాడీ సెక్శన్‌ మార్గాలు కూడా ఉన్నాయి.

ఈ సందర్భం లో రోడ్డు రవాణా, రాజమార్గాల శాఖ కేంద్ర మంత్రి తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పాలుపంచుకోనున్నారు.

***



(Release ID: 1769916) Visitor Counter : 203