ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గ్లాస్ గోలో సిఒపి26 శిఖరసమ్మేళనం లో భాగం గా ‘యాక్షన్ఎండ్ సాలిడారిటీ-ద క్రిటికల్ డికేడ్’ అంశం పైజరిగిన కార్యక్రమం లో ప్రధాన  మంత్రి ప్రసంగం

Posted On: 01 NOV 2021 11:33PM by PIB Hyderabad

ఎక్స్ లన్సిజ్,

మిత్రుడు శ్రీ బోరిస్ జాన్ సన్, అడాప్టేశన్ వంటి మహత్వపూర్ణమైన అంశానికి సంబంధించి నా అభిప్రాయాల ను వెల్లడి చేసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు గాను మీకు ఇవే నా ధన్యవాదాలు.

గ్లోబల్ క్లయిమేట్ డిబేట్ లో మిటిగేశన్ కు దక్కినంతటి అధిక ప్రాముఖ్యం అడాప్టేశన్ కు లభించలేదు. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల కు వాటిల్లిన అన్యాయం అని చెప్పాలి ఎందుకంటే ఆ దేశాలే జలవాయు పరివర్తన తో అధికం గా ప్రభావితం అయ్యాయి మరి.

భారతదేశం సహా, అభివృద్ధి చెందుతున్న చాలా దేశాల లో రైతుల కు శీతోష్ణస్థితి అనేది ఒక పెను సవాలు గా ఉంది. ఆయా దేశాల లో పంట ల నమూనా లో మార్పు చోటు చేసుకొంటోంది, కాలం కాని కాలం లో కురుస్తున్న వర్షాల వల్ల, వరదల వల్ల, తరచు గా తలెత్తుతున్న తుఫాను ల వల్ల పంటలు నాశనం అవుతున్నాయి. తాగునీటి వనరులు మొదలుకొని తక్కువ ఖర్చు తో కూడిన గృహ నిర్మాణం వరకు.. అన్నిటి ని జలవాయు పరివర్తన సంబంధి ఆటుపోటుల కు తట్టుకొని నిలచే విధం గా తీర్చిదిద్దవలసిన అవసరం ఉన్నది.

ఎక్స్ లన్సిజ్,

ఈ సందర్భం లో నా దగ్గర మూడు ఆలోచన లు ఉన్నాయి. వాటిలో ఒకటోది- అడాప్టేశన్ ను, మనం మన అభివృద్ధి విధానాల లో, మన ప్రాజెక్టుల లో ఒక కీలకమైన భాగం గా మలచాలి. భారతదేశం లో నల్ సే జల్ (అందరికీ నల్లా నీరు) , స్వచ్ఛ్ భారత్ అభియాన్ లతో పాటు ఉజ్జ్వల (అందరికీ స్వచ్ఛమైన వంట సంబంధి ఇంధనం) తరహా పథకాలు మా ఆపన్నులు అయినటువంటి పౌరుల కు అడాప్టేశన్ తాలూకు ప్రయోజనాల ను అందించడమే కాక వారి జీవన నాణ్యత కూడా మెరుగు పడింది. రెండోది, చాలా సాంప్రదాయిక సముదాయాలు ప్రకృతి తో సామరస్య వైఖరి ని అనుసరిస్తూ మనుగడ సాగించే జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి.

మన అడాప్టేశన్ పాలిసీల లో ఈ సాంప్రదాయిక అభ్యాసాల కు ఉచిత ప్రాముఖ్యాన్ని ఇచ్చే తీరాలి. ఈ విధమైనటువంటి జ్ఞానం సంబంధి అవగాహన ను పాఠశాల పాఠ్య క్రమం లో సైతం తప్పక చేర్చాలి. అలా చేసినప్పుడు, దాని ని కొత్త తరాని కి సైతం అందించవచ్చును. స్థానిక పరిస్థితుల కు తగ్గట్టు జీవన శైలుల ను పరిరక్షించుకోవడం అనేది కూడా అడాప్టేశన్ తాలూకు ఒక ముఖ్యమైన స్తంభం కాగలుగుతుంది. ఇక మూడోది ఏమిటి అంటే, అడాప్టేశన్ తాలూకు పద్ధతులు, అవి స్థానికం అయినప్పటి కీ కూడాను, వాటి అమలు విషయం లో వెనుకబడిన దేశాల కు ప్రపంచ దేశాల సమర్ధన అందాలి అనేదే.

లోకల్ అడాప్టేశన్ కై గ్లోబల్ సపోర్ట్ అనే ఆలోచన తోనే భారతదేశం కొఎలిశన్ ఫార్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (సిడిఆర్ఐ) కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఈ కార్యక్రమం తో జతపడవలసిందంటూ అన్ని దేశాల ను నేను అభ్యర్థిస్తున్నాను.

మీకు ఇవే ధన్యవాదాలు.

అస్వీకరణ: ఇది ప్రధాన మంత్రి ప్రసంగాని కి రమారమి అనువాదం. సిసలు ఉపన్యాసం హిందీ భాష లో సాగింది.


(Release ID: 1768835) Visitor Counter : 228