ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రోమ్ లో జి20 శిఖర సమ్మేళనం నేపథ్యం లో స్పెయిన్ ప్రధాని తో ప్రధాన మంత్రి సమావేశం

Posted On: 31 OCT 2021 9:48PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 అక్టోబరు 31 న రోమ్ లో జి20 శిఖర సమ్మేళనం జరిగిన నేపథ్యం లో స్పెయిన్ ప్ర‌ధాని శ్రీ పెడ్రో సాంచెజ్‌ తో సమావేశమయ్యారు.


2. ద్వైపాక్షిక వ్యాపారం మరియు పెట్టుబడి సంబంధాలు వర్ధిల్లుతూ ఉండటాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. ఎయర్ బస్ స్పెయిన్ నుంచి సి295 రకం యుద్ధ విమానాలు యాభై ఆరింటి ని సేకరించడం కోసం ఒక ఒప్పందం పై ఇటీవల సంతకాలు జరిగిన సంగతి ఈ సందర్భం లో ప్రస్తావన కు వచ్చింది. వీటిలో 40 విమానాల ను టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ తో కలసి మేడ్ ఇన్ ఇండియాతరహా లో నిర్మించనున్నారు. ఇ-మొబిలిటీ, స్వచ్ఛ సాంకేతికత, అడ్వాన్స్ డ్ మెటీరియల్స్ తో పాటు, సముద్ర అంతర్భాగ అన్వేషణ ల వంటి కొత్త కొత్త రంగాల లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత గా విస్తరించుకోవాలని వారు అంగీకరించారు. గ్రీన్ హైడ్రోజన్, మౌలిక సదుపాయాల కల్పన, రక్షణ రంగ సంబంధి తయారీ లతో పాటు వేరు వేరు రంగాల లో పెట్టుబడి పెట్టవలసిందంటూ స్పెయిన్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించారు. అలాగే, భారతదేశం అమలు చేసే నేశనల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్, ఎసెట్ మానిటైజేశన్ ప్లాన్ తో పాటు, గతి శక్తి ప్లాలన్ ల తాలూకు ప్రయోజనాన్ని స్వీకరించవలసిందని కూడా స్పెయిన్ కు ప్రధాన మంత్రి సూచించారు.


 


3. భారతదేశం-ఇయు సంబంధాల ను గురించి, అలాగే క్లయిమేట్ యాక్షన్ సంబంధి సహకారాన్ని గురించి, ఇంకా త్వరలో జరుగనున్న సిఒపి26 లో ప్రాధమ్యాల ను గురించి నేత లు ఉభయులు చర్చించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం, అఫ్ గానిస్తాన్ లు సహా పరస్పర హితం ముడిపడి ఉన్నటువంటి ప్రాంతీయ అంశాలపైన, ప్రపంచ అంశాల పైన వారు వారి అభిప్రాయాల ను ఒకరి కి మరొకరు వెల్లడించుకొన్నారు.



4. రాబోయే సంవత్సరం లో ప్రధాని శ్రీ పెడ్రో సాంచెజ్ భారతదేశాన్ని సందర్శించే సందర్భం లో ఆయనకు స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నట్లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

 

 

***

 


(Release ID: 1768614) Visitor Counter : 160