ప్రధాన మంత్రి కార్యాలయం
రాష్ర్టీయ ఏకతా దివస్ సందర్భంగా జాతినుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
"సర్దార్ పటేల్ చారిత్రక ప్రముఖుడు మాత్రమే కాదు, ప్రతీ ఒక్క పౌరుని హృదయంలోజీవించి ఉండే మనిషి"
"130 కోట్ల మంది భారతీయులు నివశిస్తున్న ఈ భూమి మన ఆత్మ, కలలు, ఆకాంక్షల్లో అంతర్భాగం"
"సర్దార్ పటేల్ శక్తివంతం, సమ్మిళితం, సునిశిత, అప్రమత్త భారత్ కావాలని ఆకాంక్షించారు"
"సర్దార్ పటేల్ స్ఫూర్తితో భారతదేశం విదేశీ, అంతర్గత సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సంపూర్ణంగా సిద్ధంగా ఉంది"
"నీరు, ఆకాశం, అంతరిక్ష రంగాల్లో దేశ సంకల్పం, సామర్థ్యాలు అసాధారణం; జాతి ఆత్మనిర్భరత బాటలో ప్రయాణిస్తోంది"
"ప్రస్తుత ఆజాదీ కా అమృత్ కాలం కనివిని ఎరుగని వృద్ధికి, సంక్లిష్టమైన లక్ష్యాల సాధనకు, సర్దార్ పటేల్ కలలకు దీటుగా భారత నిర్మాణానికి పాటు పడుతోంది"
"ప్రభుత్వంతో పాటు ప్రజల "గతిశక్తి" కూడా ఉపయోగంలోకి తెచ్చినట్టయితే ఏదీ అసాధ్యం కాదు"
Posted On:
31 OCT 2021 10:25AM by PIB Hyderabad
జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలను అభినందించారు. "ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్" ఆదర్శానికి జీవితాన్ని త్యాగం చేసిన సర్దార్ పటేల్ కు ఆయన ఘన నివాళి అర్పించారు. సర్దార్ పటేల్ చారిత్రక ప్రముఖుడు మాత్రమే కాదు, ప్రతీ ఒక్క భారతీయుని, దేశాన్ని అవిచ్ఛిన్న ఐక్యతలో నిలపాలన్న ఆయన సందేశాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లే వారి హృదయాల్లో సజీవంగా నిలిచే వ్యక్తి అని చెప్పారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా రాష్ర్టీయ ఏకతా దివస్ ను తీసుకువెళ్లడంలోను, ఐక్యతా విగ్రహం వద్ద జరుగుతున్న సంఘటనలు అదే స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి.
భారతదేశం భౌగోళిక ఐక్యత కలిగిన ప్రదేశం మాత్రమే కాదు, ఆదర్శాలు, అభిప్రాయాలు, నాగరికత, సంస్కృతిలో ఉదార ప్రమాణాలు ప్రతిబింబించే దేశమని ప్రధానమంత్రి అన్నారు. "130 కోట్ల మంది భారతీయులు నివశించే భారతదేశం మన ఆత్మలు, కలలు, ఆకాంక్షలను ప్రతిబింబించేలా మనుగడ సాగించే దేశం" అని ఆయన పేర్కొన్నారు.
భారతదేశం ఒక్కటే అనే ప్రజాస్వామ్య సాంప్రదాయాలను పటిష్ఠం చేయడం గురించి ప్రస్తావిస్తూ దేశ లక్ష్యాలను సాధించే దిశగా ప్రతీ ఒక్క పౌరుడు కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధానమంత్రి పిలుపు ఇచ్చారు. సర్దార్ పటేల్ బలమైన, సమ్మిళిత, సునిశిత, అప్రమత్త భారత్ రావాలని ఆకాంక్షించారని నొక్కి చెప్పారు. "భారతదేశం మానవతా విలువలతో పాటు అభివృద్ధికి పాటు పడే దేశమని ఆయన అన్నారు. సర్దార్ పటేల్ అందించిన స్ఫూర్తితో విదేశీ, అంతర్గత సవాళ్లను దీటుగా ఎదుర్కొనే సామర్థ్యాలు భారతదేశం సాధిస్తోంది" అని చెప్పారు.
గత 7 సంవత్సరాల కాలంలో దేశాన్ని పటిష్ఠం చేసేందుకు తీసుకున్న చర్యల గురించి ప్రస్తావిస్తూ పనికిరాని పాత చట్టాల నుంచి దేశానికి విముక్తి కలిగిందని, ఐక్యతా ఆదర్శాలు పటిష్ఠం అయ్యాయని; అనుసంధానత, మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇచ్చామని; భౌగోళిక, సాంస్కృతిక దూరాలు తగ్గాయని ప్రధానమంత్రి తెలిపారు.
"ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్" భావాన్ని బలోపేతం చేసేందుకు దేశంలో సామాజిక, ఆర్థిక, రాజ్యాంగ సమగ్రతకు నేడు "మహాయజ్ఞం" జరుగుతోంది. నీరు, ఆకాశం, భూమి, అంతరిక్షంలో సామర్థ్యాలు, సంకల్పం అసాధారణంగా ఉన్నాయి. ఆత్మనిర్భరత పేరిట కొత్త బాటలో దేశం ముందుకు సాగుతోంది" అన్నారు. ప్రస్తుతం నడుస్తున్న అమృత కాలంలో "సబ్ కా ప్రయాస్" కూడా ఎంతో ప్రధానమైనది. నేటి "ఆజాదీ కా అమృత్" కాలంలో అసాధారణ వృద్ధి, క్లిష్టమైన లక్ష్యాల సాధన దిశగా అడుగేస్తూ భారత నిర్మాణంలో సర్దార్ సాహెబ్ కలలు సాకారం చేసేందుకు అడుగేస్తోంది. సర్దార్ పటేల్ దృష్టిలో "ఏక్ భారత్" అంటే అందరికీ సమానావకాశాలు అని ప్రధానమంత్రి అన్నారు. అంటే మహిళలు, దళితులు, నిరాదరణకు గురవుతున్న వారు, గిరిజనులు, అడవుల్లో నివాసం ఉండే వారు అందరికీ చక్కని అవకాశాలు కలగడం అని ప్రధానమంత్రి వివరించారు. ఇల్లు, విద్యుత్, నీరు ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ అందుబాటులో ఉండాలి. ఇప్పుడు "సబ్ కా ప్రయాస్" లక్ష్యంతో దేశం అది సాధించేందుకు కృషి చేస్తోంది" అని ఆయన అన్నారు.
కోవిడ్ పై పోరాటంలో "సబ్ కా ప్రయాస్" శక్తిని ఉపయోగించుకుని ప్రతీ ఒక్క పౌరుని సంఘటిత ప్రయత్నాలతో కొత్త కోవిడ్ ఆస్పత్రుల నిర్మాణం పూర్తి చేయడం, అత్యవసర ఔషధాలు, 100 కోట్ల డోసుల వ్యాక్సిన్లు అందుబాటులోకి తేవడం జరిగిది అని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
ప్రభుత్వ శాఖల ఉమ్మడి శక్తిని ఉపయోగంలోకి తెచ్చేందుకు ఇటీవలే ప్రారంభించిన పిఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ గురించి ప్రస్తావిస్తూ దానితో పాటు ప్రజల "గతిశక్తి"ని కూడా ఉపయోగించుకున్నట్టయితే ఏదీ అసాధ్యం కాదని ప్రధానమంత్రి అన్నారు. ప్రతీ ఒక్క చర్యలోను విస్తృత జాతీయ లక్ష్యాలనే పరిగణనలోకి తీసుకోవాలని ఆయన చెప్పారు. అలాగే ప్రతీ ఒక్క విద్యార్థి నిర్దిష్ట రంగాలకు చెందిన ప్రత్యేక విభాగాలు అధ్యయనం చేయడంతో పాటు ప్రత్యేక నవకల్పనలు చేయాలని, ప్రజలు షాపింగ్ చేసే సమయంలో వ్యక్తిగత ప్రాధాన్యతలతో పాటు ఆత్మనిర్భరతను దృష్టిలో ఉంచుకోవాలని ఆయన అన్నారు. అలాగే పరిశ్రమలు, రైతాంగం, సహకార సంస్థలు కూడా తమ ప్రాధాన్యతలు నిర్దేశించుకునే సమయంలోదేశ లక్ష్యాలను కూడా గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.
ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ అభియాన్ ను ఉదాహరణగా చూపుతూ ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యాన్ని జాతీయ శక్తిగా మార్చిందని చెప్పారు. "ఏక్ భారత్" దిశగా ఎప్పుడు ముందడుగేసినా మనం విజయం సాధించడమే కాకుండా శ్రేష్ఠ్ భారత్ కు తమ వాటా అందించగలుగుతారు" అంటూ ఆయన ముగించారు.
***
(Release ID: 1768429)
Visitor Counter : 176
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada