ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సీఐఐ ఆసియా హెల్త్ 2021 సదస్సు ప్రారంభ సమావేశంలో ప్రసంగించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


' ప్రధానమంత్రి ఆశయ సాధనలో భాగంగా అందరికి ఆరోగ్య రంగ సేవలు పారదర్శకంగా, జవాబుదారీతనంతో అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది' : కేంద్ర ఆరోగ్య మంత్రి

' “ఆరోగ్యకరమైన సమాజం సంపన్న దేశానికి దారి తీస్తుంది"

Posted On: 28 OCT 2021 2:37PM by PIB Hyderabad

సీఐఐ ఆసియా హెల్త్ 2021 సదస్సు ప్రారంభ సమావేశంలో ఈ రోజు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ పాల్గొని ప్రసంగించారు. '  'మెరుగైన రేపటి కోసం ఆరోగ్య సంరక్షణ రంగంలో మార్పులు అనే అంశంతో సీఐఐ ఈ సదస్సును నిర్వహిస్తోంది. 

సదస్సులో ప్రసంగించిన శ్రీ మాండవీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టితో తీసుకున్న నిర్ణయంతో దేశాభివృద్ధితో అంతర్భాగంగా ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని మంత్రి అన్నారు.  గతంలో దేశ అభివృద్ధితో సంబంధం లేకుండా కేవలం చికిత్స కోసం మాత్రమే వైద్య రంగం పరిమితం అయ్యిందని ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం దేశాభివృద్ధితో ముడిపెట్టి ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. దీనివల్ల ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని శ్రీ మాండవీయ వివరించారు. వ్యాధుల నివారణకు ఆరోగ్య రంగంలో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణ లక్ష్య సాధనలో  ఖేలో ఇండియా, యోగ లాంటి అంశాలు కీలకం గా ఉంటాయని ఆయన అన్నారు. 

 పారదర్శకంగా, జవాబుదారీతనంతో  ఆరోగ్య రంగ సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకుని రావాలన్న లక్ష్యంతో కేంద్రం పనిచేస్తున్నదని శ్రీ మాండవీయ అన్నారు.  లక్ష్య సాధనకు అవసరమైన చర్యలను అమలు చేస్తున్నామని అన్నారు. దీనిలో భాగంగా ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజన (ఆరోగ్య బీమా పథకం)ఆయుష్మాన్ హెల్త్ అండ్ వెల్‌నెస్ కేంద్రాలుజనరిక్ ఔషధాల కోసం ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్,పీఎం  ఆయుష్మాన్ వంటి అనేక పథకాలను ప్రభుత్వం ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు.

సాధారణ ఆరోగ్యం నుంచి సంపూర్ణ ఆరోగ్యం అంశానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ప్రభుత్వం ఆరోగ్య పధకాలకు ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి అన్నారు. దీనిలో భాగంగా ఆరోగ్య రంగంలో మౌలిక సౌకర్యాలను కల్పించడానికి  2021 అక్టోబర్ 25 వ తేదీన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించారని శ్రీ మాండవీయ వివరించారు. దీనివల్ల దేశంలో ఆరోగ్య రంగంలో సౌకర్యాలు మరింత అభివృద్ధి చెందుతాయని అన్నారు. 

సాంకేతికతను ఆరోగ్య రంగానికి జోడించి ఆరోగ్య సేవలను అందించడానికి చర్యలు అమలు చేయక తప్పదని మంత్రి స్పష్టం చేశారు. అత్యంత ఆధునిక నానో, రోబోటిక్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆరోగ్య రంగంలో విస్తృతంగా వినియోగించాలని ఆయన సూచించారు. ఆరోగ్య ప్రమాణాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంలో భాగంగా దేశంలో ఆయుష్మాన్ డిజిటల్ మిషన్ అమలు జరుగుతున్నదని మంత్రి పేర్కొన్నారు. 

ఆరోగ్య రంగంలో అవగాహన అనేది కీలక అంశంగా ఉంటుందని శ్రీ మాండవీయ అన్నారు. కోవిడ్-19 సమయంలో ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వం అమలు చేసిన అవగాహనా కార్యక్రమాలు సాధించిన విజయాలు దీనికి నిదర్శనం అని  మంత్రి అన్నారు. 'దవాయి భీ కడై భీమరియు 'దో గజ్ కి దూరిమాస్క్ హై జరూరివంటి అవగాహనా కార్యక్రమాలు ప్రజలను చైతన్యవంతులను చేసి దేశంలో కోవిడ్-19 వ్యాప్తిని  అరికట్టడంలో ఉపయోగ పడ్డాయని అని  ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా క్షయవ్యాధి (టీబీ)ఎయిడ్స్ లాంటి వ్యాధుల నిర్మూలనలో అవగాహన కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.

దేశ ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెట్టాలని శ్రీ మాండవీయ పెట్టుబడిదారులు విజ్ఞప్తి చేశారు. పెట్టుబడులకు దేశ ఆరోగ్య రంగం అబ్దుత అవకాశాలను కల్పిస్తుందని అన్నారు. అంతర్జాతీయ ఆరోగ్య పర్యాటక హబ్ గా దేశం అభివృద్ధి సాధిస్తుందని అన్న శ్రీ మాండవీయ ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రైవేట్ రంగానికి సూచించారు. ' ఆరోగ్యవంతమైన సంపద దేశం'గా దేశాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలకు ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలను అందించాలని మంత్రి కోరారు. 

కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ కే పాల్, నేషనల్ హెల్త్ అధారిటీ సీఈఓ డాక్టర్ ఆర్.ఎస్.శర్మ, సీఐఐ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

***


(Release ID: 1767368) Visitor Counter : 182