వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చౌక‌ధ‌ర‌ల దుకాణాల‌ ఆర్ధిక వెసులుబాటును పెంచేందుకు సానుకూల చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంది.: ఆహార‌, ప్ర‌జా పంపిణీ శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ సుధాంశు పాండే చిన్న ఎల్‌.పి.జి సిలిండ‌ర్లను చౌక‌ధర‌ల దుకాణాల ద్వారా రిటైల్ అమ్మ‌కానికి అనుమ‌తించే యోచ‌న‌

Posted On: 27 OCT 2021 1:00PM by PIB Hyderabad

ఆహారం, ప్రజాపంపిణీ విభాగానికి చెందిన కార్య‌ద‌ర్శి శ్రీ సుధాంశు పాండే నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్సులో చౌక‌ధ‌రల 

దుకాణాల ఆర్థిక వెసులు బాటును పెంపొందించేందుకు తీసుకోవ‌ల‌సిన సానుకూల చ‌ర్య‌ల‌పై ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

ఎల‌క్ట్రానిక్స్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ ప్ర‌తినిధులు, డిపార్ట‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ , మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం , నాచుర‌ల్ గ్యాస్ , ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ , భార‌త్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ (బిపిసిఎల్‌), హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్‌), సిఎస్‌సి ఈ గ‌వ‌ర్నెన్స్ స‌ర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (సిఎస్‌సి) ప్ర‌తినిధులు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్ర‌భుత్వాలు ఈ వ‌ర్చువ‌ల్ కాన్ఫ‌రెన్సులో పాల్గొన్నాయి.

 

సిఎస్‌సి కి చెందిని సిఇఒ సిఎస్‌సి ఆఫర్ చేస్తున్న‌వివిధ సేవ‌ల గురించి ప్రెజెంటేష‌న్ ఇచ్చారు. అనంత‌రం , సిఎస్‌సి కార్య‌క‌ల‌పాల‌పై అప్‌డేట్ ఇచ్చారు. అలాగే ఈ కార్య‌క‌లాపాల‌ను మ‌రింత ముందుకు తీసుకువెళ్ల‌డానికి ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌తో కుదుర్చుకున్న టై అప్ గురించి వివ‌రించారు. ఎఫ్ పి ఎస్ ల నిల‌దొక్కుకోవ‌డానికి సిఎస్‌సి తో కొలాబ‌రేష‌న్‌ను రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు ప్ర‌శంసించాయి. స్థానిక అవ‌స‌రాలకు అనుగుణంగా ఎఫ్ పి ఎస్ వ‌య‌బిలిటీని పెంచేందుకు సిఎస్‌సితో స‌మ‌న్వ‌యం చేసుకుంటామని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు తెలిపాయి.

డిఎఫ్‌పిడి కార్య‌ద‌ర్శి మాట్లాడుతూ, సిఎస్‌సి ప్ర‌త్యేక వ‌ర్క్ షాప్‌లు, వెబినార్లను వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు చెందిన వివిధ గ్రూప్‌ల‌తో నిర్వ‌హించాల‌ని ప్ర‌స్తుతం వాటి స్థాయి ఆధారంగా క‌ల‌గ‌గ‌ల ప్ర‌యోజ‌నాలు, ఎప్‌పిఎస్‌ల సామ‌ర్ధ్యాల నిర్మాణం, ఈ చ‌ర్య‌ల అమ‌లులో స‌హ‌కారం వంటి అంశాల‌ను చ‌ర్చించాల‌న్నారు.

 

చ‌మురు మార్కెటింగ్ కంపెనీల ప్ర‌తినిధులు, చిన్న ఎల్ పిజి సిలిండ‌ర్ల‌ను ఎఫ్‌పిఎస్ ల ద్వారా విక్ర‌యించే ప్ర‌తిపాద‌న‌ను స్వాగ‌తించారు. ఇందుకు సంబంధించి అవ‌స‌ర‌మైన మ‌ద్ద‌తును, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్ర‌భుత్వాల స‌హ‌కారంతో క‌ల్పిస్తామ‌న్నారు.

 డిపార్ట‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌, ఎప్ పి ఎస్ ల ద్వారా అందించ‌నున్న ఆర్ధిక సేవ‌ల‌ను అభినందించారు. ముద్రా రుణాల‌ను ఎప్‌.పి.ఎస్ డీల‌ర్ల‌కు  పెట్టుబ‌డి పెంపున‌కు వీలుగా వ‌ర్తింప‌ చేయ‌డం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్ర‌భుత్వాల స‌హ‌కారంతో ఇందుకు అవ‌స‌ర‌మైన మ‌ద్ద‌తు నివ్వ‌డం జ‌రుగుతుంద‌ని వారు తెలిపారు.

 

ఈ సమావేశం ముగింపు సంద‌ర్భంగా మాట్లాడుతూ డిఎఫ్‌పిడి కార్య‌ద‌ర్శి, వివిధ రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు త‌మ త‌మ అవ‌స‌రాల‌కు అనుగుణంగా మ‌ల‌చుకోవాల‌న్నారు.రాష్ట్రాలు ,కేంద్ర పాలిత ప్రాంతాలు నిరంత‌రం అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ ఉండాల‌ని, ఎఫ్‌.పిఎస్ డీల‌ర్ల‌కు ఈ ప్ర‌యోజ‌నాల‌గురించి తెలియ‌జేయాల‌ని సూచించారు.

***


(Release ID: 1767365)