ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                    
                    
                        జమ్ము, కశ్మీర్ లో జరిగినరోడ్డు ప్రమాదం లో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
                    
                    
                        
బాధితులకు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం చెల్లించడానికి ప్రధానమంత్రి ఆమోదం తెలిపారు
                    
                
                
                    Posted On:
                28 OCT 2021 11:38AM by PIB Hyderabad
                
                
                
                
                
                
                జమ్ము, కశ్మీర్ లోని డోడా లో ధాథ్ రీ కి దగ్గర లో జరిగిన ఒక రోడ్డు ప్రమాద ఘటన లో ప్రాణ నష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇప్పించడానికి కూడా శ్రీ నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘జమ్ము, కశ్మీర్ లోని డోడా లో గల థాథ్ రీ సమీపం లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన దుఃఖాన్ని కలిగించింది. ఈ విషాద ఘడియ లో, ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు నేను నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను.
గాయపడ్డ వారు అతి త్వరలోనే కోలుకోవాలి అని నేను ప్రార్థిస్తున్నాను: ప్రధాన మంత్రి @narendramodi
జమ్ము, కశ్మీర్ లో రోడ్డు ప్రమాదం కారణం గా ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల వంతుల పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. క్షతగాత్రుల కు 50,000 రూపాయాలు ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి @narendramodi ’’ అని పేర్కొన్నారు.
 
 
 
 
***
DS/SH
 
                
                
                
                
                
                (Release ID: 1767139)
                Visitor Counter : 154
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam