రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఇండో-–పసిఫిక్ ప్రాంతీయ చర్చల సమావేశం

ఈ నెల 27 నుండి 29 వరకు జరుగుతుంది

Posted On: 26 OCT 2021 11:11AM by PIB Hyderabad

2018లో తొలిసారిగా నిర్వహించిన ఇండో–-పసిఫిక్ ప్రాంతీయ చర్చల సమావేశం (ఐపీఆర్డీ).. భారత నావికాదళం  అత్యున్నత అంతర్జాతీయ వార్షిక కార్యక్రమం.  వ్యూహాత్మక స్థాయిలో నౌకాదళం సన్నద్ధతను ప్రదర్శించేందుకు ప్రధాన కార్యక్రమం. నేషనల్ తీర ఫౌండేషన్ ఈ వార్షిక కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రతి విన్యాసానికి నేవీ  నాలెడ్జ్ పార్టనర్ గా,  చీఫ్ ఆర్గనైజర్ గా పనిచేస్తుంది. ఐపీఆర్డీ  ప్రతి సమావేశ లక్ష్యం ఇండో–-పసిఫిక్‌లో తలెత్తే అవకాశాలను,  సవాళ్లను.. రెండింటినీ సమీక్షించడం. ఐపీఆర్డీ–-2018 నాలుగు ప్రధాన ప్రధాన అంశాలపై దృష్టి సారించింది: సముద్ర వాణిజ్యం; ప్రాంతీయ అనుసంధానం; నిరంతర సముద్ర నిఘా, సముద్ర ప్రాంతాల్లో పెరుగుతున్న డిజిటలైజేషన్ ,  సముద్రపు ప్రాంతంలో సైబర్ నేరాల వంటి -ప్రాంతీయ సవాళ్లు;  సంపూర్ణ సముద్ర భద్రతను పెంపొందించడంలో పరిశ్రమ పాత్ర. ఐపీఆర్డీ... 2019 ప్రారంభ కార్యక్రమం ద్వారా మొదలయింది. ఇది  ఈసారి ఐదు అంశాలను పరిశీలించింది. సముద్ర యానం ద్వారా ఈ ప్రాంతంలో సమన్వయాన్ని సాధించడానికి ఆచరణాత్మక పరిష్కారాలను తయారు చేయడం;  ఇండో-పసిఫిక్‌ తీరప్రాంతాన్ని అందరికీ అందుబాటులో ఉంచడం.. ; బ్లూ (మత్స్య సంపద) ఎకానమీకి ప్రాంతీయ విధానాన్ని పరిశీలించడం; మారిటైం -ఇండస్ట్రీ 4.0 నుండి అవకాశాలు; సాగర్మాల, సాగర్ కార్యక్రమాల  నుండి ప్రాంతీయ అవకాశాలు పొందడం.

ఐపీఆర్డీ ఈ నెల 27, 28,  29 తేదీలలో మూడు రోజుల ఆన్‌లైన్ ఈవెంట్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.  ఈ సంవత్సరం ఐపీఆర్డీ "21వ శతాబ్దంలో సముద్ర వ్యూహంలో పరిణామం: ఆవశ్యకాలు," అనే అంశంపై చర్చలు నిర్వహిస్తుంది. ఎనిమిది నిర్దిష్ట ఉప-అంశాలపై దృష్టి సారిస్తుంది. ‘‘చాలెంజెస్,  వే ఎహెడ్”... ఈ అంశంపై వరుసగా మూడు రోజులలో ఎనిమిది సెషన్లలో ప్యానెల్-చర్చలు జరుగుతాయి. తద్వారా విభిన్న దృక్కోణాలను పరిగణనలోకి తీసుకోవడానికి విస్తారమైన పరిధిని అందిస్తుంది. ఆలోచనలు,  అభిప్రాయాల స్వేచ్ఛా ప్రవాహాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఎనిమిది ఉప–-అంశాలు ఇలా ఉన్నాయి.

(1) ఇండో-–పసిఫిక్‌లో అభివృద్ధి చెందుతున్న సముద్ర వ్యూహాలు: సమ్మేళనాలు, సంబంధాలు తెంచుకోవడాలు, ఆశలు, ఆందోళనలు.

(2) సముద్ర భద్రతపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని పరిష్కరించడానికి అనుకూల వ్యూహాలు

(3) పోర్ట్ నేతృత్వంలో ప్రాంతీయ తీర కనెక్టివిటీ   అభివృద్ధి వ్యూహాలు

(4) సహకార సముద్ర ప్రాంత అవగాహన వ్యూహాలు.

(5) నియమాల -ఆధారిత ఇండో–-పసిఫిక్ తీర భద్రతకు పెరుగుతున్న ఆదరణ.  ప్రభావం.

(6) ప్రాంతీయ పబ్లిక్–-ప్రైవేట్ సముద్ర భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి వ్యూహాలు.

(7) శక్తి–అభద్రత,  ఉపశమన వ్యూహాలు.

(8) సముద్రం వద్ద మానవ,-మానవరహిత  వ్యూహాలు.

సమావేశాలకు ముందు రక్షణ, విదేశాంగ, పెట్రోలియం   సహజ వాయువుల మంత్రులు ప్రసంగిస్తారు.

ఈ వార్షిక కార్యక్రమాల ద్వారా, ఇండియన్ నేవీ,   నేషనల్ తీర ఫౌండేషన్లు.. ఇండో–-పసిఫిక్ సముద్ర ప్రాంతాన్ని ప్రభావితం చేసే భౌగోళిక, రాజకీయ పరిణామాలపై చర్చలకు వేదికను అందిస్తూనే ఉన్నాయి.

***(Release ID: 1766960) Visitor Counter : 87