రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

మోటారు సైకిల్‌పై తీసుకెళ్లే పిల్లల భద్రత నిమిత్తం నిబంధనల ముసాయిదా నియమావ‌ళి విడుద‌ల‌

Posted On: 26 OCT 2021 12:55PM by PIB Hyderabad

మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 129 మోటారు వాహనాల (సవరణ) చట్టం 2019, తేదీ 09.08.2019  సవరించబడింది.
సెక్షన్‌లోని రెండవ నిబంధన  "నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను మోటారు సైకిల్‌ను న‌డ‌ప‌డం లేదా ప్రయాణించ‌డం లేదా తీసుకువెళుతున్న వారి భద్రతకు సంబంధించిన వివిధ చర్యలు నియమాలను అందుబాటులోకి తేవ‌డం". దీనికి సంబంధించి మంత్రిత్వ శాఖ 21 అక్టోబర్ 2021, నాటి జీఎస్ఆర్‌ 758(ఈ) ప్రకారం ముసాయిదా నిబంధనలను రూపొందించింది, సిఫార్సు చేసింది
– నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలతో ప్ర‌యాణం చేస్తున్న స‌మ‌యంలో మోటార్‌సైకిల్ డ్రైవర్‌కు పిల్లలను అటాచ్ చేసేలా సేఫ్టీ హానెస్ ఉపయోగించాలి.
- 09 నెలల నుంచి 4 సంవత్సరాల మధ్య వయస్సు గల చైల్డ్ పిలియన్ ప్యాసింజర్ తప్పనిసరిగా అతని/ఆమె తలకు సరిపోయే క్రాష్ హెల్మెట్‌ను ధరించాలి. ఇది [ఏఎస్‌టీఎం 1447]/ [యూరోపియన్ (సీఈఎన్‌)బీఎస్ ఈఎన్‌ 1080/కి నిర్ధారించిన ప్ర‌మాణాల‌కు అనుగుణంగా ఉండాలి, ఆ హెల్మెట్  ఉండేలా డ్రైవర్ నిర్ధారించుకోవాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్ 2016 ప్రకారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ద్వారా ప్ర‌మాణాలు నిర్దేశించబడే వరకు పై ఈ ప్ర‌మాణాల‌నే పరిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి.
- 4 సంవత్సరాల వయస్సులోపు ఉన్న పిల్లలను మోటారుసైకిల్‌పై తీసుకుపోతున్న‌ప్పుడు గంటకు 40 కి.మీ. కంటే ఎక్కువ  వేగంతో వెళ్ల‌కూడ‌దు.
దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేష‌న్ నిమిత్తం కింది లింక్‌ను క్లిక్ చేయండిః

***



(Release ID: 1766746) Visitor Counter : 129