సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మార్టిన్ స్కోర్సెస్ మరియు ఇస్తెవాన్ స్జాబో లకు సత్యజిత్ రే జీవిత సాఫల్య అవార్డుల ప్రధానం

గోవాలో జరగనున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ప్రధాన వివరాలను ప్రకటించిన కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్

విభిన్న కథలు భారతదేశాన్ని ఒక కథల ఉపఖండం గా మారుస్తాయి: శ్రీ ఠాకూర్

నూతన సాంకేతిక విజ్ఞానానికి ఇఫి పెద్దపీట : ఉత్సవంలో పాల్గోవాలని ప్రధాన ఓటీటీ సంస్థలకు ఆహ్వానం

ఇఫి తో పాటు బ్రిక్స్ చలన చిత్రోత్సవ నిర్వహణ

ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌ భాగంగా ‘75 క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో ’ పోటీలు : నవంబర్ లో గోవా లో జరిగే ఉత్సవంలో పాల్గోనున్న విజేతలు

అంతర్జాతీయ విభాగంలో రికార్డు స్థాయిలో 96 దేశాలకు చెందిన 624 చిత్రాలు

ప్రారంభ చిత్రంగా కార్లోస్ సౌరా దర్శకత్వం వహించిన ది కింగ్ ఆఫ్ ఆల్ ది వరల్డ్ (ఎల్ రే డి టోడో ఎల్ ముండో) ఎంపిక

వర్చువల్ మాస్టర్‌క్లాస్‌ను నిర్వహించనున్న పారిస్ కి ప్రఖ్యాత విజువల్ కమ్యూనికేషన్ మరియు ఆర్ట్స్ స్కూల్ -గోబెలిన్స్ - స్కూల్ ఎల్' ఇమేజ్

Posted On: 22 OCT 2021 9:20AM by PIB Hyderabad

గోవాలో నిర్వహించనున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో  మార్టిన్ స్కోర్సెస్ మరియు ఇస్తెవాన్ స్జాబో లకు సత్యజిత్ రే జీవిత సాఫల్య అవార్డులను  ప్రధానం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. హంగరీ కి చెందిన ఇస్తెవాన్ స్జాబో కళాఖండాలుగా గుర్తింపు పొందిన  మషిస్తో ( 1981), ఫాదర్ ( 1966) లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించి అత్యుత్తమ దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. నూతన హాలీవుడ్ చరిత్రలో  అత్యంత ప్రభావిత దర్శకుల్లో ఒకరిగా మార్టిన్ స్కోర్సెస్ గుర్తింపు పొందారు.

చిత్రోత్సవ వివరాలను ప్రకటించిన శ్రీ ఠాకూర్ ఉత్తమ కథలకు భారతదేశం పుట్టినిల్లుగా గుర్తింపు పొందింది. మన కథలు ప్రపంచ గుర్తింపు పొందాయి. విభిన్న కథాంశాలను అందించిన భారతదేశం కళల ఉపఖండం గా గుర్తింపు పొందిందిఅని అన్నారు.  

భారతదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 52 వ చలన చిత్రోత్సవాలు గోవాలో 2021 నవంబర్ 20 నుంచి 28 వ తేదీ వరకు జరుగుతాయి. 

ఓటిటీ సంస్థలకు  భాగస్వామ్యం: 

చిత్రోత్సవాల్లో పాల్గోవాలని ప్రముఖ ఓటీటీ సంస్థలను తొలిసారిగా ఆహ్వానించినట్టు శ్రీ ఠాకూర్ తెలిపారు. ప్రత్యేకమైన మాస్టర్ క్లాసులుకంటెంట్ లాంచ్‌లు మరియు ప్రివ్యూలుక్యూరేటెడ్ ఫిల్మ్ ప్యాకేజీ స్క్రీనింగ్‌లు మరియు వివిధ ప్రత్యక్ష, వర్చువల్ విధానాల ద్వారా నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో  నెట్‌ఫ్లిక్స్అమెజాన్ ప్రైమ్జీ 5, వూట్ మరియు సోనీ లివ్ సంస్థలు చలన చిత్రోత్సవంలో పాల్గొంటాయి. ఓటీటీ ద్వారా చిత్రాలను ఇటీవల కాలంలో ప్రజలు ఎక్కువగా చూస్తున్నారని  శ్రీ ఠాకూర్ అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని నూతన సాంకేతిక విధానాలను పరిశ్రమకు చేరువ లోకి తీసుకుని రావాలన్న లక్ష్యంతో ఓటీటీ సంస్థలతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. 

పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రఖ్యాత స్కూల్ ఆఫ్ ఇమేజ్ అండ్ ఆర్ట్స్, గోబెలిన్స్-స్కూల్ ఎల్ ఇమేజ్ సహకారంతో నెట్‌ఫ్లిక్స్ 3 రోజుల వర్చువల్ మాస్టర్‌క్లాస్‌ను నిర్వహిస్తుంది. 

జేన్ కాంపియన్ ద్వారా ‘ది పవర్ పవర్ ఆఫ్ ది డాగ్’ ఇండియా ప్రీమియర్‌ను సంస్థ నిర్వహించనుంది. కార్తీక్ ఆర్యానంద్  నిర్మించిన ‘ధమాకా’ చిత్రంతో పాటుగా రవీనాటండన్, అశుతోష్ రానా ప్రధాన పాత్రలలో నటించిన  క్రైమ్ థ్రిల్లర్ సిరీస్  ఎపిసోడ్ 1 ప్రివ్యూ ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించాలని కూడా  నెట్‌ఫ్లిక్స్  ప్రతిపాదించింది.

 సుమిత్ పురోహిత్ మరియు సౌరవ్‌డే  స్క్రీన్ ప్లే  అందించిన  స్కాం- 1922  మాస్టర్‌క్లాస్‌ను స్టూడియో నెక్స్ట్ బిజినెస్ హెడ్ ఇంద్రనీల్ చక్రవర్తి వ్యాఖ్యానంతో నిర్వహించడానికి సోనీ లివ్ సంసిద్ధత వ్యక్తం చేసింది. 

ఐఎఫ్‌ఎఫ్‌ఐ కోసం నితేష్ తివారీ ,  అశ్వినీఇయర్‌ ప్రత్యేకంగా రూపొందించిన పేస్, భూపతి సిరీస్ ని  జీ 5ప్రసారం చేస్తుంది. 

 ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా  75 క్రియేటివ్ మైండ్స్‌ గుర్తింపు 

చలన చిత్ర పరిశ్రమకు పరిచయం చేసి ప్రోత్సహించాలన్న లక్ష్యంతో దేశం వివిధ ప్రాంతాల్లో యువ  ప్రతిభావంతులను   గుర్తించడానికి పోటీలను నిర్వహిస్తామని శ్రీ ఠాకూర్ ప్రకటించారు. దీనిలో 35 లోపు వయస్సు  ఉన్న 75 మంది యువ ప్రతిభావంతులను ఎంపిక చేసి ఉత్సవాల్లో పాల్గొడానికి ఆహ్వానాలు పంపుతామని మంత్రి తెలిపారు. వీరు చలన చిత్ర రంగ ప్రముఖులతో చర్చలు జరిపి మాస్టర్ క్లాస్ లను హాజరవుతారు. దీనికోసం జాతీయ స్థాయి పోటీలను నిర్వహించడం జరుగుతుంది. దీనిద్వారా 75 మంది యువ నిర్మాతలు,నటులు,గాయకులు, రచయితలు తమ ప్రతిభను ప్రదర్శించి ప్రపంచ స్థాయి గుర్తింపును పొందడానికి అవకాశం కలుగుతుంది. పోటీలలో పాల్గోవడానికి ఆసక్తి గలవారు తమ దఖాస్తులను 2021 అక్టోబరు 30 లోగా అందించవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను  www.dff.gov.in and www.iffi.org. ద్వారా పొందవచ్చు. 

బ్రిక్స్ చలన చిత్రోత్సవం 

అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం తో సహా తొలిసారిగా బ్రిక్స్ చలన చిత్రోత్సవాన్ని తొలిసారిగా నిర్వహిస్తామని శ్రీ ఠాకూర్ వెల్లడించారు. బ్రెజిల్,రష్యా,దక్షిణాఫ్రికా, చైనా, భారతదేశంలో నిర్మించిన చిత్రాలను దీనిలో ప్రదర్శిస్తారు.

 కార్లోస్ సౌరా దర్శకత్వం వహించిన 'ది కింగ్ ఆఫ్ ఆల్ ది వరల్డ్' (ఎల్ రే డి టోడో ఎల్ ముండో)ను ఉత్సవాల  ప్రారంభ చిత్రంగా ప్రదర్శిస్తారని శ్రీ ఠాకూర్ ప్రకటించారు. ఇది సినిమా అంతర్జాతీయ ప్రీమియర్‌గా ఉంటుందని అన్నారు.  మిడ్ ఫెస్ట్ చిత్రంగా  వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ దర్శకుడిగా ఎంపిక అయిన  జేన్ క్యాంపియన్ దర్శకత్వం వహించిన పవర్ ఆఫ్ ది డాగ్ ను ప్రదర్శిస్తారు.  ఫెస్టివల్ కెలిడియోస్కోప్ మరియు వరల్డ్ పనోరమా విభాగంలో  52 వ ఇఫీ లో ప్రదర్శించడానికి  ప్రముఖ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ నుంచి దాదాపు 30 చిత్రాలు ఎంపిక  చేయబడ్డాయి.

శ్రీ దిలీప్ కుమార్శ్రీమతి సుమిత్రా భావేశ్రీ బుద్ధదేవ్ దాస్‌గుప్తశ్రీ సంచారి విజయ్శ్రీమతి సురేఖా సిక్రీమిస్టర్ జీన్ పాల్ బెల్మండోమిస్టర్ బెర్ట్రాండ్ టవేనియర్మిస్టర్ క్రిస్టోఫర్ ప్లమ్మర్ మరియు మిస్టర్ జీన్-క్లాడ్ క్యారియర్  లకు అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో నివాళులు అర్పించడం జరుగుతుంది.

శ్రీమతి రక్షన్‌బానిటెమాడ్ (67 సంవత్సరాలు) |  ఇరాన్ |  ఫిల్మ్ మేకర్- జ్యూరీ ఛైర్‌పర్సన్

 

 శ్రీ  స్టీఫెన్ వూలీ (65 సంవత్సరాలు) |  యూకే  |  చిత్ర నిర్మాతదర్శకుడు

 

శ్రీ సిరో గెర్రా (40 సంవత్సరాలు) |  కొలంబియా |  చిత్ర నిర్మాత  

 శ్రీ విముక్తిజయసుందర (44 సంవత్సరాలు) |  శ్రీలంక |   చిత్ర నిర్మాత 

 

 శ్రీ నీలా మాధబ్ పాండా (47 సంవత్సరాలు) |  భారతదేశం |   చిత్ర నిర్మాత సభ్యులుగా చలన చిత్రోత్సవ   న్యాయ నిర్ణేతల మండలి ఏర్పాటు అయ్యింది. 

సింహావలోకనం 

సింహావలోకన విభాగంలో ప్రముఖ హంగేరియన్ చిత్ర నిర్మాత బేలా టార్ ను 52 వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో గుర్తు చేసుకోవడం జరుగుతుంది.   బేలా టార్ నిర్మించిన చిత్రాలు బెర్లిన్కేన్స్ మరియు లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రశంసలు పొందాయి.  బేలా టార్ విజువల్ స్టైల్‌ని సృష్టించిన ప్రముఖ చిత్రనిర్మాత.

ఈ విభాగంలో రష్యన్ చిత్రనిర్మాత మరియు రంగస్థల దర్శకుడు శ్రీ ఆండ్రీ కొంచలోవ్స్కీ  చిత్రాలను కూడా ప్రదర్శిస్తారు.     శ్రీ ఆండ్రీ కొంచలోవ్స్కీ నిర్మించిన చిత్రాలు   కేన్స్ గ్రాండ్ ప్రి స్పెషల్ డు జ్యూరీఒక FIPRESCI అవార్డురెండు సిల్వర్ లయన్స్మూడు గోల్డెన్ ఈగిల్ అవార్డులు మరియు ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డుతో సహా అనేక ప్రశంసలను గెలుచుకున్నాయి.

 దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డు గ్రహీత శ్రీ రజినీకాంత్ కూడా సింహావలోకన విభాగంలో  ఉంటారు.

 

 బ్రిటిష్ రహస్య ఏజెంట్ జేమ్స్ బాండ్‌గా వెండి తెరపై తొలిసారిగా నటించి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పెద్ద తెరపై చిత్రీకరించిన మొదటి నటుడు సర్ సీన్ కానరీకి చలన చిత్రోత్సవం  ప్రత్యేక నివాళి అర్పిస్తుంది.

 

***

 (Release ID: 1765814) Visitor Counter : 107