యు పి ఎస్ సి
ఎస్‌సీ/ ఎస్‌టీ/ ఓబీసీ/ ఈడబ్ల్యుఎస్/ పీడబ్ల్యుబీడీ వర్గాల వారి కోసం యూపీఎస్‌సీ హెల్ప్‌లైన్
Posted On:
20 OCT 2021 3:01PM by PIB Hyderabad
స్వాతంత్ర్య వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న శుభతరుణానికి గుర్తుగా భారతదేశం 'ఆజాది కా అమృత్ మహోత్సవం' వేడుకను జరుపుకుంటుంది. ఈ గొప్ప వేడుకలో భాగంగా విభిన్న వర్గాల వారికి సహాయంగా ఉండేలా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) ఒక హెల్ఫ్‌లైన్‌ను ప్రారంభించింది. షెడ్యూల్ కులాలకు (ఎస్‌సీ), షెడ్యూల్డ్ తెగకు (ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ), ఆర్థికంగా బలహీనమైన వర్గాలు (ఈడబ్ల్యుఎస్) మరియు బెంచ్‌మార్క్ వైకల్యాలు కలిగి ఉన్న వ్యక్తులకు (పీడబ్ల్యుబీడీ) కమిషన్ నిర్వహించే పరీక్షలు/ రిక్రూట్‌మెంట్‌ల కోసం దరఖాస్తు చేసేవారు/ దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటున్న వారికి సహాయం చేయాలనే లక్ష్యంతో ఒక 'హెల్ప్‌లైన్' (టోల్ ఫ్రీ నంబర్ 1800118711) ను ప్రారంభించింది. ఆయా వర్గాలకు చెందిన అభ్యర్థుల సందేహాలకు స్నేహపూర్వకంగా సమాధానాలు అందించాలన్న కమిషన్ ప్రయత్నంలో భాగంగా దీనిని ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్‌లైన్ అన్ని పని దినాలలో (కార్యాలయ సమయంలో) పనిచేస్తుంది. పైన పేర్కొన్న కేటగిరీల అభ్యర్థులు ఏదైనా పరీక్ష/ నియామకానికి సంబంధించిన దరఖాస్తు ఫారమ్‌ని నింపడంలో లేదా కమిషన్ పరీక్షలు/ నియామకాలకు సంబంధించిన ఏవైనా సందేహాల కోసం, ఇతరత్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లయితే, సహాయం కోసం ఈ పూర్తిస్థాయి హెల్ప్‌లైన్‌లో సంప్రదించవచ్చు.
<><><>
(Release ID: 1765361)
Visitor Counter : 266