ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

98.67 కోట్ల డోసులను దాటిన భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 87 లక్షలకుపైగా టీకా డోసులు నిర్వహణ

98.14 శాతానికి చేరిన రికవరీ రేటు; 2020 మార్చి నుంచి గరిష్ట స్థాయి

గత 24 గంటల్లో 13,058 కొత్త కేసులు నమోదు

క్రియాశీల కేసుల సంఖ్య 1,83,118; 2020 మార్చి నుంచి కనిష్ట స్థాయి

క్రియాశీల కేసుల సంఖ్య 1,83,118; 2020 మార్చి నుంచి కనిష్ట స్థాయి

Posted On: 19 OCT 2021 9:36AM by PIB Hyderabad

భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం నిన్నటితో 98.67 కోట్ల డోసులను దాటింది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 87,41,160 డోసులతో కలిపి, 98.67 కోట్ల డోసులను (98,67,69,411) టీకా కార్యక్రమం అధిగమించింది. 97,44,653 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,76,000

రెండో డోసు

90,91,443

 

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,62,479

రెండో డోసు

1,55,61,415

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

39,58,41,135

రెండో డోసు

11,40,66,397

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

16,84,48,531

రెండో డోసు

8,71,46,650

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

10,60,88,795

రెండో డోసు

6,17,86,566

మొత్తం

98,67,69,411

 

గత 24 గంటల్లో 19,470 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,34,58,801 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.14 శాతానికి చేరింది. 2020 మార్చి నుంచి ఇదే గరిష్ట స్థాయి.

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 114వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 13,058 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది 231 రోజుల కనిష్ట స్థాయి.

క్రియాశీల కేసులు 2 లక్షల కంటే తక్కువగా, 1,83,118 గా ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో ఇది 0.54 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 11,81,314 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 59.31 కోట్లకు పైగా (59,31,06,188) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.36 శాతంగా ఉంది. గత 116 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.11 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 50 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా, 133 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. 

 

****



(Release ID: 1764895) Visitor Counter : 144