ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 19 OCT 2021 9:13AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 98.67 కోట్ల డోసులను అందించారు.

గత 24 గంటల్లో 13,058 కొత్త కేసులు నమోదయ్యాయి; ఇది 231 రోజుల కనిష్ట స్థాయి.

రికవరీ రేటు 98.14% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 19,470 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,34,58,801 కు పెరిగింది.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.54% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,83,118. ఇది 227 రోజుల కనిష్ట స్థాయి.

వారపు పాజిటివిటీ రేటు (1.36%) గత 116 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.

రోజువారీ పాజిటివిటీ రేటు (1.11%) గత 50 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 59.31 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

 

****


(Release ID: 1764891) Visitor Counter : 198