ప్రధాన మంత్రి కార్యాలయం

సౌరాష్ట్రపటేల్ సేవా సమాజ్ సూరత్ లో నిర్మించిన హాస్టల్ ఫేజ్-1 కు అక్టోబర్ 15 న భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్న ప్రధాన మంత్రి

Posted On: 14 OCT 2021 2:30PM by PIB Hyderabad

సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్ సూరత్ లో నిర్మించిన హాస్టల్ ఫేజ్-1 (బాలుర వసతి గృహం) తాలూకు భూమి పూజ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబర్ 15 న ఉదయం 11:00 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా నిర్వహించనున్నారు.

 

ఈ హాస్టల్ భవనం లో సుమారు 1500 మంది విద్యార్థుల కు బస చేయడానికి తగిన సౌకర్యాలు ఉన్నాయి. ఈ హాస్టల్ భవనం లో ఒక సభాభవనం తో పాటు విద్యార్థుల కోసమే ఏర్పాటు చేసిన ఒక గ్రంథాలయం కూడా ఉంది. సుమారు 500 మంది బాలికల కోసం హాస్టల్ ఫేజ్-2 నిర్మాణ పనులు రాబోయే సంవత్సరం లో ఆరంభం కానున్నాయి

 

సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్ ను గురించి

 

ఇది 1983వ సంవత్సరం లో ఏర్పాటు చేసిన ఒక నమోదిత ట్రస్టు. సమాజం లోని బలహీన వర్గాల లో విద్య పరమైనటువంటి మరియు సామాజిక పరమైనటువంటి పరివర్తన కు దోహద పడడం దీని ప్రధానోద్దేశ్యం గా ఉంది. ఇది విద్యార్థుల ను వివిధ పోటీ పరీక్ష ల కోసం సన్నద్ధం చేయడం లో సహాయకారి గా ఉండటమే కాకుండా వారికి నవ పారిశ్రామికత్వం, ఇంకా నైపుణ్య అభివృద్ధి లకు సంబంధించిన ఒక వేదిక ను కూడా సమకూర్చుతుంది.

గుజరాత్ ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు.(Release ID: 1763940) Visitor Counter : 29