బొగ్గు మంత్రిత్వ శాఖ

థర్మల్ ప్లాంట్‌లకు రికార్డు స్థాయిలో బొగ్గు సరఫరా


రెండు మిలియన్ టన్నులకు పైగా- స‌ర‌ఫ‌రా- కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి

దేశంలో బొగ్గు పంపకాన్ని మరింతగా పెంచేందుకు ప్రయత్నాలు

Posted On: 13 OCT 2021 3:52PM by PIB Hyderabad

అందుబాటులో ఉన్న అన్ని వనరుల నుండి థర్మల్ విద్యుత్‌ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా పెరగడంపై కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి సంతోషం వ్యక్తం చేశారు. నిన్న కోల్ ఇండియా లిమిటెడ్‌తో (సీఐఎల్‌) సహా సంచిత బొగ్గు సరఫరా 2 మిలియన్ టన్నులకు పైగా నమోదయ్యాయని మంత్రి ఒక‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. విద్యుత్ ప్లాంట్లకు తగినంత నిల్వ ఉండేలా పవర్ ప్లాంట్‌లకు బొగ్గు పంపకాన్ని మరింత పెంచనున్నట్లు శ్రీ జోషి పేర్కొన్నారు.



(Release ID: 1763924) Visitor Counter : 132