బొగ్గు మంత్రిత్వ శాఖ

బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ ప్ర‌య‌త్నాలు


- వచ్చే ఏడాది నుండి ఉత్ప‌త్తిని సంవత్సరానికి 4 నుండి 20 మిలియన్ టన్నులకు పెంచేందుకు కృషి

Posted On: 13 OCT 2021 3:51PM by PIB Hyderabad

ప్ర‌భుత్వ రంగ న‌వ‌ర‌త్న సంస్థ అయిన ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ ఒడిషాలోని 20 ఎంటీపీఏ తలబిరా II & III ఓపెన్ కాస్ట్ మైన్ నుంచి తొలి పూర్తి సంవ‌త్సరం కార్య‌క‌లాపాల‌లో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు 2 మిలియన్ టన్నులకు మంచి  బొగ్గును ఉత్పత్తి చేసింది.  అధిక బొగ్గు డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ఎన్ఎల్‌సీఐఎల్  ప్రస్తుత సంవత్సరంలో త‌న‌ అసలు షెడ్యూల‌యిన 4 ఎంటీల ఉత్ప‌త్తిని మించి సంవత్సరానికి 6 ఎంటీ లక్ష్యాన్ని సాధించడానికి చర్యలు తీసుకుంది.  ప్రస్తుత సంవత్సరం తలబిరా మైన్ నుంచి బొగ్గు ఉత్పత్తిని 10 ఎంటీల  వరకు పెంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే సంవత్సరం నుండి దీనిని 20 ఎంటీల‌ వరకు పెంచాల‌ని నిర్ణ‌యించింది.  ఉత్పత్తి చేయబడిన బొగ్గును వాడ‌క‌పు ప్లాంట్‌లలో ఒకటైన ఎన్‌ఎల్‌సీఐఎల్ అనుబంధ సంస్థ అయిన ట్యుటికోరిన్‌లో 2 x 500 మెగావాట్ల తమిళనాడు పవర్ లిమిటెడ్‌కు రవాణా చేస్తున్నారు. ఈ ప్లాంటులో మొత్తం ఉత్పత్తి చేసే విద్యుత్‌ దక్షిణాది రాష్ట్రాల అవసరాలను తీర్చుతోంది. ఇందులో ప్ర‌ధాన వాటా తమిళనాడు రాష్ట్రానిదే (40% కంటే ఎక్కువ). బొగ్గు మంత్రిత్వ శాఖ ద్వారా ఖనిజ రాయితీ నియమాలపై గనులు మరియు ఖనిజాలు (అభివృద్ధి మరియు నియంత్రణ) చట్టానికి ఇటీవల కొన్ని సవరణలు చేసింది. దీని ప్ర‌కారం తుది వినియోగ కర్మాగారం యొక్క బొగ్గు అవసరాలను తీర్చిన తర్వాత అదనపు బొగ్గును విక్రయించడానికి ఆయా గ‌నుల యాజ‌మాన్యాల‌కు అనుమతి ఉంటుంది. దీని ప్రకారం ఎన్ఎల్‌సీఐఎల్‌ అదనపు బొగ్గును విక్రయించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ నుండి అనుమతి కోరింది.
                                                                           

******


 



(Release ID: 1763698) Visitor Counter : 124