హోం మంత్రిత్వ శాఖ
చార్టర్డ్ విమానాల ద్వారా భారతదేశానికి వచ్చే విదేశీయులకు తాజా టూరిస్ట్ వీసాలను అక్టోబర్ 15 నుంచి అమల్లోకి తేనున్న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ)
- చార్టర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ కాకుండా ఇతర విమానాల ద్వారా భారతదేశానికి ప్రయాణించే విదేశీ పర్యాటకులు నవంబర్ 15 నుండి అమలు చేయగలరు
- విదేశీ పర్యాటకులు, భారతదేశంలోకి తీసుకువచ్చే విమానాలు మరియు ల్యాండింగ్ స్టేషన్లలోని ఇతర భాగస్వామ్య పక్షాల వారు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన అన్ని కోవిడ్-19 ప్రోటోకాల్‌లు, ఇతర నిబంధనలు అనుసరించాలి
Posted On:
07 OCT 2021 5:43PM by PIB Hyderabad
కోవిడ్-10 మహమ్మారి వ్యాప్తి కారణంగా భారత్‌దేశంలో విదేశీయులకు మంజూరు చేసే అన్నిరకాల వీసాలు గత సంవత్సరం నిలిపివేయబడ్డాయి. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణాలపై అనేక రకాల ఇతర ఆంక్షలను విధించింది. మెరుగుపడుతున్న కోవిడ్-19 పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న తరువాత, విదేశీయులు భారతదేశంలోకి రావడానికి, ఉండేందుకు టూరిస్ట్ వీసా కాకుండా, ఇతరేత్రమైన భారతీయ వీసాలను పొందేందుకు గాను అనుమతించబడ్డారు. విదేశీ పర్యాటకులు భారతదేశానికి వచ్చేందుకు అనుమతించడానికి పర్యాటక వీసాలను ప్రారంభించాలని అనేక రాష్ట్ర ప్రభుత్వాల నుండి మరియు పర్యాటక రంగంలోని వివిధ వాటాదారుల నుండి ఎంహెచ్ఏకు పలు అభ్యర్థనలు అందుతున్నాయి. దీంతో ఎంహెచ్ఏ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వంటి అన్ని ప్రధాన భాగస్వామ్య పక్షాల వారిని సంప్రదించింది. పర్యాటక మంత్రిత్వ శాఖ మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ పర్యాటకులు వస్తారని భావిస్తున్నారు. వివిధ ఇన్‌పుట్‌లను పరిశీలించిన తరువాత, ఎంహెచ్ఏ అక్టోబర్ 15, 2021 నుండి చార్టర్డ్ విమానాల ద్వారా భారతదేశానికి వచ్చే విదేశీయులకు తాజా టూరిస్ట్ వీసాలను మంజూరు చేయడం ప్రారంభించాలని నిర్ణయించింది. చార్టర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ కాకుండా ఇతర విమానాల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించే విదేశీ టూరిస్టులు, తాజా టూరిస్ట్ వీసాలపై నవంబర్ 15, 2021 నుండి దేశంలోకి అనుమతించనున్నారు. విదేశీ పర్యాటకులు, భారతదేశంలోకి తీసుకువచ్చే విమానాలు మరియు ల్యాండింగ్ స్టేషన్లలోని ఇతర భాగస్వామ్య పక్షాల వారు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన అన్ని కోవిడ్-19 ప్రోటోకాల్‌లు, ఇతర నిబంధనలు అనుసరించాలి
దీనితో, ప్రస్తుతం ఉన్న మొత్తం కోవిడ్-19 పరిస్థితిని బట్టి వీసా మరియు అంతర్జాతీయ ప్రయాణాలపై విధించిన ఆంక్షలు మరింత సడలించబడినట్టయింది.
***
(Release ID: 1761993)
Visitor Counter : 385