ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
నాస్కామ్ 'డిజైన్ మరియు ఇంజినీరింగ్ సమ్మిట్' 13వ ఎడిషన్‌లో ప్రసంగించిన ఐటీ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్
- 2015లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియాను ప్రారంభించినప్పటి నుండి భారతదేశం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో దూసుకుపోతోంది
- 50 అత్యంత ఇన్నోవెటివ్ గ్లోబల్ కంపెనీలలో 70% భారతదేశంలో ఆర్అండ్‌డీ కేంద్రాల్ని కలిగి ఉన్నాయి: ఐటీ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్
- తయారీ, ఇంజినీరింగ్, డిజిటలైజేషన్‌లో పెరుగుతున్న అవకాశాలు భారత్‌దేశంను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా తీసుకుపోయే విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి: ఐటీ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్
Posted On:
06 OCT 2021 6:41PM by PIB Hyderabad
‘ఇంజినీరింగ్ నెక్స్ట్’ అనే ఇతివృత్తంతో నాస్కామ్ నిర్వహించిన ‘డిజైన్ అండ్ ఇంజినీరింగ్ సమ్మిట్’ 13వ ఎడిషన్ సదస్సుకు
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖల కేంద్ర సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ఈరోజు హాజరయ్యారు. అక్టోబర్ 6, 7వ తేదీ 2021లలో నిర్వహిస్తున్న ఈ సదస్సు గ్లోబల్ ఇంజినీరింగ్ మరియు డిజైన్ ప్రయత్నాలను
4 ప్రత్యేక లక్ష్యాలపై దృష్టి సారిస్తూ జరుగుతోంది. విలువను సృష్టించడానికి పరిశోధన, ఆవిష్కరణలను చేపట్టడం, వృద్ధిని పెంపొందించేందుకు సహ-సృష్టి, వినియోగదారు విజయం కోసం డిజిటలైజేషన్, వేగవంతమైన ఉత్పత్తి చక్రం, పని ఫ్రేమ్ వర్క్ యొక్క భవిష్యత్తును నిర్వచించడం మరియు వ్యాపారాన్ని నిలకడ లక్ష్యాలకు సమలేఖనం చేయడం.. అనే అంశాలపై ప్రత్యేక దృష్టితో దీనిని నిర్వహిస్తున్నారు. సదస్సులో మంత్రి శ్రీ చంద్రశేఖర్ తన ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ఇంజినీరింగ్, పరిశోధన & అభివృద్ధి (ఈఆర్&డీ) రంగం $ 31 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సృష్టిస్తుందని తెలిపారు.
ఆర్&డీ కేంద్రంగా భారత్..
1000 కంటే ఎక్కువ గ్లోబల్ స్థాయి కంపెనీలకు నిలయంగా భారత్ నిలుస్తోందని అన్నారు. వివిధ రంగాలలో ఉత్పత్తి ఆర్ అండ్ డీ కోసం భారతదేశంలో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనికి తోడు టాప్ 50 ఇంజనీరింగ్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థలలో 12 మన భారతదేశంలో ప్రధాన కార్యాలయాలను కలిగి ఉన్నారు. టాప్ 50 సర్వీస్ ప్రొవైడర్లలో 44 మంది భారతదేశంలో ఈఆర్&డీ కార్యకలాపాలను కలిగి ఉన్నాయి. 50 అత్యంత ఇన్నోవేషన్ గ్లోబల్ కంపెనీలలో 70% పైగా మన భారతదేశంలో ఆర్&డీ కేంద్రాల్ని కలిగి ఉన్నాయని వివరించారు. అంటే దాదాపు మనం వినియోగించే ప్రతి ఉత్పత్తిలోనూ 'ఇండియా ఇన్సైడ్స్' (భారత్ అంతర్గతంగా) ఉన్నట్లేనని మంత్రి తెలిపారు. "తయారీ, ఇంజినీరింగ్ మరియు డిజిటలైజేషన్ రంగాలలో అందుకొనేందుకు ఇంకా అత్యుత్తమ అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. రాబోయే 5 సంవత్సరాలలో మన ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీ లక్ష్యసాధనలో ఆయా ఉపయోగించని అవకాశాలు కీలక పాత్ర పోషిస్తాయి" అని ఆయన అన్నారు. మహమ్మారి వ్యాప్తి ఆవిష్కరణ కోసం కోలుకోలేని మార్పును సృష్టించింది. కాంటాక్ట్‌లెస్ సిస్టమ్స్, ఇంటెలిజెన్స్ మరియు అనలిటిక్స్ మరియు సాఫ్ట్‌వేర్ లీడ్ సిస్టమ్‌ల ద్వారా ఉత్పత్తులు ఎలా డిజైన్ చేయబడతాయి, ఇంజనీరింగ్ చేయబడతాయి, వినియోగించబడతాయి, సర్వీసు చేయబడతాయి అనే దిశగా కొత్త అవకాశాలను సృష్టించాయి అని తెలిపారు. ఈ టెక్టోనిక్ షిఫ్ట్‌లన్నీ ఎంబెడెడ్ సిస్టమ్స్, డిజిటల్ ఇన్నోవేషన్ మరియు సైబర్ సెక్యూరిటీకి సామర్థ్య మార్పు కోసం పిలుపునిస్తాయి. 'తదుపరి ఇంజినీరింగ్' అనే ఆసక్తికరమైన థీమ్‌తో ఈ కార్యక్రమం సాగుతోందని అన్నారు. ప్రపంచం మరియు భారతదేశం వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి - ఈ స్పష్టమైన పిలుపునకు భారతదేశం తప్పక నాయకత్వం వహించాలని శ్రీ చంద్రశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు; తదుపరి బిలియన్ కోసం నిర్మించండి, ఎస్‌డీజీ లక్ష్యాలను చేరుకోవడానికి, తదుపరి మహమ్మారులను నివారించగల పరిష్కారాలను రూపొందించడానికి సహాయపడే పరిష్కారాలను రూపొందించేలా పరిశోధనలు, అభివృద్ధి ఉండాలని మంత్రి అభిప్రాయపడ్డారు.
స్వయంగా నేనూ ఇంజినీర్‌నే..
" స్వయంగా నేను ఒక ఇంజనీర్‌ను. కొత్తవి నిర్మించడం ఇంజినీర్‌కు ఎంతో ఆనందంగా ఉంటుంది. మన ఆవిష్కరణలు మన దేశ అభివృద్ధితో ముడి పడి ఉన్నప్పుడు అది మరింత ప్రశంసనీయంగా ఉంటుంది."అని అన్నారు. 2015 లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియాను ప్రారంభించినప్పటి నుండి, భారతదేశం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో దూసుకుపోతోందని తెలిపారు. ప్రస్తుతం 46 వ స్థానంలో ఉందని తెలిపారు. 2016 లో 66 వ ర్యాంక్ నుండి 20 పాయింట్ల మెరుగుదలతో మన దేశం దూసుకుపోతోందన్నారు.
అంకుర సంస్థలు దూసుకుపోతున్నాయి..
భారతదేశంలో కొత్త ఉత్సాహం ఉంది మరియు మా స్టార్టప్ వ్యవస్థాపకులకు చేయగలిగే స్ఫూర్తి కూడా ఉంది. 2021 లో 27 యునికార్న్స్ మరియు $ 20 బిలియన్లకు పైగా నిధులు వచ్చాయని తెలిపారు. భారతదేశంలో స్టార్ట్-అప్ ఐపీఓల విస్తరణ స్పష్టంగా ఈ ఏడాదిని స్టార్టప్‌ల సంవత్సరంగా మార్చింది. భారతదేశం యొక్క ఆశయం ప్రధాన మంత్రి దూరదృష్టితో అభివృద్ధి చెందుతూనే ఉంది మరియు ఇది కేవలం స్టార్టప్‌లు మాత్రమే కాదు, ప్రభుత్వం పీఎల్ఐ పథకానికి కూడా మంచి అద్భుతమైన ప్రతిస్పందన లభించింది. ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ కోసం ఆమోదించబడిన ప్రతిపాదనలు తదుపరి 4 సంవత్సరాలలో $ 22 బిలియన్ ఉత్పత్తిని తీసుకురాగలవు. పీఎల్ఐ పథకం టెక్స్‌టైల్, ఆటో మొదలైన రంగాలలో విస్తరించబడింది మరియు మేక్ ఇన్ ఇండియా విజన్ గ్లోబల్ మరియు ఇండియన్ కంపెనీలను దేశీయ తయారీలోకి ఆకర్షిస్తోంది. ఈఆర్&డీ రంగం గురించి ఆలోచించినప్పుడు ఇది చాలా ముఖ్యమని తోస్తోంది. దేశంలో డిజైన్, ఇంజినీర్ మరియు తయారీలో భారత్ ఒక సమీకృత భాగస్వామి కావచ్చని అన్నారు.
ప్రపంచ మార్కెట్‌లో 50 శాతం కంటే ఎక్కువ వాటా లక్ష్యం కావాలి..
"సాంకేతికత, నైపుణ్యం మధ్య సన్నిహిత సంబంధాన్ని పరిగణనలోకి తీసుకొని, నైపుణ్యాల అభివృద్ధి మంత్రిగా కూడా ఉన్న నేను.. డిజిటల్ టెక్నాలజీలు మరియు సాఫ్ట్ స్కిల్స్ యొక్క వర్ణపటంలో ఉపాధి నైపుణ్యాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి నేను పరిశ్రమతో కలిసి పని చేస్తున్నాను. భారతదేశం ప్రపంచానికి గ్లోబల్ డిజిటల్ టాలెంట్ హబ్‌గా మారగలదని నిర్ధారించడానికి కృషి చేస్తున్నాను. ప్రస్తుతం, భారతదేశంలో గ్లోబల్ ఈఆర్&డీ అవుట్‌సోర్సింగ్ మార్కెట్‌లో 32% వాటాను కలిగి ఉంది. మనవద్ద ఉన్న అన్ని వనరులు మరియు ప్రభుత్వ నిర్వహిస్తున్న ఉత్ప్రేరకపు పాత్రను వినియోగించుకొని మొత్తం ఐటీ పరిశ్రమ, ఈఆర్ అండ్ డీ కమ్యూనిటీలోని మీ అందరూ.. రాబోయే ఐదేళ్లలో ప్రపంచ మార్కెట్ వాటాలో భారత్ 50 శాతం కంటే ఎక్కువ వాటాను సాధించేలా లక్ష్యం నిర్ధారించుకొని కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ విషయంలో మీరు విజయవంతం కావడానికి ప్రభుత్వం తమ ఆధీనంలో శాయశక్తులుగా కృషి చేస్తుంది. "చేయగలిగే" స్ఫూర్తితో కొనసాగండి మరియు ప్రతి సంవత్సరం ఈఆర్&డీ విజయాన్ని జరుపుకుందాం" అని మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
***
(Release ID: 1761839)
Visitor Counter : 163