ప్రధాన మంత్రి కార్యాలయం
కర్నాటక లో ఇల్లు కూలిన ఘటన లో ప్రాణనష్టం సంభవించడం పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి; బాధితుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచిపరిహారానికి ఆయన ఆమోదం తెలిపారు
నాడు పోస్టు చేయడమైనది:
07 OCT 2021 1:28PM by PIB Hyderabad
కర్నాటక లోని బెళగావి లో ఒక ఇల్లు కూలిపోయినందువల్ల ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇచ్చేందుకు కూడా ప్రధాన మంత్రి ఆమోదం తెలిపారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘కర్నాటక లోని బెళగావి లో ఒక ఇల్లు కూలిపోయి ప్రాణనష్టం సంభవించడం దుఃఖదాయకం. ఈ దుఃఖ ఘడియ లో ఆప్తుల ను కోల్పోయిన వారి శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. మృతుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని చెల్లించడం జరుగుతుంది: ప్రధాన మంత్రి @narendramodi’’
అని పేర్కొంది.
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1761746)
సందర్శకుల సూచీ సంఖ్య : : 152
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam