ప్రధాన మంత్రి కార్యాలయం

ఎక్స్ పో 2020 దుబయి లోని ఇండియా పెవిలియన్ లో ప్రధాన మంత్రి సందేశం


‘‘యుఎఇ తో,దుబయి తో మన గాఢమైన మరియు చరిత్రాత్మకమైన సంబంధాల ను ఎక్స్ పో మరింత ముందుకుతీసుకుపోతుంది’’

‘‘శతాబ్ద కాలం లో ఒక సారివచ్చిన విశ్వమారి కి వ్యతిరేకం గా మానవ జాతి చాటిన దృఢత్వాని కి సైతం ఈ ఎక్స్ పో ఒక ప్రమాణంగా ఉంది’’

‘‘భారతదేశంమీకు గరిష్ఠ వృద్ధి ని ఇవ్వజూపుతుంది; పరిమాణం లో వృద్ధి, మహత్వాకాంక్ష లో వృద్ధి,ఫలితాల లో వృద్ధి ఉంటుంది; భారతదేశానికి తరలిరండి, మరి మా అభి వృద్ధి గాథ లో ఓ భాగం కండి.’’

‘‘పాత పరిశ్రమ లు మరియు స్టార్ట్- అప్ స్ ల జోడీ ద్వారా మా ఆర్థిక వృద్ధి జోరు ను అందుకొంటోంది’’

‘‘గడచిన ఏడు సంవత్సరాల లో, ఆర్థిక వృద్ధి ని పెంచడం కోసం అనేక సంస్కరణల ను భారత ప్రభుత్వం తీసుకువచ్చింది; మేం ఈ ప్రవృత్తి నికొనసాగించేందుకు మరిన్ని ప్రయత్నాల ను చేస్తూనే ఉంటాం’’

Posted On: 01 OCT 2021 8:53PM by PIB Hyderabad

ఎక్స్ పో 2020 దుబయి లో ఏర్పాటైన ఇండియా పెవిలియన్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సందేశాన్ని పంపుతూ, ఎక్స్ పో ను చరిత్రాత్మకమైంది గా పేర్కొన్నారు. ‘‘ ఇది మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, ఇంకా దక్షిణ ఆసియా ప్రాంతం లో నిర్వహిస్తున్నటువంటి ఒకటో ఎక్స్ పో. యుఎఇ, దుబయి లతో ఇప్పటికే ఉన్న మన గాఢమైన, చరిత్రాత్మకమైన సంబంధాల ను ఈ ఎక్స్ పో మరింత బలోపేతం చేయడం లో చాలా సహాయకారి గా నిరూపించుకొంటుందన్న నమ్మకం నాలో ఉంది ’’ అని ప్రధాన మంత్రి అన్నారు. యుఎఇ ప్రెసిడెంటు మరియు అబూ ధాబీ పాలకుడైన మాన్య శ్రీ శేఖ్ ఖలీఫా బిన్ జాయద్ బిన్ అల్ నాహ్ యాన్ కు, యుఎఇ వైస్ ప్రెసిడెంటు మరియు దుబయి పాలకుడైన మాన్య శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ రాశిద్ అల్ మక్తూమ్ కు ప్రధాన మంత్రి తన అభినందనల ను వ్యక్తం చేశారు. ‘మనం వ్యూహాత్మక భాగస్వామ్యం లో సాధించిన ప్రగతి లో మహత్వపూర్ణ పాత్ర ను అబూ ధాబీ క్రౌన్ ప్రిన్స్ మాన్య శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ పోషించారు’ అంటూ ఆయన కు శుభాకాంక్షలు తెలియజేశారు. మన రెండు దేశాల ప్రగతి కోసం, సమృద్ధి కోసం మునుముందు కూడా పాటుపడేందుకు నేను ఎదురుచూస్తున్నాను అని కూడా ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

‘కనెక్టింగ్ మైండ్స్, క్రియేటింగ్ ద ఫ్యూచర్’ అనేది ఎక్స్ పో 2020 యొక్క ప్రధాన ఇతివృత్తం గా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. ఇంకా ఆయన, ‘‘ఈ ఇతివృత్తం తాలూకు భావన ను భారతదేశం తాలూకు ప్రయాసల లో కూడా గమనించవచ్చు, ఎందుకంటే మేం ఒక ‘న్యూ ఇండియా’ ను నిర్మించడం కోసం ముందడుగు వేస్తున్నాం. ఈ ఎక్స్ పో శతాబ్ద కాలం లో ఒక సారి తలెత్తేటటువంటి ఒక విశ్వమారి కి వ్యతిరేకం గా మానవ జాతి యొక్క దృఢత్వానికి కూడా ఒక ప్రమాణం గా ఉంది’’ అన్నారు.

‘బాహాటత్వం, అవకాశం మరియు వృద్ధి’ అనేది భారతదేశం పెవిలియన్ తాలూకు ముఖ్య విషయం గా ఉంది అని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోకెల్లా అత్యంత బాహాటత్వం కలిగివున్నటువంటి దేశాల లో ఒకటి గా ఉందని స్పష్టం చేశారు. మా దేశం నేర్చుకోవడానికి, దృష్టికోణానికి, నూతన ఆవిస్కరణల కు, పెట్టుబడి కి తలుపులను తెరచి ఉంచినటువంటి దేశం గా ఉందని ఆయన అన్నారు. ‘‘పరిమాణం లో గరిష్ఠ వృద్ధి తో పాటు మహత్వాకాంక్ష లో వృద్ధి ని, ఫలితాల లో వృద్ధి ని కూడా భారతదేశం ఇవ్వజూపుతున్నది. భారతదేశానికి రండి, మరి మా వృద్ధి గాథ లో ఒక భాగం కండి’’ అంటూ పెట్టుబడిదారుల కు ప్రధాన మంత్రి ఆహ్వానం పలికారు.

భారతదేశం చైతన్యాన్ని, భారతదేశం వివిధత్వాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ప్రతిభ కు భారతదేశం పెట్టని కోట గా ఉంటూ, సాంకేతిక విజ్ఞానం, పరిశోధన, నూతన ఆవిష్కరణల జగతి లో వేగం గా పురోగమిస్తోందన్నారు. ‘‘పాత పరిశ్రమలు, స్టార్ట్ -అప్ ల కలయిక తో మా ఆర్థిక వృద్ధి కి వేగం లభిస్తోంది. భిన్న రంగాల లో భారతదేశం అంతటా తయారైన సర్వశ్రేష్ఠమైన వస్తువుల ను భారతదేశం పెవిలియన్ కళ్లకు కడుతుంది అని ఆయన తెలిపారు. గడచిన ఏడు సంవత్సరాల లో ఆర్థిక వృద్ధి ని పెంపొందింపచేయడానికి భారత ప్రభుత్వం అనేక సంస్కరణల ను తీసుకు వచ్చిందని ఆయన అన్నారు. మేం ఈ ప్రవృత్తి ని కొనసాగించడం కోసం మరింత గా కృషి చేస్తూ ఉంటాం’’ అని ఆయన అన్నారు.

***

 

DS



(Release ID: 1760776) Visitor Counter : 152