ఆర్థిక మంత్రిత్వ శాఖ
పన్ను నిబంధనల (సవరణ), చట్టం, 2021చేసిన సవరణలను అమలు చేసేందుకు నిబంధనలను నోటిఫై చేసిన సిబిడిటి
Posted On:
02 OCT 2021 2:24PM by PIB Hyderabad
విత్త చట్టం 2012 ద్వారా ఆదాయపు పన్నుచట్టంలోని సెక్షన్ 9లో చేసిన సవరణ ఆధారంగా, భారతీయ ఆస్తులను విదేశాలకు పరోక్షంగా బదిలీ చేస్తే, ఆ లావాదేవీ 28మే, 2012కు (విత్త బిల్లు, 2012పై రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తేదీ) ముందు జరిగి ఉంటే , దానికి సంబంధించి ఎటువంటి పన్ను డిమాండ్‌ను భవిష్యత్తులో లేవనెత్తకుండా ఉండేందుకు పన్నుల నిబంధనల(సవరణ) చట్టం, 2021(2021 చట్టం) ఇంటర్ ఆలియా ఆదాయపు పన్ను చట్టం, 1961లో సవరణలు చేసింది.
అంతేకాకుండా, 28 మే, 2012కు ముందు విదేశాలకు భారతీయ ఆస్తుల పరోక్ష బదిలీ కి సంబంధించి లేవనెత్తిన డిమాండ్ (విత్త చట్టం 2012లోని సెక్షన్ 119 కింద డిమాండ్ ధృవీకరణ సహా)ను ఉపసంహరణ లేక పెండింగ్‌లో ఉన్న వివాదాన్ని ఉపసంహరించుకుంటామన్న హామీ ఇవ్వడం, పొందుపరిచిన ఇతర షరతులు సహా వ్యయం, నష్టపరిహారం, వడ్డీ తదితర క్లెయిములను దాఖలు చేయమని హామీ ఇచ్చినప్పుడు కేసును రద్దు చేసేందుకు 2021 చట్టం అవకాశం ఇస్తుంది. షరతులను నెరవేర్చిన తర్వాత కేసులకు సంబంధించి చెల్లించిన / సేకరించిన మొత్తాలను ఎటువంటి వడ్డీ లేకుండా వాపసు చేయడం జరుగుతుంది.
ఆదాపు పన్ను నిబంధనలు, 1962ను సవరించేందుకు రూపొందించిన ముసాయిదా నిబంధనలు పైన పేర్కొన్న నిర్దేశిత షరతులను సూచిస్తూ, పెండింగ్ లిటిగేషన్‌ను ఉపసంహరించుకునేందుకు ఏ విధంగా, ఏ రకంగా ఎటువంటి వ్యయం, నష్టపరిహారం, వడ్డీ తదితరాలను కోరమనే హామీని ఇవ్వాలనే రీతిపై అందరు భాగస్వాముల నుంచి 4 సెప్టెంబర్, 2021 నాఇ సూచనలను, వ్యాఖ్యాలను అందించవలసిందిగా 28 ఆగస్టు, 2021లో బహిరంగంగా కోరడం జరిగింది.
వాటాదారుల వ్యాఖ్యలను పరిశీలించి, పరీక్షించిన తర్వాత, అందులో వచ్చిన అనేక సూచనలను పొందుపరుస్తూ, 2021 చట్టం అమలుకు నిబంధనలను 1 అక్టోబర్, 2021న అధికారిక గెజె్‌ట్‌లో నోటిఫికేషన్ నెం. జిఎస్ ఆర్ 713(ఇ) ను జారీ చేయడం జరిగింది. తదనంతరం దిగువన పేర్కొన్న నిబంధనలను ఆదాయపు పన్నుల చట్టం నిబంధనలు, 1962లో పొందుపరచడం జరిగిందిః
రూల్ 11 యుఇ - 2021 చట్టం కింద పరిహారాన్ని పొందేందుకు అర్హతను పొందేందుకు నిర్దేశిత షరతులను సూచించే నిబంధన
రూల్ 11 యుఎఫ్ - ఎటువంటి వ్యయాన్ని, నష్టపరిహారాన్ని, తదితరాలను కోరకుండా పెండింగులో ఉన్న కేసులను ఉపసంహరించుకునేందుకు హామీ ఇచ్చే తీరును, రీతిని సూచించే నిబంధన.
పైన పేర్కొన్న నిబంధనలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను www.incometaxindia.gov.in లోకి లాగిన్ అవడం ద్వారా పొందవచ్చు.
***
(Release ID: 1760481)
Visitor Counter : 243