ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఇసిఎల్‌జిఎస్ పరిధి విస్తరణ, 31.03.2022 వరకు పథకం పొడిగింపు
Posted On:
29 SEP 2021 3:41PM by PIB Hyderabad
ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకం (ఇఎల్‌జిఎస్) ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు సుమారు 1.15 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఇలు) సాయాన్ని అందించింది. కోవిడ్ మహమ్మారి కారణంగా దెబ్బ తిన్న అర్హలైన రుణగ్రహీతలకు తిరిగి తమ వ్యాపారాన్ని పునః ప్రారంభించేందుకు ఈ పథకం ఎంతో తోడ్పాటును అందించింది.
ఈ పథకం కింద 24 సెప్టెంబర్ 2021 నాటికి కేటాయించిన రుణాలు రూ. 2.86లక్షల కోట్లను అధిగమించింది. జారీ చేసిన మొత్తం పూచీలలో 95% గ్యారంటీలను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలను కేటాయించేందుకు జారీ చేశారు.
అర్హులైన వ్యాపారులకు నిరంతర మద్దతును హామీ ఇచ్చేందుకు ఈ పథకాన్ని కొనసాగించవలసిందిగా వివిధ పారిశ్రామిక సంస్థలు, ఇతర భాగస్వాముల నుంచి ప్రభుత్వం డిమాండ్లను అందుకుంటోంది. కోవిడ్ మహమ్మారి రెండవ వేవ్ తో ప్రభావితమైన వివిధ వ్యాపారాలకు మద్దతునిచ్చేందుకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకాన్ని 31.03.2022 వరకు లేదా ఈ పథకం కింద రూ. 4.5 లక్షల కోట్ల మొత్తాన్ని రుణాలను అందించే వరకూ (ఏది ముందు అయితే అది) పొడిగించాలని నిర్ణయించారు. ఈ పథకం కింద రుణాలను పంపిణీ చేసేందుకు ఆఖరి తేదీని 30.06.2022 వరకు పొడిగించారు.
కోవిడ్ మహమ్మారి రెండవ వేవ్ కారణంగా ప్రభావితమైన వ్యాపారాలకు మద్దతునిచ్చేందుకు దిగువ పేర్కొన్న సవరణలను చేశారు.
ఇఎల్‌జిఎస్ 1.0 &2.0 ఇసిఎల్‌జిఎస్ కింద రుణాలు పొందిన రుణగ్రహీతలు 29.02.2020 లేదా 31.03.2021 నాటికి మొత్తం బాకీ ఉన్న రుణంలో 10% వరకు రుణాన్ని పొందేందుకు అర్హులు.
ఇసిఎల్‌జిఎస్ ( ఇసిఎల్జిఎస్ 1.0 &2.0) కింద ఇప్పటి వరకూ రుణాన్ని పొందని వ్యాపారాలు, 31.03.2021 నాటికి బాకీ ఉన్న రుణంలో 30% వరకు రుణసాయాన్ని పొందవచ్చు.
ఇసిఎల్‌జిఎస్ 3.-0 కింద నిర్దేశించిన రంగాలలో వ్యాపారాలు, ఇసిఎల్‌జిఎస్ కింద గతంలో రుణాన్ని పొంది ఉంటే, 31.03.2021 నాటికి బాకీ ఉన్న రుణ మొత్తంలో 40% వరకు రుణాన్ని అంటే గరిష్టంగా ఒక రుణగ్రహీత రూ. 200 కోట్ల వరకు పొందవచ్చు.
ఇసిఎల్‌జిఎస్ లో 29.02.2020 నుంచి 31.03.2021 కు కటాఫ్ డేట్ లో చేసిన మార్పుల కారణంగా అర్హత పెరిగిన రుణగ్రహీతలు ఉనికిలో ఉన్న ఇసిఎల్‌జిఎస్ పరిమితులకు లోబడి ఇంక్రిమెంటల్ రుణాన్ని పొందవచ్చు.
ఇందుకు అనుగుణంగా, ఇసిఎల్‌జిఎస్ కింద రుణర సాయాన్ని పొందిన రుణగ్రహీతలు ఇసిఎల్‌జిఎస్ కింద ఇచ్చిన సాయాన్ని మినహాయించి 31.03.2021 నాటికి బాకీ ఉన్న రుణాలు 29.02.2020 నాటికన్నా ఎక్కువ ఉంటే వారు ఇసిఎల్‌జిఎస్ 1.0, 2.0 లేదా 3.0 కింద నిర్దేశించిన పరిమితులకు లోబడి ఇంక్రిమెంటల్ సాయాన్ని పొందేందుకు అర్హులు.
కోవిడ్ రెండవ వేవ్ కారణంగా దారుణంగా ప్రభావితమైన వ్యాపారులకు మెరుగైన అనుషంగిక రహిత ద్రవ్యతను పొందేందుకు ఈ సవరణలు హామీ ఇస్తాయి. అంతేకాకుండా, అందరు ఇసిఎల్‌జిఎస్ రుణగ్రహీతలకు (ప్రధానంగా ఎంఎస్ఎంఇ సంస్థలు) పండుగల కాలంలో ఇది అవసరమైన సాయాన్ని అందిస్తుంది.
దీనికి సంబంధించి సవరించిన కార్యనిర్వహణ మార్గదర్శకాలను జాతీయ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌సిజిటిసి) జారీ చేస్తోంది.
***
(Release ID: 1759508)
Visitor Counter : 289