ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
నీమచ్-రత్లామ్ రైల్ వే లైను డబ్లింగు కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
ఈప్రాజెక్టు కు మొత్తం అంచనా వ్యయం 1,095.88 కోట్ల రూపాయలు గాను, వృద్ధి అయ్యే/సంపూర్ణవ్యయం 1,184.67 కోట్ల రూపాయలు ఉండవచ్చును
ఒకటోసంవత్సరం నుంచి సరకు రవాణా పరిమాణం ప్రతి ఒక్క ఏడాది లోనూ 5.67 మిలియన్టన్నులు అదనం గా ఉండవచ్చు; అది కాస్తా 11వ సంవత్సరం లో పెరిగిపోయి ప్రతి ఒక్కఏడాది లో 9.45 మిలియన్ టన్నుల కు చేరుకోవచ్చును
Posted On:
29 SEP 2021 3:57PM by PIB Hyderabad
నీమచ్-రత్ లామ్ రైల్ వే లైను డబ్లింగ్ పనుల కు మాననీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఆమోదాన్ని తెలియజేసింది. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 1,095.88 కోట్ల రూపాయలు గా ఉండవచ్చు. పనులు పూర్తి అయ్యే సరికి దీని వ్యయం పెరిగి 1,184.67 కోట్ల రూపాయల కు చేరుకొనేందుకు ఆస్కారం ఉంది. ఈ లైను డబ్లింగ్ తాలూకు మొత్తం పొడవు 132.92 కిలోమీటర్ లు. ఈ ప్రాజెక్టు నాలుగు సంవత్సరాల లో పూర్తి కావచ్చని భావిస్తున్నారు.
మెంటనన్స్ బ్లాకుల తో కలుపుకొంటే నీమచ్-రత్ లామ్ సెక్శన్ తాలూకు లైను సామర్ధ్య వినియోగం 145.6 శాతం వరకు ఉంది. ఈ ప్రాజెక్టు లైన్ సెక్శను లో మెంటనన్స్ బ్లాకు ఏర్పాటు చేయకపోయినప్పటికీ ఈ మార్గం గుండా అభిలషణీయమైన స్థాయి కి మించిన సరకు రవాణా రాక పోక లు జరిగాయి. సిమెంటు కంపెనీ లు వాటి స్వీయ అవసరాల కోసం ఏర్పాటు చేసుకొన్న పవర్ ప్లాంటు లకు అవసరపడ్డ బొగ్గు ను ఈ మార్గం ద్వారా ప్రధానం గా చేరవేయడం జరిగింది. నీమచ్-చిత్తౌడ్ గఢ్ ప్రాంతం లో సిమెంటు గ్రేడు సున్నపు రాయి తాలూకు భారీ నిక్షేపాలు అందుబాటు లోకి రావడం తో కొత్త గా సిమెంటు పరిశ్రమలను ఏర్పాటు అవుతున్న కారణం గా ఈ సెక్శన్ లో సరకు రాకపోకలు మరింత గా పెరుగనున్నాయి.
నీమచ్-రత్ లామ్ సెక్షన్ డబ్లింగు తో ఈ సెక్శన్ సామర్ధ్యం హెచ్చనుంది. ఈ విధం గా వ్యవస్థ లోకి మరిన్ని సరకు రవాణా రైళ్ళ ను, ప్రయాణికుల రైళ్ళ ను ప్రవేశపెట్టేందుకు వీలు ఏర్పడగలదు. సిమెంటు పరిశ్రమ లు సమీపం లోనే ఉన్న కారణం గా ఒకటో సంవత్సరం నుంచి ఒక్కో ఏడాది కి 5.67 మిలియన్ టన్నుల మేరకు అదనపు సరకు రవాణా నమోదు కావచ్చన్న అంచనా ఉంది. అది 11వ సంవత్సరం వచ్చేసరికల్లా ఒక్కో ఏడాది కి 9.45 మిలియన్ టన్నుల కు పెరిగేందుకు ఆస్కారం ఉంది. దీని తో సులభతర సంధానం అందుబాటు లోకి రావడం తో పాటు ఆ ప్రాంతం సామాజికం గా, ఆర్థికం గా అభివృద్ధి చెందేందుకు కూడా దోహదం లభించనుంది. ఈ ప్రాజెక్టు తో ఆ ప్రాంతం లో పర్యటన కు కూడా దన్ను లభిస్తుంది. ఎందుకంటే, ఊంచాగఢ్ కోట తో సహా అనేక చరిత్రాత్మక ప్రదేశాలు ఈ ప్రాజెక్టు రంగం లో నెలకొని ఉన్నాయి.
***
(Release ID: 1759367)
Visitor Counter : 243
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam