యు పి ఎస్ సి
నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ పరీక్ష (II)కు అవివాహిత మహిళా అభ్యర్ధులు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ఫార్మ్‌ను పొందేందుకు అవకాశం కల్పిస్తున్న యుపిఎస్సీ
Posted On:
24 SEP 2021 1:17PM by PIB Hyderabad
నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ ఎకాడమీ పరీక్ష (II)లలో మహిళా అభ్యర్ధులను కూడా అనుమతిస్తూ భారత సుప్రీం కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులకు కట్టుబడి కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవివాహిత మహిళలు మాత్రమే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు తన వెబ్‌సైట్ (upsconline.nic.in)పై ఆన్‌లైన్ పోర్టల్‌ను తెరవాలని నిర్ణయించింది. కుష్ కల్రా వెర్సస్ భారత ప్రభుత్వ, ఇతరులపై దాఖలు చేసిన కేసు నెం 1416/2020పై సుప్రీం కోర్టు 18/08/2021న ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి స్పందించిన యుపిఎస్సీ 09/06/2021న జారీ చేసిన 10/2021 -ఎన్‌డిఎ- IIకు సవరణలను జారీ చేసింది.
పైన పేర్కొన్న సవరణలను కమిషన్ వెబ్‌సైట్ (www.upsc.gov.in)లో అందుబాటులో ఉంది. మహిళలు దరఖాస్తు చేసుకునేందుకు 24.09.2021 నుంచి 08010.2021 (సాయంత్రం 6ః00 గంటలవరకు) సమయం ఉంది.
***
(Release ID: 1757681)
Visitor Counter : 192