వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పిఎంజికెఎవై నాలోగో ద‌శ‌లో 56.53 శాతం ఆహార‌ధాన్యాల‌ త‌ర‌లింపు

పిఎంజికెఎవై నాలుగోద‌శ‌లో గ‌రిష్ఠ స్థాయిలో దేశంలోనే అగ్ర‌స్థానంలో ఆహార ధాన్యాల‌ను త‌ర‌లించిన అండ‌మాన్ నికోబార్

2021 జూలై నుంచి సెప్టెంబ‌ర్ 15 వ‌ర‌కు త‌మ‌కు కేటాయించిన ఆహార ధాన్యాల‌లో 93 శాతం త‌ర‌లించిన అండ‌మాన్ నికోబార్‌

Posted On: 22 SEP 2021 4:28PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న యోజ‌న (పిఎంజికెఎవై ) నాలుగోద‌శ కింద కేంద్ర పాలిత ప్రాంత‌మైన అండ‌మాన్ నికోబార్ , త‌మ‌కు కేటాయించిన ఆహార ధాన్యాల‌లో గ‌రిష్ఠ శాతం ఆహార‌ధాన్యాల‌ను త‌ర‌లించింది.

2021 జూలై నుంచి 2021 సెప్టెంబ‌ర్ వ‌ర‌కు పిఎంజికెఎవై -4 వ ద‌శ కింద కేంద్ర పాలిత ప్రాంత‌మైన అండ‌మాన్ నికోబార్ దానికి కేటాయించిన ఆహార ధాన్యాల‌లో 93 శాతం ఆహార ధాన్యాల‌ను త‌ర‌లించ‌డం జ‌రిగింది. ఆ త‌ర్వాత దానికి ద‌గ్గ‌ర‌గా త‌మ‌కు కేటాయించిన ఆహార ధాన్యాల‌ను త‌ర‌లించిన రాష్ట్రాల‌లో ఒడిషా ఉంది. ఇది 92 శాతం ఆహార‌ధాన్యాల‌ను త‌ర‌లించ‌గా , త్రిపుర‌, మేఘాల‌య‌లు మూడవ స్థానంలో ఉండి 73 శాతం ఆహార ధాన్యాల‌ను తర‌లించాయి. తెలంగాణ‌, మిజోరం, అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్ లు పైన పేర్కొన్న కాలంలో 71 శాతం ఆహార ధాన్యాల‌ను త‌ర‌లించాయి.

ప్ర‌త్యేకించి నాలుగ‌వ ద‌శ పిఎంజికెఎవై సంద‌ర్భంగా దేశంలో 2021 జూలై నుంచి సెప్టెంబ‌ర్ 15 వ‌ర‌కు 56.53 శాతం ఆహార‌ధాన్యాల‌ను త‌ర‌లించ‌డం జ‌రిగింది. నాలుగోద‌శ న‌వంబ‌ర్ 2021తో ముగుస్తుంది.

ప్ర‌ముఖంగా చెప్పుకుంటే ఈ ప‌థ‌కం మూడ‌వ ద‌శ‌లో గ‌రిష్ఠంగా 98.41 శాతం ఆహార ధాన్యాలు త‌ర‌లించ‌డం జ‌రిగింది.
భార‌త ప్ర‌భ‌త్వం ఇప్ప‌టివ‌ర‌కు పిఎంజికెఎవై ప‌థ‌కం కింద ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 600 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ఆహార‌ధాన్యాల‌ను ప‌థ‌కం నాలుగు ద‌శ‌ల‌లో కేటాయించింది. అన్ని ద‌శ‌ల‌లో కేటాయించిన మొత్తం ఆహార ధాన్యాల‌లో 82.76 శాతం ఆహార ధాన్యాల‌ను 2021 సెప్టెంబ‌ర్ 15 వ‌ర‌కు త‌ర‌లించారు.


స్కీము ప్ర‌తి ద‌శ‌లో కేంద్రం ఆహార ధాన్యాల‌ను కేటాయిస్తుంది. కేంద్ర ప్ర‌భుత్వం కేటాయించిన ఆహార‌ధాన్యాల‌ను ,త‌దుప‌రి పంపిణీకి  స్వీక‌రించి త‌ర‌లించుకోవ‌డాన్ని లిఫ్టింగ్ అంటారు.

పిఎంజికెఎవై ప‌థ‌కం కింద ఆహార ధాన్యాల ల‌ఫ్టింగ్ కు సంబంధించిన వివ‌రాలు కిందివిధంగా ఉన్నాయి.

 

నెం


ప‌థ‌కం పేరు

కేటాయించిన ప‌రిమాణం
(ఎల్.ఎం.టి)

లిఫ్టింగ్‌
(ఎల్‌.ఎం.టిలో)

 

గోధుమ‌లు

బియ్యం

మొత్తం

గోధుమ‌లు

బియ్యం

మొత్తం


లిఫ్టింగ్ శాతం

1

PMGKAY-I (April-June 2020) - 97.72%

15.65

104.55

120.2

15.01

102.45

117.46

97.72%

2

PMGKAY-II (July-November 2020) - 93.59%

94.25

106.12

200.37

88.63

98.91

187.54

93.59%

3

PMGKAY-III (May-June 2021) - 98.41%

37.66

41.86

79.52

37.00

41.26

78.26

98.41%

4

PMGKAY-IV (July-November 2021)

(Up to 15.09.2021 - 56.53%)

97.09

101.69

198.78

49.53

62.86

112.39

56.53%

Total

244.65

354.22

598.87

190.17

305.49

495.66

82.76%

 

రాష్ట్రం, కేంద్ర‌పాలిత  ప్రాంతం వారిగా కేటాయింపులు, లిఫ్టింగ్ వివ‌రాలు అనుబంధం -1 లో

 


రాష్ట్రం, కేంద్ర‌పాలిత

 ప్రాంతం

PMGKAY-IV (JULY 2021- NOVEMBER 2021)

లిఫ్టింగ్  (UPTO 15.09.2021)

లిఫ్టింగ్ శాతం

మొత్తం

  1. అండ‌మాన్ నికోబార్‌

1409

93

  1. ఒడిషా

746516

92

  1. త్రిపుర‌

45477

73


  1. మేఘాల‌య‌

38911

73

  1. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌

14814

71

4 మిజోరం

11813

71

4 తెలంగాణ‌

338633

71

 

కోవిడ్ మ‌హ‌మ్మారి వ‌ల్ల ఏర్ప‌డిన పరిస్థితుల‌లో పేద‌లు, అవ‌స‌రం ఉన్న వారికి  కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న యోజ‌న (పిఎం-జికెఎవై) కింద సాధార‌ణంగా  నెల‌వారీగా పంపిణీ చేసే ఆహార ధాన్యాల‌కు రెట్టింపు స్థాయిలో దేశంలోని 80 కోట్ల మంది జాతీయ ఆహార భ‌ద్ర‌తా చ‌ట్టం ( ఎన్‌.ఎఫ్‌. ఎస్‌.ఎ) ప‌రిధి కిందికి వ‌చ్చిన వారికి ప్ర‌తి వ్య‌క్తికి ఒక్కొక్క‌రికి  వారికి సాధార‌ణంగా ఇచ్చేదానికి తోడు నెల‌కు అద‌నంగా 5 కేజీల ఆహార ధాన్యాల‌ను పూర్తి ఉచితంగా పంపిణీ చేయ‌డం జ‌రిగింది. ఇది వారి ఎన్‌.ఎఫ్‌.ఎస్‌.ఎ కింద అంత్యోద‌య అన్న యోజ‌న‌, ప్ర‌యారిటీ హౌస్ హోల్డ‌ర్ల రేష‌న్ కార్డుదారుల‌కు అర్హ‌త‌కు అద‌నంగా జారీ చేసిన ఆహార ధాన్యాలు (అంటే  ప్ర‌తి ఎఎవై కుటుంబానికి 35 కేజీలు, పిహెచ్ హెచ్ వ్య‌క్తికి  ప్ర‌తి నెల‌కు 5 కేజీలు)  మూడు నెల‌ల పాటు కేటాయించ‌డం జ‌రిగింది (అంటే 2020 ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు) అయితే, కోవిడ్ మ‌హ‌మ్మారి సృష్టించిన సంక్షోభం కొన‌సాగుతుండ‌డంతో  దీనిని మ‌రో ఐదు నెల‌లు (అంటే  2020 జూలై నుంచి న‌వంబ‌ర్ వ‌ర‌కు) కొన‌సాగించ‌డం జ‌రిగింది. కోవిడ్ మ‌హ‌మ్మారి రెండో ద‌శ రావ‌డంతో పిఎం-జికెఎవై ని మ‌రో రెండు నెల‌లు ( అంటే మే, జూన్ 2021) వ‌ర‌కు పొడిగించారు. దీనిని మ‌రో ఐదు నెల‌లు అంటే 2021 జూలై నుంచి న‌వంబ‌ర్ వ‌ర‌కు పొడిగించారు.

 

***

 (Release ID: 1757209) Visitor Counter : 77