ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈ సంజీవ‌ని, భార‌త ప్ర‌భుత్వ‌టెలిమెడిసిన్ కార్య‌క్ర‌మం ద్వారా 1.2 కోట్ల క‌న్స‌ల్టేష‌న్‌లుపూర్తి.


సుమారు 90 వేల మంది పేషెంట్లు మారు మూల ప్రాంతాల నుంచి ఆర‌గ్య సేవ‌లు పొందేందుకు ఈ సంజీవ‌నిని ఉప‌యోగిస్తున్నారు.

Posted On: 21 SEP 2021 10:46AM by PIB Hyderabad

భార‌త ప్ర‌భుత్వ  జాతీయ టెలిమెడిసిన్ స‌ర్వీసు అయిన ఈ -సంజీవ‌ని  1.2 కోట్ల సంప్ర‌దింపులు  (120 ల‌క్ష‌లు) పూర్తి అయ్యాయి. దీనితో దేశంలో టెలిమెడిసిన్ అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన అతిపెద్ద  వైద్య సేవ‌గా రూపుదిద్దుకుంది. ప్ర‌స్తుతం జాతీయ టెలిమెడిసిన్ స‌ర్వీసు రోజూ దేశ‌వ్యాప్తంగా 90 వేల మంది పేషంట్లకు వైద్య సేవ‌లు అందిస్తోంది. పెద్ద ఎత్తున పేషెంట్లకు డాక్ట‌ర్లు, దేశ‌వ్యాప్తంగా గ‌ల స్పెష‌లిస్టు వైద్యులు సేవ‌లు అందిస్తున్నారు.
ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ టెలిమెడిసిన్ స‌ర్వీసు అయిన ఈ సంజీవ‌వ‌వ‌వ‌ని రెండు ప‌ద్ధ‌తుల‌లో అంటే ఈ సంజీవ‌ని ఎబి- హెచ్‌డ‌బ్ల్యుసి ( డాక్ట‌ర్ టు డాక్ట‌ర్ టెలిమెడిసిన్ ప్లాట్‌ఫారం)పై ప‌నిచేస్తున్న‌ది. ఇది హ‌బ్ అండ్ స్పోక్ న‌మూనాలో, ఈ సంజీవ‌ని ఒపిడిలో  పేషెంట్ టు డాక్ట‌ర్ టెలిమెడిసిన్ ప్లాట్‌ఫారంలో ప‌నిచేస్తుంది.) ఇది పౌరుల‌కు ఔట్‌పేషెంట్ సేవ‌ల‌ను అందిస్తుంది. ఇది వారికి వారి ఇళ్ల‌వ‌ద్దే వైద్య సేవ‌లు అందిస్తుంది. ఈ సంజీవ‌ని ఎబి - హెచ్‌.డ‌బ్ల్యుసి ఇప్ప‌టికే 67,00,000 క‌న్సల్టేష‌న్‌లు పూర్తి చేసింది. ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కం కింద హెల్త్‌, వెల్‌నెస్ సెంట‌ర్‌ల వ‌ద్ద దీనిని అమ‌లు చేయ‌డం జ‌రుగుతుంది.

2019లో దీనిని ప్రారంభించారు. ఈ సంజీవ‌ని  ఎబి- హెచ్‌.డ‌బ్ల్యుసి స‌ర్వీసుల‌ను తొలిగా ప్రారంభించిన రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌. దీనిని ప్రారంభించిన‌ప్ప‌టినుంచి, 2000 హ‌బ్‌లు, 28,000 స్పోక్‌ల‌ను వివిధ రాష్ట్రాల‌లో ఏర్పాటు చేయ‌డం  జ‌రిగింది. 

ఈ సంజీవ‌ని ఒపిడి అనేది టెలిమెడిసిన్ విధానం. ఇది కోవిడ్ -99 కాని లేదా కోవిడ్ 19 సంబంధిత ఔట్ పేషెంట్ ఆరోగ్య సేవ‌ల‌ను టెలిమెడిసిన్ విధానంలో అందించే కార్య‌క్ర‌మం. దేశంలో తొలి లాక్‌డౌన్ కాల‌మైన 2020 ఏప్రిల్ 13 న , దేశంలో ఒపిడిలు మూసివేసిన సమ‌యంలో దీనిని ప్రారంభించారు..
ఈ సంజీవ‌ని ఒపిడి ద్వారా ఇప్పటివ‌ర‌కు 51 ల‌క్ష‌ల మంది పేషెంట్ల‌కు సేవ‌లు అందించారు. ఇది 430 ఆన్‌లైన్ ఒపిడి ల‌ద్వారా ఈ సేవ‌లు అందించింది. ఇందులో జ‌న‌ర‌ల్ ఒపిడి, స్పెషాలిటి ఒపిడి, ప్రీమియ‌ర్ టెరిట‌ర‌ల స్థాయి వైద్య సంస్థ‌లైన పంజాబ్‌లోని భ‌టిండాకు చెందిన ఎఐఐఎంఎస్‌, తెలంగాణాలోని బిబిన‌గ‌ర్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌లోని క‌ల్యాణ్‌, ఉత్త‌రాఖండ్‌లొని రుషీకేష్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌క్నోలోగ‌ల కింగ్ జార్జ్ మెడిక‌ల్ కాలేజి ఈ సంజీవ‌ని ఒపిడి  ద్వారా ఔట్ పేషెంట్  ఆరోగ్య సేవ‌లు అందిస్తున్నాయి.


భార‌త ప్ర‌భుత్వ ఈ సంజీవ‌ని- నేష‌న‌ల్ టెలిమెడిసిన్ స‌ర్వీస్ , ప‌ట్ట‌ణ , గ్రామీణ ప్రాంతాల మ‌ధ్య‌గ‌ల డిజిట‌ల్ వైద్య అంత‌రాన్ని త‌గ్గిస్తున్న‌ది. క్షేత్ర‌స్థాయిలో వైద్యులు, స్పెష‌లిస్టుల కొర‌త స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది సెకండ‌రీ, టెరిట‌రీ స్థాయి ఆస్ప‌త్రుల‌పై భారాన్నిన తొల‌గిస్తుంది. డిజిట‌ల్ ఆరోగ్య మిష‌న్‌కు అనుగుణంగా ఈ డిజిట‌ల్ చొర‌వ‌, దేశంలో డిజిట‌ల్ ఆరోగ్య వాతావ‌ర‌ణాన్ని మ‌రింత ముందుకు తీసుకువెళుతుంది. మొహాలిలోని సెంట‌ర్ ఫ‌ర్ డ‌వ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సి డాక్‌) అభివృద్ధి చేసిన దేశీయ సాంకేతిక ప‌రిజ్ఞానం. మొహాలిలోని సి-డాక్ బృందం ఇందుకు సంబంధించిన సాంకేతిక సేవ‌లు అందిస్తున్న‌ది. టెలిమెడిసిన్ ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ప్పుడు, అలాగే కోవిడ్ -19 మ‌హ‌మ్మారివంటి వాటిని ఎదుర్కొనేందుకు ప్ర‌ణాళికా రూప‌క‌ల్ప‌న‌లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ తీసుకువ‌చ్చిన ఈ చొర‌వను మ‌రింత ముందుకు తీసుకువెళ్లి, రోజుకు 5 ల‌క్ష‌ల క‌న్స‌ల్టేష‌న్ల స్థాయికి తీసుకువెళ్లేందుకు కృషి చేయ‌డం జ‌రుగుతుంది.


ఈ సంజీవ‌ని ని చేపట్టి(12033498)ముందు వ‌రుస‌లో నిలిచిన ప‌ది రాష్ట్రాల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ (37,04,258), క‌ర్ణాట‌క (22,57,994), త‌మిళ‌నాడు (15,62,156), ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (13,28,889), గుజ‌రాత్ (4,60,326), మ‌ధ్య‌ప్ర‌దేశ్ (4,28,544), బీహార్ (4,04,345), మ‌హారాష్ట్ర  (3,78,912), ప‌శ్చిమ‌బెంగాల్  (2,74,344), కేర‌ళ (2,60,654). ఉన్నాయి.

***


(Release ID: 1756695) Visitor Counter : 261