ఉక్కు మంత్రిత్వ శాఖ

జాతీయ మౌలిక‌స‌దుపాయాలపైప్‌లైన్‌, గ్రామీణ‌ప్రాంతాల‌లో దేశీయ స్టీలు వినియోగం పెంపున‌కు స‌మ‌ష్టి కృషి అవ‌స‌ర‌మ‌న్న కేంద్ర స్టీలు శాఖ మంంత్రి శ్రీ రామ్ చంద్ర ప్ర‌సాద్ సింగ్‌


భార‌తీయ స్టీలు అసోసియేష‌న్‌తో స‌మావేశం

హైడ్రోజ‌న్ వినియోగాన్ని పెంచాల్సిందిగా స్టీలు ప‌రిశ్ర‌మ‌ను కోరిన శ్రీ రామ్ చంద్ర ప్ర‌సాద్ సింగ్‌

Posted On: 20 SEP 2021 4:20PM by PIB Hyderabad

కేంద్ర స్టీలు శాఖ మంత్రి శ్రీ రామ్ చంద్ర ప్ర‌సాద్ సింగ్‌, భార‌తీయ స్టీలు అసోసియేష‌న్ ప్ర‌తినిధుల‌తో ఈరోజు స‌మావేశం నిర్వ‌హించారు. స‌మీకృత స్టీలు ఉత్ప‌త్తి దారులు (ఐఎస్‌పి)ల‌కు ఇది ప్రాతినిధ్యం వ‌హిస్తోంది. ఐఎస్ఎ లోని స‌భ్య ప్ర‌తినిధులు క‌లిసి మొత్తం దేశంలోని స్టీలు ఉత్ప‌త్తిలో 90 శాతం స్టీలును ఉత్ప‌త్తి చేస్తున్న‌ద‌న్నారు. ప‌రిశ్ర‌మ కెప్టెన్‌లు దిలీప్ ఊమెన్ ( ప్రెసిడెంట్‌, ఐఎస్ఎ, సిఇఒ, ఎ.ఎం, ఎన్ .ఎస్ ఇండియా)
. సొమా మండ‌ల్ (చైర్‌ప‌ర్స‌న్ ,సెయిల్‌), టివి న‌రేంద్ర‌న్ (సిఇఒ టాటా స్టీల్ లిమిటెడ్‌),స‌జ్జ‌న్ జిందాల్ (ఛైర్మ‌న్‌, జెఎస్‌డ‌బ్ల్యు లిమిటెడ్‌), న‌వీన్ జిందాల్ ( ఛైర్మ‌న్‌, జెఎస్ పి ఎల్‌)లు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.  ఈ స‌మావేశం సంద‌ర్భంగా స్టీలు కు డిమాండ్ సృష్టించేందుకు ప్ర‌భుత్వం నుంచి అంద‌వ‌ల‌సిన మ‌ద్ద‌తు,పి.ఎల్‌.ఐ ప‌థ‌కానికి సంబంధించి నిబంధ‌న‌లు నోటిఫై చేయ‌డం, నేష‌న‌ల్ మిన‌ర‌ల్ ఇండెక్స్‌ను నోటిఫై చేసేలా చూడ‌డం, త‌గిన ర‌వాణా సదుపాయాల క‌ల్ప‌న‌, స‌ర‌కు ర‌వాణాకు సంబంధించిన అంశాలు, సామ‌ర్ధ్యం జోడించేందుకు  స‌త్వ‌ర క్లియ‌రెన్సులు , త‌దిత‌ర అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి.

స్టీలు డిమాండ్‌ను పెంచేందుకు అన్ని ర‌కాల మ‌ద్ద‌తు ఇవ్వ‌నున్న‌ట్టు మంత్రి హామీ ఇచ్చారు. గృహ నిర్మాణం, దేశీయ గ్యాస్‌, నీటి స‌ర‌ఫ‌రా పైప్‌లైన్లు, వంటి వాటిలో స్టీలు వినియోగం వ‌ల్ల వ‌చ్చే ప్ర‌యోజ‌నాల‌పై ప‌రిశ్రమ వ‌ర్గాలు పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి సూచించారు. దీనివ‌ల్ల డిమాండ్ విస్తృతంగా ఉండ‌డ‌మే కాకుండా,ప్ర‌స్తుత యూనిట్ల డిమాండ్ పెరిగే  అవ‌కాశం ఉంది.

స్పెషాలిటీ స్టీలుకు 2021 జూలైలో నోటిఫై చేసిన  ఉత్పాద‌క‌త‌తో ముడిప‌డిన ప్రోత్సాహ‌క ప‌థ‌కానికి సంబంధించి ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌తో స‌మావేశం నిర్వ‌హించాల్సిందిగా   శ్రీ రామ్ చంద్ర ప్ర‌సాద్ సింగ్‌, మంత్రిత్వ‌శాఖ అధికారుల‌ను ఆదేశించారు.
పిఎల్ ఐ ప‌థ‌కానికి సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాలు జారీచేయ‌డానికి ముందుగా స్టీలు రంగంలోని వారితో త‌గిన సంప్ర‌దింపులు జ‌ర‌పాల్సిందిగా  మంత్రి ఆదేశించారు. షిప్పింగ్ రంగానికి సంబంధించిన లాజిస్టిక్ అంశాలు, అంత‌ర్గ‌త జ‌ల‌వ‌న‌రుల అంశాన్ని ప్ర‌ధాన దృష్టితో చూడాల్సిందిగా శ్రీ సింగ్ ఆదేశించారు. రాష్ట్ర ప్ర‌భుత్వాలు, కేంద్ర మంత్రిత్వ‌శాఖ‌ల‌తో సంప్ర‌దించాల్సిందిగా ఆయ‌న నొక్కి చెప్పారు.

స్టీలు రంగం ప్ర‌ధానంగా ముడి స‌రుకు ర‌వాణాకు , త‌యారైన ఉత్ప‌త్తులకు  రైల్వే  కీల‌కంగా  అధార‌ప‌డుతున్నందున ఇందుకు సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు రైల్వే మంత్రిత్వ‌శాఖ‌తో ఈవిష‌య‌మై  చ‌ర్చించాల్సిందిగా ఆయ‌న సూచించారు. ప‌ర్యావ‌ర‌ణం, స్టీలు రంగం వెలువ‌రించే ఉద్గారాల విష‌య‌మై స‌మ‌స్య‌ల‌ను గుర్తిస్తూ మంత్రి, ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు పెద్ద ఎత్తున హైడ్రోజ‌న్‌ను వాడాల్సిందిగా సూచించారు.

145 భార‌తీయ ప్ర‌మాణాల‌కు సంబంధించి మినిస్ట్రీ నోటిఫై చేసిన నాణ్యతా ప్ర‌మాణాల ఆర్డ‌ర్‌కు సంబంధించి మంత్రిత్వ‌శాఖ సానుకూల‌పాత్ర వ‌హించ‌డాన్ని మంత్రి అభినందించారు. ఫ‌లితంగా  రాగ‌ల సంవ‌త్స‌రాల‌లో దీనివ‌ల్ల అద‌న‌పు పెట్టుబ‌డి రాగ‌ల‌ద‌ని ఆయ‌న అన్నారు.భార‌తీయ స్టీలు రంగంలో ముడిస‌ర‌కు, ర‌వాణా ఖ‌ర్చులు ఇన్‌పుట్ ఖ‌ర్చులు ఎక్కువ అని , ఇది భార‌తీయ స్టీలు రంగం పోటీ త‌త్వాన్ని దెబ్బ‌తీస్తున్న‌ద‌ని ఆయ‌న అన్నారు. ఎం.ఎం.డి.ఆర్ స‌వ‌ర‌ణ చ‌ట్టం 2021లో ప్ర‌స్తావించిన‌ట్టు,  నేష‌న‌ల్ మిన‌ర‌ల్ ఇండెక్స్ (ఎన్‌.ఎం.ఐ)ను స‌త్వ‌రం  ప్ర‌వేశ పెట్టాల్సిందిగా  ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు కోరాయి. రాయ‌ల్టీపై రాయ‌ల్టీ అంశాన్ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు ప్ర‌స్తావించాయి.ఎన్‌.ఎం.ఐ అంశాన్ని ప‌రిశీలిస్తున్న క‌మిటీ ఈ అంశాల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌యత్నిస్తున్న‌ద‌ని ఐఎస్ఎ వ‌ర్గాల‌కు తెలియ‌జేయ‌డం జ‌రిగింది. దేశంలో స్టీలు డిమాండ్ ను పెంపొందించే అంశాన్ని పెంచాల్సిందిగా ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు డిమాండ్ చేశారు.మౌలిక స‌దుపాయాల రంగంతో స‌న్నిహితంగా ప‌నిచేస్తూ దీనిని పెంపొందించాల‌ని, ఈ విష‌యంలో స్టీలు మంత్రిత్వ‌శాఖ  త‌న మ‌ద్ద‌తును అందించాల్సిందిగా కోరారు.

స్టీలు ప‌ర్యావ‌ర‌ణం, అడ‌వుల క్లియ‌రెన్సుకు సంబంధించిన అంశాల‌ను కూడా స‌మావేశంలో చ‌ర్చించ‌డం జ‌రిగింది.దేశంలో స్టీలు ఉత్ప‌త్తి ప్ర‌క్రియ‌ను  పెంచేందుకు స‌త్వ‌రం చ‌ర్య‌లు తీసుకునేందుకు స‌హాయం చేయ‌డం జ‌రిగింది.

స్టీలు మంత్రిత్వ‌శాఖ ఆత్మ‌నిర్భ‌ర్‌భార‌త్ కు క‌ట్టుబ‌డి ప‌నిచేస్తుంద‌ని మంత్రి త‌మ ప్ర‌సంగంలో పున‌రుద్ఘాటించారు. పెద్ద సంస్థ‌లు త‌మ కార్య‌క‌లాపాల‌ను ఎం.ఎస్‌.ఎం.ఇల‌తో మ‌రింత పెంచుకోవాల‌ని, దీనివ‌ల్ల ప్ర‌తి కంపెనీ, అది పెద్ద లేదా చిన్న కంపెనీ ఒక దానితో ఒక‌టి క‌లిసి ముందుకు న‌డిచేందుకు వీలు క‌లుగుతుంద‌ని అన్నారు.ఇది దేశ అభివృద్ధి చరిత్ర‌లో భాగ‌స్వాములు కావ‌డానికి వీలు క‌లిగిస్తుంద‌ని అన్నారు. ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్ జ‌ర‌ప‌డానికి విధివిధాన‌ల‌తో ప‌రిశ్ర‌మ ముందుకు రావాల‌ని. ఇందులో ప‌రిశ్ర‌మ‌వ‌ర్గాలు చురుకుగా పాల్గొనాల‌ని మంత్రి పిలుపునిచ్చారు.

***

 



(Release ID: 1756561) Visitor Counter : 137