మంత్రిమండలి

ఒత్తిడికి గురైన రుణ రూప ఆస్తుల ను సేకరించడం కోసం నేశనల్ ఎసెట్ రీకనస్ట్రక్షన్ కంపెనీలిమిటెడ్ జారీ చేసిన సెక్యూరిటీ రిసీట్స్ కు దన్ను గా కేంద్ర ప్రభుత్వ పూచీకత్తుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


ఎఆర్ సిని 2021-22 కేంద్ర బడ్జెటు లో ప్రకటించడమైంది

సుమారు 2 లక్షలకోట్ల రూపాయల మేర ఒత్తిడి కి లోనైన ఆస్తుల ను ఆర్ బిఐ వర్తమాన నిబంధనల కు అనుగుణంగా దశల వారీ గా సేకరించాలని ఎన్ఎఆర్ సిఎల్ ప్రతిపాదిస్తున్నది

Posted On: 15 SEP 2021 4:13PM by PIB Hyderabad

ఒత్తిడి కి లోనైన రుణ రూప ఆస్తుల ను సేకరించడం కోసం నేశనల్ ఎసెట్ రీకన్ స్ట్రక్శన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఎఆర్ సిఎల్) జారీ చేసే సెక్యూరిటీ రిసీట్స్ (ఎస్ఆర్ స్) కు ఊతం గా ఉండటానికి గాను 30,600 కోట్ల రూపాయల విలువైన కేంద్ర ప్రభుత్వ పూచీకత్తు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను వెలువడ్డ బడ్జెటు ప్రకటన కు అనుగుణం గా ఉంది.

ఎన్ఎఆర్ సిఎల్ జారీ చేసే ఎస్ఆర్ స్ కు భారత ప్రభుత్వం సార్వభౌమ పూచీకత్తు తాలూకు ఊతం లభించనుంది. భారత ప్రభుత్వ పూచీకత్తు 30,600 కోట్ల రూపాయల మేరకు ఉంటుంది; ఈ పూచీకత్తు అయిదు సంవత్సరాల కాలం పాటు చెల్లుబాటు అవుతుంది. ఎస్ఆర్ తాలూకు ముఖ విలువ కు, పరిష్కారం కుదిరిన మేరకు/వ్యాపారం నిలచిపోవడం వల్ల వాస్తవం గా రాబట్టిన సొమ్ము కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని భరించడానికి గాను భారత ప్రభుత్వ పూచీకత్తు ను ఎన్ఎఆర్ సిఎల్ వినియోగించుకోవచ్చును. వార్షిక పూచీకత్తు రుసుము ను ఎన్ఎఆర్ సిఎల్ చెల్లించవలసి ఉంటుంది.

ప్రయోజనాలు:

ప్రస్తుతం వివిధ రుణదాత సంస్థ ల మధ్య విభాజితమైన రుణాన్ని ఏకీకరించడం లో ఎన్ఎఆర్ సిఎల్-ఐడిఎమ్ సిఎల్ వ్యవస్థ సాయపడనుంది. దీనితో ఐబిసి ప్రక్రియ ల ద్వారా- అవి వర్తించే సందర్భాల లో- వేగవంతమైనటువంటి, నిర్ణయాన్ని ఒకే చోటు లో తీసుకోవడానికి వీలు చిక్కుతుంది. ఇది వసూలు కాని రుణాల సమస్య ను పరిష్కరించడం లో శీఘ్ర చర్యల కు అండగా నిలబడటం తో పాటు మరింత మంచి విలువ ను రాబట్టుకోవడం లో కూడా దోహద పడనుంది. విలువ ను పెంచడం కోసం మార్కెట్ నైపుణ్యాన్ని ఇండియా డెట్ రెజల్యూశన్ కంపెనీ లిమిటెడ్ (ఐడిఆర్ సిఎల్) వినియోగించుకొంటుంది. ఈ విధానం వ్యాపారాన్ని పెంచడం పై, పరపతి వృద్ధి పై మరింత గా శ్రద్ధ తీసుకోవడానికి బ్యాంకుల లో సిబ్బంది కి స్వేచ్ఛ ను ప్రసాదించి మార్గాన్ని సుగమం చేయనుంది. వసూలు కాని రుణాల తో పాటు ఎస్ఆర్ లను కలిగి ఉన్న బ్యాంకులు దీని ద్వారా లాభాల ను అందుకోగలుగుతాయి. ఎస్ఆర్ లను విక్రయించడానికి, కొనుగోలు చేయడానికి వీలు ఉంటుంది కాబట్టి భారత ప్రభుత్వ పూచీకత్తు ఎస్ఆర్ ల చెలామణీ ని కూడా పెంచుతుంది.

పూర్వరంగం:

ప్రభుత్వం అనుసరిస్తున్న 4 ‘ఆర్’ ల వ్యూహం ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు లో ఒక చక్కని మార్పు కు దారితీసింది. ఆ నాలుగు ‘ఆర్’ లు ఏవేవంటే.. రెకగ్ నిశన్ (గుర్తింపు), రెజల్యూశన్ (పరిష్కరించడం), రీ కేపిటలైజేశన్ (అదనపు మూలధనాన్ని సమకూర్చడం) రిఫార్మ్ (సంస్కరణ).. అనేవే. వసూలు కాని రుణాల కోసం పెద్ద ఎత్తున కేటాయింపు ను జరపడం అనేది త్వరిత గతి న పరిష్కారాని కి గాను అదనపు చర్యల ను తీసుకొనేందుకు ఒక అవకాశాన్ని ప్రసాదించింది. దీనికి అనుగుణం గానే ఒక ఎసెట్ రీకన్ స్ట్రక్శన్ కంపెనీ (ఎఆర్ సి), అలాగే ఎసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ (ఎఎమ్ సి)ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలుస్తోందని 2021-22 కేంద్ర బడ్జెటు సమర్పణ వేళ ప్రకటించడం జరిగింది. ఇప్పటికే భారం గా మారిన రుణాల ను సుసంఘటితం చేయడానికి, వాటిని స్వాధీన పరచుకోవడానికి, ఆ తరువాత వాటి నుంచి విలువ ను రాబట్టుకోవడానికి, కొనుగోలుదారుల పరం చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది.

దీనికి తరువాయి గా బ్యాంకులు నేశనల్ ఎసెట్ రీకన్ స్ట్రక్శన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఎఆర్ సిఎల్) ను ఇండియా డెట్ రెజల్యూశన్ కంపెనీ లిమిటెడ్ (ఐడిఆర్ సిఎల్) ను ఏర్పాటు చేశాయి. ఒత్తిడి కి లోనైన సుమారు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తుల ను ఆర్ బిఐ వర్తమాన నిబంధనల మేరకు దశల వారీ గా సేకరించాలన్నది ఎన్ఎఆర్ సిఎల్ ప్రతిపాదన గా ఉంది. వీటిని 15 శాతం నగదు చెల్లింపు, 85 శాతం మేరకు సెక్యూరిటీ రిసీట్స్ (ఎస్ఆర్ స్) జారీ ద్వారా సంపాదించాలి అన్నది దీని ఉద్దేశ్యం గా ఉంది.

 

 

***



(Release ID: 1755711) Visitor Counter : 187