ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కస్తూర్ బా గాంధీ మార్గ్ లోను, ఆఫ్రికా ఎవిన్యూ లోను డిఫెన్స్ ఆఫీసెస్ కాంప్లెక్సె స్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

ఒక ‘న్యూ ఇండియా’ అవసరాల కు, ఆకాంక్షల కు తగినట్లు గా దేశ రాజధాని నగరాన్ని అభివృద్ధి పరచడం లో స్వాతంత్య్ర 75వ సంవత్సరం లో భారతదేశం మరొక అడుగును వేసింది: ప్రధాన మంత్రి

రాజధాని నగరం లో ఒక ఆధునికమైన డిఫెన్స్ ఎన్ క్లేవ్ ను నిర్మించే దిశ లో ఇది ఒక పెద్ద అడుగు: ప్రధాన మంత్రి

ఏ దేశ రాజధాని అయినా ఆ దేశం ఆలోచన దృక్పథాని కి, దృఢ సంకల్పాని కి, బలాని కి, సంస్కృతి కి ఒక చిహ్నం గా ఉంటుంది: ప్రధాన మంత్రి

భారతదేశం ప్రజాస్వామ్యాని కి జనని గా ఉంది; భారతదేశం యొక్క రాజధాని ఎలా ఉండాలి అంటే దాని కేంద్ర స్థానం లో ప్రజలు, పౌరులు ఉండాలి: ప్రధాన మంత్రి

‘జీవించడం లో సౌలభ్యం’ పై, ‘వ్యాపారం చేయడం లో సౌలభ్యం’ పై ప్రభుత్వం తీసుకొంటున్న శ్రద్ధ లో ఆధునిక మౌలిక సదుపాయాల కు ఒక ప్రధాన పాత్ర ఉంది: ప్రధాన మంత్రి

విధానాలు, ఉద్దేశ్యాలు స్పష్టం గా ఉన్నప్పుడు, సంకల్ప శక్తి దృఢం గా ఉన్నప్పుడు, ప్రయత్నాల లో నిజాయతీ ఉన్నప్పుడు ప్రతిదీ సాధ్యమే: ప్రధాన మంత్రి

ఈ ప్రాజెక్టు లు అనుకొన్న కాలం కంటే ముందుగానే పూర్తి కావడమనేది మారిన దృష్టికోణాన్ని, మారిన ఆలోచన విధానాన్ని స్పష్టపరచేది గా ఉంది: ప్రధాన మంత్రి

Posted On: 16 SEP 2021 12:56PM by PIB Hyderabad

న్యూ ఢిల్లీ లోని కస్తూర్ బా గాంధీ మార్గ్, ఆఫ్రికా ఎవిన్యూ లలో నిర్మాణం జరిగిన డిఫెన్స్ ఆఫీసెస్ కాంప్లెక్స్ లను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆఫ్రికా ఎవిన్యూ లో రక్షణ శాఖ కార్యాలయ భవన సముదాయాన్ని ఆయన సందర్శించి, సైన్యం, నౌకాదళం, వాయు సేన ల అధికారుల తో, సివిలియన్ ఆఫీసర్స్ తో సంభాషించారు కూడా.

సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ రోజు న భవన సముదాయాల ను ప్రారంభించుకోవడం ద్వారా భారతదేశం తన దేశ రాజధాని నగరాన్ని ఒక న్యూ ఇండియాయొక్క అవసరాల కు, ఆకాంక్షల కు తగినట్లుగా అభివృద్ధి పరచుకోవడం లో భారత స్వాతంత్య్రపు 75వ సంవత్సరం లో మరొక అడుగు ను వేసిందని పేర్కొన్నారు. చాలా కాలం పాటు రక్షణ కు సంబంధించిన పనుల ను రెండో ప్రపంచ యుద్ధం కాలం లో నిర్మించిన తాత్కాలిక నివాసాల నుంచే నిర్వహిస్తూ వచ్చిన వాస్తవం పట్ల విచారాన్ని వ్యక్తం చేశారు. గుర్రపుసాల లను, సేనాశిబిరాల ను దృష్టి లో పెట్టుకొని నిర్మించిన తాత్కాలిక నివాసాలు అవి అని కూడా ఆయన అన్నారు. ‘‘ఈ కొత్త రక్షణ శాఖ కార్యాలయ భవన సముదాయాలు మన రక్షణ బలగాల పనితీరు ను మరింత సౌకర్యవంతమైందిగాను, ప్రభావవంతమైంది గాను తీర్చిదిద్దే ప్రయాసల ను పటిష్టపరుస్తాయి’’ అని ఆయన చెప్పారు.

కె.జి మార్గ్ లో, ఆఫ్రికా ఎవిన్యూ లో నిర్మాణం జరిగిన ఆధునిక కార్యాలయాలు దేశ ప్రజల భద్రత కు సంబంధించిన అన్ని పనుల ను ప్రభావశీలమైన రీతి లో పూర్తి చేయడం లో ఎంతగానో తోడ్పడుతాయని ప్రధాన మంత్రి అన్నారు. ఇది దేశ రాజధాని లో ఒక ఆధునికమైన డిఫెన్స్ ఎన్ క్లేవ్ ను నిర్మించే దిశ లో ఒక ప్రధానమైన చర్య అని ఆయన చెప్పారు. ఈ భవన సముదాయాల ను భారతదేశ కళాకారుల ఆకర్షణీయమైన కళా కృతుల హంగుల తో ను దిద్ది తీర్చడం ఎంతో బాగుంది అని ఆయన అన్నారు. ‘‘ఈ భవన సముదాయాలు దిల్లీ మరియు పర్యావరణ సంబంధిత ఔన్నత్యాన్ని పరిరక్షిస్తూనే మన సంస్కృతి తాలూకు వైవిధ్యాన్ని ఒక ఆధునిక రూపం లో సాక్షాత్కరింప చేస్తున్నాయి’’ అని ఆయన అన్నారు.

మనం రాజధాని ని గురించి మాట్లాడుకున్నప్పుడు అది కేవలం ఒక నగరమే కాదు అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఏ దేశ రాజధాని నగరం అయినా, ఆ దేశం ఆలోచన విధానాని కి, ఆ దేశం దృఢ నిశ్చయాని కి, ఆ దేశం బలాని కి, ఇంకా ఆ దేశం సంస్కృతి కి ఒక చిహ్నం గా ఉంటుంది. భారతదేశం ప్రజాస్వామ్యాని కి జనని గా ఉంది. అందువల్ల భారతదేశం యొక్క రాజధాని ఎలా ఉండాలి అంటే అందులో పౌరుల కు, ప్రజల కు కేంద్ర స్థానం దక్కాలి అని ప్రధాన మంత్రి అన్నారు.

ఈజ్ ఆఫ్ లివింగ్’, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లపై ప్రభుత్వం తీసుకొంటున్న శ్రద్ధ లో ఆధునిక మౌలిక సదుపాయాల తాలూకు భూమిక ను గురించి ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ‘‘సెంట్రల్ విస్టా లో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులు ఇదే ఆలోచన తో సాగుతున్నాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. నూతన నిర్మాణాల తాలూకు ప్రయత్నాలు రాజధాని ఆకాంక్షల కు అనుగుణం గా ఉన్నాయని ప్రధాన మంత్రి చెప్తూ, ప్రజా ప్రతినిధుల నివాసాలు, బాబా సాహెబ్ ఆమ్బేడ్ కర్ స్మృతుల ను పరిరక్షించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, మన అమరవీరుల కోసం ఉద్దేశించిన అనేక భవనాలు, స్మారకాలు ప్రస్తుతం దేశ రాజధాని కీర్తి ని ఇనుమడింప చేస్తున్నాయని ఆయన వివరించారు.

డిఫెన్స్ ఆఫీస్ కాంప్లెక్స్ పనుల ను 24 నెలల లో పూర్తి చేయవలసి ఉండగా, 12 మాసాల లోనే వాటిని పూర్తి చేయడం ఒక రికార్డు అని ప్రధాన మంత్రి అన్నారు. మళ్ళీ అందులోను శ్రామికుల కు సంబంధించిన సవాళ్ల తో సహా అనేక ఇతర సవాళ్ళు కరోనా సృష్టించిన స్థితిగతుల వల్ల తలెత్తాయి అని ఆయన గుర్తు చేశారు. కరోనా కాలం లో వందల కొద్దీ శ్రామికుల కు ఈ ప్రాజెక్టు లో పని దొరికింది. దీని తాలూకు ఖ్యాతి ప్రభుత్వం పని చేసే తీరు లో, ప్రభుత్వం ఆలోచన విధానం లో వచ్చిన మార్పు దే అని ఆయన అన్నారు. ‘‘విధానాలు, ఉద్దేశ్యాలు స్పష్టం గా ఉన్నప్పుడు, సంకల్ప శక్తి బలం గా ఉన్నప్పుడు, కృషి లో నిజాయతీ ఉన్నప్పుడు ప్రతిదీ సాధ్యపడుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

ఈ డిఫెన్స్ ఆఫీస్ కాంప్లెక్స్ లు మారుతున్న పని సంస్కృతి ని, ప్రభుత్వం యొక్క ప్రాథమ్యాల లో మార్పు ను చాటి చెప్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రభుత్వం లో వివిధ విభాగాల పరం గా అందుబాటులో ఉన్న భూమి ని సరైన రీతి లో గరిష్ఠ స్థాయి లో వినియోగించుకోవడం అనేది ఆ తరహా ప్రాథమ్యాల లో ఒకటి గా ఉంది అని ఆయన అన్నారు. ఈ డిఫెన్స్ ఆఫీస్ కాంప్లెక్స్ లను ఇదే విధమైన భవన సముదాయాల కు మునుపటి కాలాల్లో వలె అయిదు రెట్ల అధిక భూమి ని వినియోగించడం కాకుండా 13 ఎకరాల జాగా లో మాత్రమే నిర్మించడం జరిగిందని ప్రధాన మంత్రి వివరించారు. రాబోయే 25 సంవత్సరాల లో అంటే, ‘ఆజాదీ కా అమృత్ కాల్లో, ప్రభుత్వ వ్యవస్థ తాలూకు సామర్ధ్యాన్ని ఈ విధమైన ప్రయాసల తో పరిపుష్టం చేయడం జరుగుతుంది అని కూడా ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. ఒక ఉమ్మడి కేంద్ర సచివాలయం అందుబాటు లోకి రావడం, సమావేశ మందిరం దానికి జత పడటం, మెట్రో వంటి సులభమైన సంధాన సదుపాయం రాజధాని నగరాన్ని ప్రజల కు అనుకూలమైంది గా మలచడం లో ఎంతగానో దోహదపడతాయని చెప్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.(Release ID: 1755468) Visitor Counter : 94