ప్రధాన మంత్రి కార్యాలయం
తాజికిస్తాన్లోని దుశాంబె లో జరుగనున్న ఎస్ సిఒ కౌన్సిల్ దేశాధినేత ల మండలి 21వసమావేశం
Posted On:
15 SEP 2021 1:00PM by PIB Hyderabad
ఎస్ సిఒ కౌన్సిల్ దేశాధినేత ల మండలి 21వ సమావేశం ఈ నెల 17న దుశాంబె లో హైబ్రిడ్ ఫార్మేట్ లో జరుగనుంది. ఈ సమావేశాని కి తాజికిస్తాన్ అధ్యక్షుడు మాన్య శ్రీ ఇమోమలీ రహమోన్ అధ్యక్షత వహిస్తారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశం ప్రతినిధి వర్గాని కి నాయకత్వం వహించి, ఈ శిఖర సమ్మేళనం తాలూకు సర్వ సభ్య సమావేశాన్ని ఉద్దేశించి ఒక వీడియో లింక్ ద్వారా ప్రసంగించనున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జయ్ శంకర్ దుశాంబె లో భారతదేశాని కి ప్రాతినిధ్యం వహిస్తారు.
ఎస్ సిఒ సభ్యత్వ దేశాల నేత లు, పరిశీలక దేశాలు, ఎస్ సిఒ సెక్రటరి జనరల్, ఎస్ సిఒ రీజినల్ యాంటి-టెరరిస్ట్ స్ట్రక్చర్ (ఆర్ఎటిఎస్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తుర్క్ మెనిస్తాన్ అధ్యక్షుడు లతో పాటు సమావేశాని కి హాజరు కావలసింది గా ఆహ్వానాల ను అందుకొన్న ఇతర అతిథులు ఎస్ సిఒ సమిట్ కు హాజరు కానున్నారు.
ఇది ఒక హైబ్రిడ్ ఫార్మేట్ లో జరుగుతున్న ఎస్ సిఒ ఒకటో శిఖర సమ్మేళనం. అలాగే ఇది భారతదేశం ఎస్ సిఒ లో ఒక పూర్తి స్థాయి సభ్యత్వ దేశం గా పాలుపంచుకోనున్న నాలుగో శిఖర సమ్మేళనం కూడా. సంస్థ తన 20వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న సందర్భం కూడా ఈ సంవత్సరమే కావడం వల్ల ఈ శిఖర సమ్మేళనం ఇంకాస్త ప్రాముఖ్యాన్ని సంతరించుకొంది. గడచిన రెండు దశాబ్దాలకు పైగా సంస్థ కార్యకలాపాల ను గురించి నేత లు ఈ శిఖర సమ్మేళనం లో సమీక్షించనున్నారు. వారు భవిష్యత్తు లో సహకారానికి ఉన్న అవకాశాల ను గురించి సైతం చర్చించే అవకాశం ఉన్నది. ప్రాంతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలు, అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగినటువంటి సమయోచిత అంశాలు కూడా చర్చ కు వచ్చే వీలు ఉంది.
***
(Release ID: 1755464)
Visitor Counter : 123
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam