ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

సెప్టెంబర్16న  కస్తూర్ బా  గాంధీ మార్గ్ , ఆఫ్రికాఎవిన్యూ లలో డిఫెన్స్  ఆఫీసెస్ కాంప్లెక్సె స్ నుప్రారంభించనున్న ప్రధాన మంత్రి 

Posted On: 15 SEP 2021 2:36PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 సెప్టెంబర్ 16న ఉదయం 11 గంటల కు కస్తూర్ బా గాంధీ మార్గ్, ఆఫ్రికా ఎవిన్యూ లలో డిఫెన్స్ ఆఫీసెస్ కాంప్లెక్సె స్ లను ప్రారంభించనున్నారు. ఆయన ఆఫ్రికా ఎవిన్యూ లోని డిఫెన్స్ ఆఫీసెస్ కాంప్లెక్స్ ను సందర్శించి సైన్యం, నౌకాదళం, వైమానిక దళం అధికారులతోను, సివిలియన్ ఆఫీసర్స్ తోను మాట్లాడుతారు. తరువాత సభికుల ను ఉద్దేశించి ఆయన ప్రసంగ కార్యక్రమం ఉంటుంది.

కొత్త రక్షణ కార్యాలయం భవన సముదాయాల ను గురించి

కొత్త గా నిర్మించిన రక్షణ శాఖ కార్యాలయాల భవన సముదాయాల లో రక్షణ మంత్రిత్వ శాఖ కు చెందిన అధికారులకు, త్రివిధ సాయుధ దళాల కు చెందిన దాదాపు 7,000 మంది అధికారుల కు వసతి ని కల్పించనున్నారు. ఈ భవనాల లో ఆధునికమైన, భద్రమైన పని ప్రదేశాలు భాగం గా ఉన్నాయి. భవనం లో కార్యకలాపాల నిర్వహణ కు ఏకీకృత కమాండ్, కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అది రెండు భవనాల కు సమగ్రమైనటువంటి సురక్ష ను, నిఘా ను కూడా సమకూర్చనుంది.

 

కొత్త  రక్షణ కార్యాలయ భవన సముదాయాలు సంపూర్ణమైన భద్రత నిర్వహణ ఏర్పాటుల తో కూడి ఉన్నాయి. ఈ భవన సముదాయాలు అత్యంత ఆధునికమైనవి, శక్తి ని ఆదా చేసేటటువంటివీనూ. లైట్ గేజ్ స్టీల్ ఫ్రేమ్ (ఎల్ జిఎస్ఎఫ్) గా వ్యవహరించే నూతనమైన, మన్నిక కలిగిన నిర్మాణ సంబంధి సాంకేతికత ను వినియోగించడమనేది ఈ భవనాల విశిష్ట అంశాల లో ఒకటి గా ఉంది. దీనితో సాంప్రదాయక ఆర్ సిసి నిర్మాణ పద్ధతి తో పోలిస్తే నిర్మాణ కాలం 24 నుంచి 30 నెలల మేరకు తగ్గిపోయింది. ఈ భవనాల నిర్మాణం లో రిసోర్స్ ఎఫిశియంట్ గ్రీన్ టెక్నాలజీ ని ఉపయోగించడమైంది తో పాటు పర్యావరణానికి అనుకూలమైనటువంటి అభ్యాసాల ను కూడా చేపట్టడం జరిగింది.

ప్రారంభ కార్యక్రమం లో రక్షణ శాఖ మంత్రి, గృహ నిర్మాణం- పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి, రక్షణ శాఖ సహాయ మంత్రి, గృహ నిర్మాణం- పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) మరియు సాయుధ దళాల ప్రముఖులు పాలుపంచుకోనున్నారు.

 

 

***



(Release ID: 1755135) Visitor Counter : 205