ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అలీగఢ్  లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి కి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి


ఉత్తర్ ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగం అయిన అలీగఢ్ నోడ్ నమూనా ప్రదర్శనను కూడా ప్రధాన మంత్రి సందర్శించారు

జాతీయకథానాయకుల, జాతీయ కథానాయికల త్యాగాల ను గురించి తదుపరి తరాలవారికి తెలియ జేయడం జరుగలేదు; 20వ శతాబ్ది లో జరిగిన ఈ పొరపాటుల ను 21వ శతాబ్దినాటి భారతదేశం సరిదిద్దుతోంది:  ప్రధాన మంత్రి

రాజామహేంద్ర ప్రతాప్ సింహ్ గారి జీవితం మనకు అజేయ సంకల్పాన్ని గురించి, మన కలల ను పండించుకోవడంకోసం ఎంత వరకైనా వెళ్ళడానికి సుముఖత ను గురించి బోధిస్తుంది:  ప్రధాన మంత్రి

ప్రపంచంలో ఒక ప్రధానమైన రక్షణ రంగ ఉత్పత్తుల దిగుమతిదారు అనే ఇమేజ్ ను భారతదేశం విడనాడుతున్నది, అంతేకాకప్రపంచంలో ఒక ముఖ్యమైన రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతిదారు దేశం అనే ఒక గుర్తింపు ను కూడా తెచ్చుకొంటున్నది:  ప్రధాన మంత్రి

దేశం లో, ప్రపంచం లో ప్రతి చిన్న ఇన్వెస్టర్,ప్రతి పెద్ద ఇన్వెస్టర్ లకు ఉత్తర్ ప్రదేశ్ ఒక చాలాఆకర్షణీయ ప్రాంతం గా ఎదుగుతున్నది:  ప్రధాన మంత్రి

ఉత్తర్ప్రదేశ్ ప్రస్తుతం రెండు ఇంజిన్ ల ప్రభుత్వం అందించేటటువంటి రెండు ప్రయోజనాలతాలూకు ఒక ఘనమైన ఉదాహరణ గా మారుతున్నది:  ప్రధాన మంత్రి&#

Posted On: 14 SEP 2021 2:19PM by PIB Hyderabad

అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి తాలూకు నిర్మాణ పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి, ఉత్తర్ ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ తాలూకు అలీగఢ్ నోడ్ నమూనా ల ప్రదర్శన ను కూడా ప్రధాన మంత్రి సందర్శించారు.

 

ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, కీర్తిశేషులు కళ్యాణ్ సింహ్ గారి ని స్మరించుకొన్నారు. రక్షణ రంగం లో అలీగఢ్ ఎదుగుదల ను, అలాగే అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి స్థాపన ను చూస్తే కళ్యాణ్ సింహ్ గారు చాలా సంతోషించే వారు అని ప్రధాన మంత్రి అన్నారు.

 

అటువంటి ఎందరో మహానుభావులు స్వాతంత్య్ర ఉద్యమం కోసం వారి దగ్గర ఉన్నదంతా అర్పించివేశారు అనే వాస్తవాన్ని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. అయితే స్వాతంత్య్రం అనంతర కాలం లో దేశం చేసుకొన్న దురదృష్టం ఏమిటి అంటే అది ఆ కోవ కు చెందిన జాతీయ కథానాయకుల, జాతీయ కథానాయికల త్యాగాల ను గురించి దేశం లో తదుపరి తరాల వారికి తెలియ జెప్పకపోవడమే అని ప్రధాన మంత్రి అన్నారు. వారి గాథల ను తెలుసుకొనే భాగ్యాని కి దేశం లోని అనేక తరాల వారు నోచుకోలేకపోవడం పట్ల ప్రధాన మంత్రి విచారాన్ని వ్యక్తం చేశారు. మరి ఈ రోజు న 21వ శతాబ్ది కి చెందిన భారతదేశం 20వ శతాబ్దం లో జరిగిన ఈ పొరపాటుల ను సరిదిద్దుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ గారికి ప్రధాన మంత్రి ఘన నివాళి ని అర్పిస్తూ, రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ గారి జీవితం మనకు అజేయమైన సంకల్పాన్ని గురించి, అలాగే మన కలల ను నెరవేర్చుకోవడం లో ఎంతవరకు అయినా సరే వెళ్ళడానికి సంసిద్ధత ను గురించి బోధిస్తుంది అని వివరించారు. రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ గారు భారతదేశాని కి స్వాతంత్య్రం లభించాలి అని కోరుకున్నారు, మరి అందుకోసం ఆయన జీవితం లోని ప్రతి ఒక్క క్షణాన్ని సమర్పణం చేశారు అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం భారతదేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్వేళ లో విద్య మరియు నైపుణ్యాల అభివృద్ధి మార్గం లో సాగిపోతుండగా భరత మాత గర్వపడే పుత్రుల లో ఒకరు అయినటువంటి ఈ రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ పేరిట ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం అనేది ఆయన కు ఆచరిస్తున్న సిసలైనటువంటి ‘కార్యాంజలి’ అని ప్రధాన మంత్రి అభివర్ణించారు. ఈ విశ్వవిద్యాలయం ఉన్నత విద్య తాలూకు ఒక ప్రధాన కేంద్రం గా మాత్రమే కాక ఆధునిక రక్షణ అధ్యయనాలు, రక్షణ సంబంధిత తయారీ సాంకేతికత మరియు శ్రమ శక్తి ప్రగతి ల కు సైతం కేంద్రం గా పేరు తెచ్చుకొంటుంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. కొత్త జాతీయ విద్య విధానం లో చేర్చిన నైపుణ్యాల కు, స్థానిక భాష లో విద్య బోధన కు పీట వేయడం అనే అంశాలు ఈ విశ్వవిద్యాలయానికి ఎంతగానో లబ్ధి ని చేకూర్చగలుగుతాయి అని ప్రధాన మంత్రి అన్నారు.

 

భారతదేశం ఆధునిక (చేతి తో విసిరే) బాంబులు మొదలుకొని తుపాకులు, యుద్ధ విమానాలు, డ్రోన్ లు, యుద్ధ నౌకల వరకు రక్షణ రంగ సామగ్రి ని ప్రస్తుతం తయారు చేయడాన్ని ఒక్క మన దేశం మాత్రమే కాకుండా యావత్తు ప్రపంచం కూడా గమనిస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం ప్రపంచం లో ఒక పెద్ద రక్షణ రంగ దిగుమతిదారు దేశం అనే ఇమేజ్ నుంచి పక్కకు జరుగుతూ, ప్రపంచం లో ఒక ముఖ్యమైన రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతిదారు దేశం అనే కొత్త గుర్తింపు ను సంపాదించుకొనే దిశ లో పయనిస్తోంది అని కూడా ఆయన అన్నారు. ఈ పరివర్తన కు ఒక పెద్ద కేంద్రం గా ఉత్తర్ ప్రదేశ్ తయారవుతోంది అని ప్రధాన మంత్రి చెప్తూ, ఈ విషయం లో ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఎంపి గా తాను గర్వపడుతున్నట్లు పేర్కొన్నారు. ఒకటిన్నర డజను రక్షణ తయారీ సంస్థ లు వందల కోట్ల రూపాయల పెట్టుబడి తో వేల కొద్దీ ఉద్యోగాల ను కల్పించ గలుగుతాయి అని ఆయన తెలిపారు. చిన్న ఆయుధాలు, యుద్ధ సామగ్రి, డ్రోన్ లు, ఏరోస్పేస్ సంబంధి ఉత్పత్తుల తయారీ కి దన్ను గా నిలబడేటందుకు డిఫెన్స్ కారిడార్ లో భాగం గా ఉన్నటువంటి అలీగఢ్ నోడ్ లో నూతన పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి అని ఆయన చెప్పారు. ఇది అలీగఢ్ కు, అలీగఢ్ చుట్టుపక్కల ప్రాంతాల కు ఒక కొత్త గుర్తింపు ను తెచ్చిపెడుతుంది అని ఆయన అన్నారు. అలీగఢ్ లో తయారు అయ్యే తాళం కప్పలు ఇళ్ళను, దుకాణాల ను పరిరక్షిస్తాయి అనే ఒక ఖ్యాతి ఇంతవరకు ఉండగా, ఇక మీదట దేశ సరిహద్దుల ను కాపాడేటటువంటి ఉత్పత్తుల ను రూపొందించే ఘనత ను కూడా సాధించుకోనుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఇది దేశం లో యువత కు, ఎమ్ఎస్ఎమ్ఇ రంగాని కి సరికొత్త అవకాశాల ను కల్పిస్తుంది అని ఆయన తెలిపారు.

 

ఇవాళ, ఉత్తర్ ప్రదేశ్ దేశం లో, ప్రపంచం లో ప్రతి ఒక్క చిన్న ఇన్వెస్టర్ కు, ప్రతి ఒక్క పెద్ద ఇన్వెస్టర్ కు ఒక అత్యంత ఆకర్షణీయం అయినటువంటి ప్రదేశం గా రూపుదిద్దుకొంటోంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఇది జరగాలి అంటే పెట్టుబడి కి అవసరమైన వాతావరణాన్ని కల్పించాలి అని శ్రీ నరేంద్ర మోదీ అంటూ, దీనికి అవసరమైన సదుపాయాల ను అందుబాటు లోకి తీసుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ రెండు ఇంజిన్ ల ప్రభుత్వం అందించే జోడు ప్రయోజనాల తాలూకు ఒక ఘనమైన ఉదాహరణ గా మారుతోంది అని ఆయన అన్నారు.

 

దేశ అభివృద్ధి ప్రయాణం లో ఒక అడ్డుగోడ గా భావించిన ఉత్తర్ ప్రదేశ్, ప్రస్తుతం దేశం లో పెద్ద ప్రచార ఉద్యమాల కు నాయకత్వం వహిస్తోంది, ఈ పరిణామాన్ని చూస్తూ ఉన్నందుకు ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

ఉత్తర్ ప్రదేశ్ లో 2017వ సంవత్సరానికన్నా ముందు కాలం లో స్థితిగతులు ఎలా ఉండేవన్నది ప్రధాన మంత్రి సమగ్రం గా వివరించారు. అప్పట్లో చోటుచేసుకొంటూ ఉండే తరహా కుంభకోణాల ను, అలాగే పాలన ను ఏ విధం గా అవినీతిపరుల కు అప్పగించడమైందీ ప్రజలు మరచిపోజాలరు; యోగి గారి ప్రభుత్వం ఉత్తర్ ప్రదేశ్ అభివృద్ధి కై చిత్తశుద్ధి తో పని చేస్తున్నది అని ప్రధాన మంత్రి అన్నారు. ఇక్కడి పరిపాలన ను గూండాలు మరియు మాఫియా ఏక పక్షం గా నడిపిన కాలం అంటూ ఒకటి ఉండేది. కానీ, ఇప్పుడో బలవంతంగా దండుకొనే శక్తుల తో పాటు మాఫియా రాజ్ ను నడుపుతున్న వారు కటకటకాల వెనుక కు వెళ్ళారు అని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

మహమ్మారి కాలం లో అత్యంత దుర్బలం గా మిగిలిన వర్గాల భద్రత కు పూచీపడటం లో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కృషి ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, ఆ కాలం లో పేదల కు ఆహార ధాన్యాల ను అందించిన తీరు ను ప్రశంసించారు. చిన్న చిన్న కమతాలు కలిగిన రైతుల కు బలాన్ని ఇవ్వాలి అనేదే కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయాస గా ఉంటోందని ప్రధాన మంత్రి అన్నారు. కనీస మద్ధతు ధర (ఎమ్ఎస్ పి) ని ఒకటిన్నర రెట్ల మేర పెంచడం, కిసాన్ క్రెడిట్ కార్డ్ విస్తరణ, బీమా పథకాని కి మెరుగు లు దిద్దడం, మూడు వేల రూపాయల పెన్శన్ వంటి అనేక కార్యక్రమాలు చిన్న రైతుల కు సాధికారిత ను కల్పిస్తున్నాయి అని ఆయన వివరించారు. రాష్ట్రం లో చెరకు రైతుల కు ఒక లక్షా నలభై వేల కోట్ల రూపాయల కు పైగా చెల్లింపు జరిగిన విషయాన్ని కూడా ప్రధాన మంత్రి వెల్లడించారు. పెట్రోల్ లో ఇథెనాల్ పాళ్ళు పెరుగుతూ ఉండటం వల్ల ఉత్తర్ ప్రదేశ్ లోని పశ్చిమ ప్రాంతాల రైతులు లాభాల ను అందుకొంటారు అని ఆయన అన్నారు.

 


(Release ID: 1754796) Visitor Counter : 279