నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొత్త కంటైనర్ స్కానర్ ఏర్పాటుతో ఎగ్జిమ్ ట్రేడ్‌ని పెంచడం లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరదీప్ పోర్ట్ ట్ర‌స్ట్

Posted On: 13 SEP 2021 11:37AM by PIB Hyderabad

సుల‌భ వ్యాపార నిర్వ‌హ‌ణ (ఈఓడీబీ) చొరవలో భాగంగా పరదీప్ పోర్ట్  సంస్థ పీఐసీటీ టెర్మినల్ దగ్గర మొబైల్ ఎక్స్‌- రే కంటైనర్ స్కానింగ్ సిస్టమ్ (ఎంఎక్స్‌సీఎస్‌) ఏర్పాటు చేయబడింది. మొత్తం 30 కోట్ల వ్య‌యంతో దీనిని ఏర్పాటు చేశారు.  పోర్టులో కంటైనర్ల భౌతిక పరీక్ష, పోర్టులో కంటైన‌ర్‌లు నిలిచి ఉండే  సమయాన్ని తగ్గించ‌డ‌మే ల‌క్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు. ఎంఎక్స్‌సీఎస్ వ్య‌వ‌స్థ‌ యొక్క విజయవంతమైన ట్రయల్ రన్ చేసిన తరువాత, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ (ఏఈఆర్‌బీ) పారదీప్ కస్టమ్స్ వారు త‌మ నిత్య కార్య‌క‌లాపాల‌లో ఈ స్కానింగ్ వ్య‌వ‌స్థ‌ను వినియోగించేందుకు 2021 ఆగస్టు 27 న లైసెన్స్ జారీ చేసింది. ఆ స్కానర్ ఒక గంటకు 25 కంటైనర్‌ల వరకు స్కాన్ చేయగలదు, ట్రేడ్ అప్‌గ్రేడ్ సెక్యూరిటీ మరియు జీరో అవాంతరాలతో తమ కంటైనర్లను నేరుగా బయటకు తరలించడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఇది  పరిశ్రమల యొక్క దీర్ఘకాల అవసరాలను తీర్చడానికి పోర్ట్ ద్వారా కంటైనర్లలో ప‌లు ముక్కలు చేయని మెటాలిక్ స్క్రాప్ మెటీరియల్స్ తరలింపును సులభతరం చేస్తుంది. ఎగ్జిమ్ వాణిజ్యానికి సహాయపడటానికి లాజిస్టిక్ ఖర్చును తగ్గించడానికి పార‌దీప్ పోర్ట్ ట్ర‌స్ట్  (పీపీటీ) నిరంతర ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చొరవకు అనుగుణంగా ఈ కార్య‌క్ర‌మాలు ఉన్నాయి. కొత్త  స్కాన‌ర్ కార్య‌క‌లాపాలు పరదీప్ పోర్టులో కంటైనర్ వాల్యూమ్‌ను పెంచుతుందని భావిస్తున్నారు. ఆర్‌సీఎల్, జెడ్ఐఎం ఇంట‌ర్నేషనల్ షిప్పింగ్ లైన్ మరియు శ్రేయాస్ షిప్పింగ్ వంటి షిప్పింగ్ లైన్‌లు పోర్టుకు క్రమం తప్పకుండా త‌మ క‌ర్య‌క‌లాపాల‌కు వినియోగిస్తున్నాయి.  పోర్ట్ అందించే అప్‌గ్రేడ్ సౌకర్యాలు మరియు భారీ డిస్కౌంట్‌ను పరిగణనలోకి తీసుకుని ఇతర ప్రధాన లైనర్ సంస్థ‌లు కూడా పోర్ట్‌ను వినియోగించే విష‌యంలో ఆయా కంపెనీల‌ను అనుసరించే అవకాశం ఉంది.

***

 


(Release ID: 1754545) Visitor Counter : 186