ప్రధాన మంత్రి కార్యాలయం
సర్దార్‌ధామ్ భవన్ లోక్ అర్పణ్ గావించిన ప్రధానమంత్రి, సర్ధార్‌ధామ్ -ఫేజ్ 2 కన్యాఛాత్రాలయకు భూమి పూజ
ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి 100 వ పుణ్యతిథి సందర్భంగా వారణాశిలోని బిహెచ్‌యులో ఆర్ట్స్ ఫాకల్టీ తమిళ్ స్టడీస్‌లో సుబ్రహ్మణ్యభారతి పీఠాన్నిఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించిన ప్రధానమంత్రి
సర్దార్ సాహెబ్ దర్శించిన ఏక్ భారత్,శ్రేష్ఠ్ భారత్ తాత్వికత , మహాకవి భారతి తమిళ రచనల్లో ఎంతగానో మెరుస్తున్నదన్న ప్రధానమంత్రి
నాటి సెప్టెంబర్ 11 ఘటనల వంటి వాటికి శాశ్వత పరిష్కారం ఇలాంటి మానవ విలువలద్వారానే అని ప్రపంచం గుర్తిస్తున్నది : ప్రధానమంత్రి
కోవిడ్ మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపింది. అయితే జరిగిన నష్టం కంటే వేగంగా ఆర్ధిక వ్యవస్థ కోలుకుంటున్నది
పెద్ద ఆర్థిక వ్యవస్థలు రక్షణాత్మకంగా ఉంటే ఇండియా సంస్కరణలు చేపడుతున్నది: ప్రధానమంత్రి
Posted On:
11 SEP 2021 1:00PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సర్దార్‌ధామ్ భవన్ లోక్ అర్పణ్ కార్యక్రమం నిర్వహించారు. అలాగే సర్దార్ ధామ్ ఫేజ్ -2 కన్యా ఛాత్రాయలయకు ఈరోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గణేశ్ ఉత్సవ్ సందర్భంగా సర్దార్ ధామ్ భవన్ ప్రారంభం అవుతుండడం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. గణేశ్ చతుర్థి ఉత్సవాలు, రుషి పంచమి , క్షమవాణి దివస్ సందర్భంగా ప్రధానమంత్రి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. సర్దార్‌ధామ్ ట్రస్ట్‌తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని ప్రధానమంత్రి అభినందించారు. మానవాళి సేవకు వారు అంకితభావంతో చేస్తున్న కృషిని ప్రధానమంత్రి అభినందించారు.పాటిదార్ సొసైటీ, పేదలు, ప్రత్యేకించ మహిళలకు సాధికారత కల్పించడంలో వారి శ్రద్ధను ప్రధాని ప్రశంసించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి,ఈరోజు ప్రారంభించిన హాస్టల్ సదుపాయంతో ఎంతో మంది విద్యార్థినులు ముందుకు రావడానికి ఇది దోహదపడుతుందని అన్నారు. అత్యంత అధునాతనమైన ఈ భవనంలో బాలికల వసతిగృహం, ఆధునిక లైబ్రరీ వంటివి వారి సాధికారతకు ఉపకరిస్తాయని అన్నారు. ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్ డవలప్‌మెంట్ సెంటర్ గుజరాత్‌కు సంబంధించి బలమైన వ్యాపార గుర్తింపునకు దోహదం చేస్తుందన్నారు. సివిల్ సర్వీసెస్‌సెంటర్, సివిల్ సర్వీసులు, డిఫెన్స్, న్యాయ సేవా రంగాలపట్ల ఆసక్తి ఉన్న వారికి ఇది నూతన మార్గం చూపుతుందన్నారు.సర్దార్‌ధామ్ దేశ భవిష్యత్‌నిర్మాణానికి దోహదపడే వ్యవస్థమాత్రమే కాక, సర్దార్‌సాహెబ్ ఆదర్శౄలను భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలిచేలా చేస్తుందని అన్నారు.
ఈరోజు సెప్టెంబర్ 11, ప్రపంచ చరిత్రలో చూసుకుంటే మానవాళిపై దాడి జరిగిన రోజు గా అందరికీ తెలుసునన్నారు.. అయితే ఈ తేదీ మొత్తం ప్రపంచానికి చాలా నేర్పిందని అన్నారు. మరో వైపు 1893 సెప్టెంబర్ 11న చికాగోలో ప్రపంచ సర్వమత సమ్మేళనం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రపంచ సమ్మేళనంలో స్వామివివేకానందుడు లేచి ప్రపంచానికి భారతీయ మానవతా విలువలను పరిచయం చేశారని అన్నారు. ఇవాళ ప్రపంచం, అమెరికాలో జంట టవర్లు కూలిన సెప్టెంబర్ 9 నాటి దారుణ ఘటనలకు శాశ్వత పరిష్కారం ఈ మానవతా విలువలలోనే ఉన్నదని ప్రపంచం తెలుసుకుంటున్నదని ఆయన అన్నారు.
సెప్టెంబర్ 11 మరో ముఖ్యమైన రోజు అని కూడా ప్రధానమంత్రి అన్నారు. ఈరోజు ప్రముఖ తమిళ కవి, గొప్ప పండితుడు,తాత్వికుడు, స్వాతంత్య్రసమరయోధుడు సుబ్రహ్మణ్యభారతి 100 వ వర్ధంతి అన్నారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ దర్శించిన ఏక్ భారత్ , శ్రేష్ఠ్ భారత్, సుబ్రహ్మణ్యభారతి తమిళ రచనలలో అద్భుతంగా మెరుస్తున్నదని ప్రధానమంత్రి అన్నారు. సుబ్రహ్మణ్యభారతి స్వామి వివేకానందనుంచి ప్రేరణ పొందారని , అరవిందులనుంచి ప్రభావితులయ్యారని అన్నారు. సుబ్రహ్మణ్యభారతి కాశీలో నివశించే రోజులలో తన ఆలోచనలకు కొత్త దిశ, కొత్త శక్తిని ఇచ్చారని ఆయన అన్నారు.
వారణాశిలోని బనారస్‌హిందూ విశ్వవిద్యాలయంలో తమిళ్ స్టడీస్‌లో సుబ్రహ్మణ్యభారతి పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధానమంత్రి ప్రకటించారు. ఆర్ట్స్ ఫాకల్టీలో దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. సుబ్రహ్మణ్యభారతి మానవాళి ఐక్యతను , భారత దేశ ఐక్యతపై ప్రత్యేకంగా ప్రస్తావించారని అన్నారు. ఆయన ఆలోచనలు భారతదేశ ఆలోచలు తాత్వికతలో అంతర్భాగమని ఆయన అన్నారు.
గుజరాత్ గతం నంచి ఇప్పటి వరకు సమష్ఠి కృషితో ముందుకు సాగుతున్న భూమి అని ప్రధాని అన్నారు. గాంధీ మహాత్ముడు స్వాతంత్య్రోద్యమంలో దండి యాత్రను ఇక్కడినుంచే ప్రారంభించారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అలాగే సర్దార్‌పటేల్ నాయకత్వంలో ఖేడా ఉద్యమం సాగిందని, ఇందులో రైతులు, యువత, పేద ప్రజల ఐక్యత బ్రిటిష్ ప్రభుత్వం దిగివచ్చేలా చేసిందని అన్నారు. ఆనాటి స్ఫూర్తి, ప్రేరణ మన ముందు ఐక్యతా విగ్రహం రూపంలో సర్దార్ వల్లభాయ్ నిలువెత్తు విగ్రంలో గుజరాత్ గడ్డపై మనకు సాక్షాత్కరిస్తున్నదని ఆయన చెప్పారు.
సమాజంలో వెనుకబడిన వర్గాలను ముందుకు తెచ్చేందుకు నిరంతర కృషి జరుగుతున్నదని ప్రధానమంత్రి చెప్పారు. ఇవాళ ఒక చేతితో దళితులు సామాజికంగా వెనుకబడిన వర్గాల హక్కులకు సంబంధించిన కృషి జరుగుతున్నదని , మరోవైపు ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు పదిశాతం రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు. ఈ చర్యలు సమాజంలో కొత్త విశ్వాసాన్ని కల్పిస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు.
నూతన విద్యా విధానం మన విద్యార్దులను మొదటినుంచే మార్కెట్‌లో అవసరం ఉన్న నైపుణ్యంగల వారిగా తీర్చిదిద్దుతుందని అన్నారు. స్కిల్ ఇండియా కార్యక్రమం కూడా దేశానికి అత్యంత ప్రాధాన్యత గల అంశమని ఆయన అన్నారు. ఈ మిషన్ కింద లక్షలాది మంది యువత వివిధ నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం పొందారని స్వావలంబన సాధిస్తున్నారని అన్నారు. గుజరాత్ లో గత ఎన్నో ఏళ్లుగా సాగిస్తున్న కృషి వల్ల గుజరాత్‌లో ఒక వైపు పాఠశాల విద్యను మధ్యలో మానేసేవారి సంఖ్య 1 శాతంకంటే తక్కువకు పడిపోయిందని అన్నారు. అలాగే మరోవైపు లక్షలాది మంది యువతకు వివిధ పథకాల కింద నూతన భవిష్యత్‌ను కల్పించడం జరిగిందన్నారు. ఇవాళ గుజరాత్‌యువత ప్రతిభ స్టార్టప్ ఇండియా వంటి ప్రచారాల వల్ల కొత్త అవకాశాలు పొందుతున్నారని అన్నారు.
ప్రధానమంత్రి ఈ సందర్బంగా పాటిదార్ సొసైటీని అభినందించారు. వీరు ఎక్కడికి వెళ్లినా వ్యాపారనికి సరికొత్త గుర్తింపు తెస్తారని అన్నారు. ఇవాళ మీ నైపుణ్యాలకు గుజరాత్‌లోనే కాదు , దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది అని అన్నారు. పాటిదార్ సమాజానికి ఇంకో ముఖ్య లక్షణం కూడా ఉందన్నారు. వారు ఎక్కడ ఉన్నా భారత దేశ ప్రయోజనాలు వారికి అత్యంత ముఖ్యమైనవని అన్నారు.
కోవిడ్ మహమ్మారి ఇండియాపై ప్రభావం చూపిందని, అయితే మన ఆర్థిక వ్యవస్థ రికవరీ , జరిగిన నష్టం కంటే శరవేగంతో ముందుకు పోతున్నదని ఆయన అన్నారు. బడా ఆర్ధిక వ్యవస్థలు రక్షణాత్మకంగా వ్యవహరిస్తుంటే ఇండియా సంస్కరణలు చేపడుతున్నదన్నారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు విచ్చిన్నమతే,మనం వాటిని ప్రారంభిస్తున్నామన్నారు. పిఎల్ఐ పథకం ఇండియాకు అనుకూలమైనదన్నారు. టెక్స్‌టైల్ రంగంలో ఇటీవల ప్రారంభించిన పిఎల్ఐ సూరత్ వంటి నగరాలకు ఎంతో ప్రయోజనకరమని ప్రధానమంత్రి అన్నారు.
****
(Release ID: 1754372)
Visitor Counter : 284
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam