ప్రధాన మంత్రి కార్యాలయం
సెప్టెంబర్ 11వ తేదీన సర్దార్ధం భవనాన్ని జాతికి అంకితం చేసి, సర్దార్ధం రెండవ దశ కింద బాలికల వసతి గృహానికి భూమి పూజ నిర్వహించనున్న - ప్రధానమంత్రి
Posted On:
10 SEP 2021 1:08PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2021 సెప్టెంబర్, 11వ తేదీ ఉదయం 11 గంటలకు, దృశ్య మాధ్యమం ద్వారా, సర్దార్ధం భవనాన్ని జాతికి అంకితం చేసి, సర్దార్ధం రెండవ దశ కింద బాలికల వసతి గృహానికి భూమి పూజ, నిర్వహించనున్నారు.
విద్య, సామాజిక పరివర్తన, సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతితో పాటు యువతకు ఉపాధి అవకాశాలను అందించడం కోసం, సర్దార్ధం, కృషి చేస్తోంది. అహ్మదాబాద్ లో ఏర్పాటు చేయబడిన ఈ సర్దార్ధం భవనంలో అత్యాధునిక సౌకర్యాలతో, విద్యార్థుల కోసం అధునాతన సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా 2,000 మంది బాలికలకు ఈ కన్యా ఛత్రాలయలో వసతి సౌకర్యం కల్పించనున్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
*****
(Release ID: 1753982)
Visitor Counter : 216
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada