ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని కలుసుకొన్న రష్యన్ ఫెడరేశన్ భద్రత మండలి కార్యదర్శి శ్రీ నికోలోయి పెత్రుశెవ్

Posted On: 08 SEP 2021 8:00PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని రష్యన్ ఫెడరేశన్ భద్రత మండలి కార్యదర్శి గౌరవనీయులు శ్రీ నికోలోయి పెత్రుశెవ్ ఈ రోజు న కలుసుకొన్నారు.

జాతీయ భద్రత సలహాదారు తో, విదేశీ వ్యవహారాల మంత్రి తో అంతక్రితం జరిగిన ఫలప్రదం గా ముగిసిన సంప్రదింపుల తాలూకు వివరాల ను కార్యదర్శి శ్రీ పెత్రుశెవ్

ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు వచ్చారు. భారతదేశం తో రష్యా కు ఉన్న ‘ప్రత్యేకమైనటువంటి మరియు విశేష అధికారాల తో కూడినటువంటి వ్యూహాత్మక

భాగస్వామ్యాన్ని’ మరింత గా గాఢతరం చేసుకొనేందుకు రష్యా దృఢమైన వచనబద్ధత ను కలిగివుందని శ్రీ పెత్రుశెవ్ తెలిపారు.

ఈ ప్రాంతం లో పెద్ద మార్పు లు చోటుచేసుకుంటున్న సమయం లో కార్యదర్శి శ్రీ పెత్రుశెవ్ నాయకత్వం లో రష్యా ప్రతినిధి వర్గం భారతదేశం యాత్ర కు విచ్చేయడాన్ని

ప్రధాన మంత్రి ప్రశంసించారు.


భారతదేశం- రష్యా భాగస్వామ్యం పట్ల నిరంతరం శ్రద్ధ తీసుకొంటున్నందుకు అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్‌ కు తన తరఫు న కృతజ్ఞతల ను తెలియజేయవలసింది గా

ఆయన కార్యదర్శి శ్రీ పెత్రుశెవ్‌ ను కోరారు. సమీప భవిష్యత్తు లో ద్వైపాక్షిక శిఖర సమ్మేళనం కోసం రానున్న అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్‌ కు భారతదేశం లో స్వాగతం

పలకడం కోసం తాను ఉత్సాహం తో ఎదురుచూస్తున్నట్లు కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భం లో వెల్లడించారు.
 

*****



(Release ID: 1753366) Visitor Counter : 207