సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్‌ను క‌లిసిన కేంద్ర సమాచార, ప్రసార శాఖ స‌హాయ మంత్రి డా.ఎల్ మురుగ‌న్


- ఈరోడ్ నుండి ధారాపురం మీదుగా పళని వరకు బ్రాడ్-గేజ్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాల‌ని అభ్యర్థన

Posted On: 07 SEP 2021 1:11PM by PIB Hyderabad

కేంద్ర సమాచార, ప్రసార మరియు మత్స్యశాఖ, పశుసంవర్ధక & పాడిపరిశ్రమ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ కేంద్ర రైల్వే మంత్రి  అశ్విని వైష్ణవ్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా డా.ఎల్ మురుగ‌న్ రైల్వే మంత్రిని ఈరోడ్ నుండి ధారాపురం మీదుగా పళని వరకు కొత్త బ్రాడ్-గేజ్ రైల్వే లైన్ అవ‌శ్య‌క‌త‌ గురించి చర్చించారు.   బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణం చేప‌ట్టాల‌న్న‌ది  ధరాపురం ప్రజల దీర్ఘకాల‌ డిమాండ్. ఈ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్  నిర్మాణం వ‌ల్ల స్థానిక ప్ర‌జ‌ల సర్వతోముఖాభివృద్ధికి, వ్యవసాయ-ఆర్థిక వ్యవస్థను పెంచేందుకు దోహ‌దం చేస్తుంద‌న్న‌ది  ఇక్క‌డి  ప్రజల కోరుతూ వ‌స్తున్నారు. ఈ స‌మావేశం సంద‌ర్భంగా డాక్టర్ మురుగన్ వారణాసి నుండి కాంచీపురం మీదుగా రామేశ్వరం వరకు సాధారణ ఎక్స్‌ప్రెస్ రైలు స‌ర్వీసును ప్రారంభించాలని అభ్యర్థించారు. దేశీయ పర్యాటకాన్ని పెంపొందించడానికి వారసత్వ నగరం కాంచీపురాన్ని రామాయణ్ సర్క్యూట్‌తో అనుసంధానించడానికి ఇది ఎంత‌గానో దోహ‌దపడుతుందని వివ‌రించారు. శ్రీ. సమావేశంలో భాగంగా హాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్  చేసిన రెండు ప్ర‌తిపాద‌న‌ల‌పై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్  వివరణాత్మక ఆలోచన చేశారు. తమిళనాడులో రైల్వే నెట్‌వర్క్ అభివృద్ధి మరియు అధునికీక‌ర‌ణకు అన్ని  విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

***



(Release ID: 1752868) Visitor Counter : 147