ప్రధాన మంత్రి కార్యాలయం
సెప్టెంబర్ 7న జరుగనున్న శిక్షక్ పర్వ్ ఒకటో సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
విద్య రంగం లో అనేక కీలక కార్యక్రమాల ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు
Posted On:
05 SEP 2021 2:27PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 సెప్టెంబర్ 7న ఉదయం 10 గంటల 30 నిమిషాల కు జరుగనున్న శిక్షక్ పర్వ్ ప్రారంభిక సమ్మేళనాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు. అదే కార్యక్రమం లో ఆయన విద్య రంగం లో అనేక కీలకమైనటువంటి కార్యక్రమాల ను కూడా ప్రారంభిస్తారు.
భారతీయ సంజ్ఞా భాష నిఘంటువు (వినికిడి శక్తి కి దూరమైనటువంటి వారికి యూనివర్సల్ డిజైన్ ఆఫ్ లర్నింగ్ కు అనుగుణం గా రూపొందించినటువంటి ఆడియో ఎండ్ టెక్స్ ట్ ఎంబెడెడ్ సైన్ లాంగ్వేజ్ వీడియో) ను, టాకింగ్ బుక్స్ (దృశ్య జ్ఞానం లోపించినటువంటి వారి కోసం రూపొందించిన ఆడియో బుక్స్) ను, సిబిఎస్ ఇ తాలూకు స్కూల్ క్వాలిటీ అశ్యోరన్స్ ఎండ్ అసెస్ మెంట్ ఫ్రేం వర్క్ ను, నిపుణ్ భారత్ కోసం రూపొందించినటువంటి నిష్ఠ గురువుల శిక్షణ కార్యక్రమాన్ని, అలాగే విద్య వాలంటియర్ లు, దాత లు/ పాఠశాల అభివృద్ధి కై సిఎస్ ఆర్ కంట్రిబ్యూటర్ లకై రూపొందిన ‘విద్యాంజలి పోర్టల్’ ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు.
‘‘క్వాలిటీ ఎండ్ సస్టెయినబుల్ స్కూల్స్: లర్నింగ్స్ ఫ్రమ్ స్కూల్స్ ఇన్ ఇండియా’’ అనేది ‘శిక్షక్ పర్వ్-2021’ తాలూకు ఇతివృత్తం గా ఉంది. ఈ సమ్మేళనం అన్ని స్థాయిల లో విద్య బోధన నిరంతరం గా కొనసాగేటట్లు పూచీపడడానికే కాకుండా దేశ వ్యాప్తం గా బడుల లో విద్య బోధన నాణ్యత ను, అన్ని రకాల అభ్యాసాల ను కలుపుకొని పోయే ప్రయత్నాల ను, స్థాయి లో సంస్కరణ కోసం నూతన పద్ధతులను, రీతుల ను ప్రోత్సహించగలదు.
విద్య శాఖ కేంద్ర మంత్రి, విద్య శాఖ సహాయ మంత్రులు కూడా ఈ కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు.
***
(Release ID: 1752367)
Visitor Counter : 221
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam