ప్రధాన మంత్రి కార్యాలయం

హిమాచల్ ప్రదేశ్ లో కోవిడ్టీకాకరణ కార్యక్రమం లబ్ధిదారులతో, ఆరోగ్య సంరక్షణ శ్రామికులతో సెప్టెంబర్ 6నసమావేశం కానున్న ప్రధాన మంత్రి

Posted On: 04 SEP 2021 7:08PM by PIB Hyderabad

హిమాచల్ ప్రదేశ్ లో కోవిడ్ టీకాకరణ కార్యక్రమం లబ్ధిదారులతో, ఆరోగ్య సంరక్షణ శ్రామికులతో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సెప్టెంబర్ 6న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సమావేశం కానున్నారు.

హిమాచల్ ప్రదేశ్ తన జనాభా లో అర్హులైనవారందరికీ కోవిడ్ టీకామందు తాలూకు ఒకటో డోసు ను ఇప్పించడం లో సఫలం అయింది. రాష్ట్రం చేపట్టిన ప్రయాసల లో దుర్గమ ప్రాంతాల పై శ్రద్ధ తీసుకోవడం కోసం భౌగోళిక పరం గా ప్రాధాన్య క్రమాన్ని నిర్దేశించుకోవడం, ప్రజల లో చైతన్యాన్ని కలుగజేయడం కోసం కార్యక్రమాల ను నిర్వహించడం, ఎఎస్ హెచ్ఎ శ్రామికులు ఇంటింటికీ వెళ్లడం తదితరాలు భాగం గా ఉన్నాయి. రాష్ట్రం మహిళల కు, వయస్సు మీరిన వారికి, దివ్యాంగ జనుల కు, పరిశ్రమల లో పనులు చేస్తున్న శ్రామికుల కు, దినసరి వేతనాన్ని పొందుతున్న వర్గాల వంటి వారి పై ప్రత్యేక ధ్యాస ను పెట్టింది. అంతేకాక ఈ మైలురాయి ని చేరుకోవడం కోసమని ‘‘సురక్షా కీ యుక్తి- కరోనా సే ముక్తి’’ వంటి ప్రత్యేక ప్రచార ఉద్యమాల ను కూడాను మొదలుపెట్టింది.

ఈ సమావేశ కార్యక్రమం లో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పాలుపంచుకోనున్నారు.

 

***



(Release ID: 1752113) Visitor Counter : 150