ఆయుష్

ఆయుష్ మంత్రిత్వ శాఖలో 'మీ ద్వారా ఆయుష్ ' ప్రారంభించిన డాక్టర్ ముంజ పర మహేంద్ర భాయ్


ప్రారంభ కార్యక్రమంలో 21 రాష్ట్రాలలోని 44 ప్రాంతాల్లో రెండు లక్షల ఔషధ మొక్కల పంపిణీ

Posted On: 03 SEP 2021 4:55PM by PIB Hyderabad

' మీ ద్వారా ఆయుష్' ప్రచార కార్యక్రమాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ రోజు ప్రారంభించింది.  సిబ్బందికి ఔషధ మొక్కలను అందించి ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ పర మహేంద్ర భాయ్ ఆయుష్ భవన్ లో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడిన మంత్రి ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని కుటుంబ సభ్యులుగా సంరక్షించాలని అన్నారు.   

ఈ రోజు 21 రాష్ట్రాల్లో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. దీనిలో రెండు లక్షల మొక్కలను పంపిణీ చేయడం జరుగుతుంది. ముంబై లో ఆయుష్ మంత్రి  శ్రీ సర్బానంద సోనోవాల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రారంభ కార్యక్రమాల్లో రెండు లక్షల మొక్కలను పంపిణీ చేస్తారు.  ఏడాది కాలంలో దేశంలో 75 లక్షల ఔషధ మొక్కలను పంపిణీ చేయాలన్న లక్ష్యంతో కార్యక్రమాన్ని అమలు చేస్తారు. తేజ్ పట్టా,  స్టెవియాఅశోకజటామాంసితిప్ప తీగె అశ్వగంధఆలో వేరా శతావరినిమ్మగడ్డిగుగుళ్ళు తులసిసర్పగంధనేల వేము బ్రాహ్మీ ,ఉసిరి లాంటి ఔషధ మొక్కలను పంపిణీ చేస్తారు. 

ఈ కార్యక్రమంలో   ఆయుష్ కార్యదర్శి  వైద్య రాజేశ్ కొటెచాఆయుష్ సంయుక్త కార్యదర్శులు  శ్రీ పికె పాఠక్, శ్రీ డి సెంథిల్ పాండియన్, ఇతర సీనియర్ అధికారులు ఈ  పాల్గొన్నారు.

 

ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.  వై-బ్రేక్ యాప్ కు రూపకల్పన చేసిన మంత్రిత్వ శాఖ  రోగనిరోధక ఆయుష్ ఔషదాలను   పంపిణీ చేయడం లాంటి కార్యక్రమాలను  ఇప్పటికే ప్రారంభించింది. పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు  శ్రేణి రేపు  చర్చా కార్యక్రమాలను నిర్వహించి,  వై-బ్రేక్ యాప్‌ పై సెప్టెంబర్ 5 న  వెబ్‌నార్ ను నిర్వహిస్తుంది. 

***(Release ID: 1751792) Visitor Counter : 239