ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

నాడు పోస్టు చేయడమైనది: 01 SEP 2021 9:32AM by PIB Hyderabad

ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 1.33 కోట్ల టీకా డోసులు ఇచ్చారు.
జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 65.41 కోట్ల టీకా డోసులు ఇచ్చారు.
ఆగస్టులో 18.3 కోట్లకుపైగా టీకా డోసులు అందించారు.
గత 24 గంటల్లో 41,965 కొత్త కేసులు నమోదయ్యాయి.
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1.15 శాతంగా ఉన్నాయి.
క్రియాశీల కేసుల సంఖ్య 3,78,181.
ప్రస్తుత రికవరీ రేటు 97.51 శాతంగా ఉంది.
గత 24 గంటల్లో 33,964 మంది కోలుకున్నారు. వీటితో కలిపి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,19,93,644.
వారపు పాజిటివిటీ రేటు (2.58 శాతం) గత 68 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.61 శాతంగా నమోదైంది.
ఇప్పటివరకు 53.31 కోట్ల కొవిడ్‌ పరీక్షలు దేశవ్యాప్తంగా చేశారు.

***


(రిలీజ్ ఐడి: 1751146) సందర్శకుల సూచీ సంఖ్య : : 198
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam