ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మొత్తం గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.13,385.70 కోట్ల గ్రాంట్-ఇన్-ఎయిడ్ విడుదల


2021-22లో ఇప్పటివరకు గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 25,129.98 కోట్ల మొత్తం గ్రాంట్ విడుదలయ్యాయి

Posted On: 31 AUG 2021 12:35PM by PIB Hyderabad
ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం సోమవారం గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్లను అందించడానికి 25 రాష్ట్రాలకు రూ.13,385.70 కోట్లు విడుదల చేసింది. ఈ గ్రాంట్-ఇన్-ఎయిడ్ అనేది 2021-22 సంవత్సరంలో టైడ్ గ్రాంట్ల యొక్క మొదటి విడత. 15 వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు గ్రాంట్లు విడుదల చేశారు.
 

గ్రామీణ స్థానిక సంస్థలకు (ఆర్ఎల్బిలు) రెండు కీలకమైన సేవలు (ఏ) పారిశుధ్యం మరియు బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్) స్థితి (బి) తాగునీటి సరఫరా, వర్షపు నీటి సేకరణ, నీటి రీసైక్లింగ్ టైడ్ గ్రాంట్లు విడుదల 

చేసింది. 

పంచాయితీ రాజ్ సంస్థలకు కేటాయించిన మొత్తం గ్రాంట్-ఇన్-ఎయిడ్‌లో 60 శాతం ‘టైడ్ గ్రాంట్’. ఇది తాగునీటి సరఫరా, వర్షపు నీటి సేకరణ మరియు పారిశుధ్యం వంటి జాతీయ ప్రాధాన్యతల కోసం కేటాయించబడింది. మిగిలిన 40 శాతం ‘అన్‌టైడ్ గ్రాంట్’ మరియు జీతాల చెల్లింపు మినహా, నిర్దిష్ట అవసరాల కోసం పంచాయితీ రాజ్ సంస్థల అభీష్టానుసారం ఉపయోగిస్తారు.

కేంద్ర ప్రాయోజిత పథకాల కింద పారిశుధ్యం మరియు తాగునీటి కోసం కేంద్రం మరియు రాష్ట్రం కేటాయించిన నిధుల కంటే గ్రామీణ స్థానిక సంస్థలకు అదనపు నిధుల లభ్యతను నిర్ధారించడానికి టైడ్ గ్రాంట్లు ఉద్దేశించారు.
 

కేంద్రప్రభుత్వం నుండి రాష్ట్రాలు అందుకున్న 10 పనిదినాల్లో గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్లను బదిలీ చేయాలి. 10 పని దినాలకు మించి ఆలస్యం అయితే రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్లను వడ్డీతో విడుదల చేయాలి.

రాష్ట్రాల వారీగా ఈరోజు విడుదలైన గ్రామీణ స్థానిక సంస్థల (ఆర్ఎల్బి) గ్రాంట్లు, ఇప్పటివరకు విడుదలైన మొత్తం  ఆర్ఎల్బి గ్రాంట్లు క్రింద ఇవ్వబడ్డాయి:

 

వ.సంఖ్యా 

రాష్ట్రం 

 31-08-2021 కి విడుదలైన ఆర్ఎల్బి గ్రాంట్లు 

(రూ.కోట్లలో)

2021-22లో ఇప్పటివరకు విడుదలైన  ఆర్ఎల్బి గ్రాంట్లు   

(రూ.కోట్లలో)

1

ఆంధ్రప్రదేశ్ 

581.7

969.50

2

అరుణాచల్ ప్రదేశ్ 

51

142.75

3

అస్సాం 

355.8

593.00

4

బీహార్ 

1112.7

1854.50

5

ఛత్తీస్గఢ్ 

322.5

537.50

6

గుజరాత్ 

708.6

1181.00

7

హర్యానా 

280.5

467.50

8

హిమాచల్ ప్రదేశ్ 

95.1

158.50

9

ఝార్ఖండ్ 

374.7

624.50

10

కర్ణాటక 

713.1

1188.50

11

కేరళ 

360.9

601.50

12

మధ్యప్రదేశ్ 

883.2

1472.00

13

మహారాష్ట్ర 

1292.1

2153.50

14

మణిపూర్ 

39.3

65.50

15

మిజోరాం 

20.7

34.50

16

ఒరిస్సా 

500.7

834.50

17

పంజాబ్ 

307.8

860.00

18

రాజస్థాన్ 

856.2

2392.50

19

సిక్కిం 

9.3

15.50

20

తమిళనాడు 

799.8

2783.23

21

తెలంగాణ 

409.5

682.50

22

త్రిపుర 

42.3

70.50

23

ఉత్తరప్రదేశ్ 

2162.4

3604.00

24

ఉత్తరాఖండ్ 

127.5

212.50

25

పశ్చిమ బెంగాల్ 

978.3

1630.50

x

మొత్తం 

13,385.70

25,129.98

 

****


(Release ID: 1750786) Visitor Counter : 230