సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
కర్ణాటకలో రెండు రోజులపాటు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి శ్రీ ఎల్.మురుగన్ పర్యటన
ఇవాళ రాష్ట్రానికి చేరుకుని, ఆదివారం అనేక కార్యక్రమాల్లో పాల్గొననున్న కేంద్ర మంత్రి
प्रविष्टि तिथि:
28 AUG 2021 6:12PM by PIB Hyderabad
75 వసంతాల స్వాతంత్ర్య వేడుకలు 'ఆజాది కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా; కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి శ్రీ ఎల్.మురుగన్ కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం, మైసూరు 'ఆల్ ఇండియా రేడియో' (ఎయిర్) ప్రాంగణంలోని రీజినల్ ఔట్‌రీచ్ బ్యూరో కార్యాలయంలో ఛాయాచిత్ర ప్రదర్శనను మంత్రి ప్రారంభిస్తారు. ఈ ఛాయాచిత్ర ప్రదర్శన 3 రోజులపాటు జరుగుతుంది.
దీని తర్వాత, ఎయిర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంగీత విధ్వాంసుల ఛాయాచిత్ర ప్రదర్శన 'నాదాలయ'ను సందర్శిస్తారు.
ఆదివారం ఉదయం ఎయిర్ కార్యాలయానికి వెళ్లడానికి ముందు, సుత్తూరు మఠం స్థాపకుడు జగద్గురు డాక్టర్ శివరాత్రి రాజేంద్ర మహాస్వామిజీ 106వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత మైసూరులోని 'జేఎస్‌ఎస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, కామర్స్, సైన్స్'లో కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను ప్రారంభిస్తారు.
***
(रिलीज़ आईडी: 1750020)
आगंतुक पटल : 184