ప్రధాన మంత్రి కార్యాలయం

కొత్త డ్రోన్ నియమాలు భారతదేశాని కి ఈ రంగం లో ఒక ప్రతిష్టాత్మకమైన ఘడియ ను తీసుకు వస్తాయి: ప్రధాన మంత్రి

Posted On: 26 AUG 2021 1:26PM by PIB Hyderabad

కొత్త డ్రోన్ నియమాలు భారతదేశం లో ఈ రంగానికి ఒక ప్రతిష్టాత్మకమైన ఘడియ ను తీసుకు వస్తాయి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. కొత్త డ్రోన్ నియమావళి ఈ రంగం లో కృషి చేస్తున్న మన యువత కు, స్టార్ట్- అప్స్ కు ఎంతగానో సహాయకారి కాగలదు అని కూడా ఆయన అన్నారు.

 

 

‘‘కొత్త డ్రోన్ నియమాలు భారతదేశం లో ఈ రంగాని కి ఒక ప్రతిష్టాత్మకమైన ఘడియ ను తీసుకు వస్తాయి. ఈ నియమాలు స్వీయ ధ్రువీకరణ పైన, విశ్వాసం పైన ఆధారపడి ఉన్నాయి. ఆమోదాలు, నియమ పాలన తాలూకు ఆవశ్యకతలతో పాటు ప్రవేశం సంబంధిత అడ్డంకుల ను కూడా చెప్పుకోదగిన స్థాయి లో తగ్గించడం జరిగింది.

 

కొత్త డ్రోన్ నియమాలు ఈ రంగం లో కృషి చేస్తున్న మన యువతీ యువకుల కు, స్టార్ట్- అప్స్ కు ఎంతగానో సహాకారి కాగలవు. ఇవి వ్యాపారానికి, నూతన ఆవిష్కరణల కు సరికొత్త అవకాశాల ను ప్రసాదిస్తాయి. ఇవి భారతదేశాన్ని ఒక డ్రోన్ హబ్ గా తీర్చిదిద్దడం కోసం నూతన ఆవిష్కరణ లు, సాంకేతిక విజ్ఞానం, ఇంజినీరింగ్ లలో భారతదేశానికి ఉన్న బలాల ను ఉపయోగించుకోవడం లో సాయపడుతాయి’’ అని ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో పేర్కొన్నారు.

 

***

DS/SH



(Release ID: 1749243) Visitor Counter : 124